AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asaduddin Owaisi: ముస్లింలు ప్రభుత్వాన్ని మార్చలేరు.. ఓటు బ్యాంక్‌పై ఓవైసీ కీలక కామెంట్స్‌..

Asaduddin Owaisi: జ్ఞాన్‌వాపి మసీదు, ముస్లిం ఓటు బ్యాంక్‌పై కీలక కామెంట్స్‌ చేశారు అసదుద్దీన్‌ ఓవైసీ. ఆయన కామెంట్స్‌ ఇప్పుడు కొత్త చర్చకు దారితీశాయి. ఇంతకీ ఆయన ఏమన్నారు?

Asaduddin Owaisi: ముస్లింలు ప్రభుత్వాన్ని మార్చలేరు.. ఓటు బ్యాంక్‌పై ఓవైసీ కీలక కామెంట్స్‌..
Asaduddin Owaisi
Sanjay Kasula
|

Updated on: May 15, 2022 | 7:22 AM

Share

ముస్లింలు ప్రభుత్వాన్ని మార్చలేరని, ఈ దేశంలో ఎప్పుడూ ముస్లిం ఓటు బ్యాంకు లేదని సంచలన కామెంట్స్‌ చేశారు, ఎంఐఎం(AIMIM) చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీ( Asaduddin Owaisi). ముస్లీంలు ప్రభుత్వాన్ని మార్చగలిగితే, భారత పార్లమెంట్‌లో ఇంత తక్కువ ముస్లిం ప్రాతినిధ్యం ఎందుకు ఉందని ప్రశ్నించారు. బాబ్రీ మసీదుకు బదులు అప్పుడు ప్రభుత్వాన్ని మార్చగలిగితే, ఇప్పుడు జ్ఞానవాపి సమస్య తెరపైకి ఎందుకు వచ్చేదని అన్నారు. తాము ఇప్పటికే ఒక మసీదును కోల్పోయామని, మరో మసీద్‌ను కోల్పోవడానికి తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. 1986లో మసీదును ముట్టుకోబోమని సుప్రీంకోర్టుకు చెప్పి, మసీదును కూల్చివేశారని ఆరోపించారు అసద్.

బాబ్రీ మసీదు కూల్చివేతను, జ్ఞాన్‌వాపి మసీదులో జరుగుతున్న సర్వేతో పోల్చారు ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ. మరో మసీదు స్థితిని మార్చడానికి అనుమతించబోమని తేల్చి చెప్పారు. వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు సర్వేకు, వారణాసి కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఒవైసీ ఈ కామెంట్స్‌ చేశారు. కాశీవిశ్వనాథ దేవాలయం పక్కనే ఉన్న మసీదులో, కోర్టు ఆదేశాల మేరకు సర్వే ప్రారంభించారు అధికారులు.

ఇదిలావుంటే.. శనివారం జ్ఞానవాపి మసీదు బేస్‌మెంట్‌లో సర్వే సందర్భంగా గోడలపై త్రిశూల్, స్వస్తిక్ గుర్తులు కనిపించాయి. వారి డిజైన్ శైలిని కోర్టు కమిషనర్, న్యాయవాదులు అంచనా వేశారు. మూలాల ప్రకారం.. నేలమాళిగలో మొసలి క్రాఫ్ట్‌ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. నేలమాళిగలో ఆలయ శిఖరం అవశేషాలను కనిపించడంతో సర్వేలో కూడా సమస్య ఏర్పడింది.

శనివారం ఉదయం 8 గంటలకు కమిషన్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. కోర్టు కమిషనర్ అజయ్ కుమార్ మిశ్రా, విశాల్ సింగ్, అజయ్ ప్రతాప్ సింగ్ అన్ని పార్టీల సభ్యులతోపాటు మసీదులోకి ప్రవేశించారు. కమిటీ సభ్యులు అంతా ముందుగా మసీదు పశ్చిమ గోడను చూసేందుకు అక్కడికి చేరుకున్నారు. దాదాపు 10 నిమిషాల పాటు ఇక్కడే ఉండి.. అందులోని బేస్‌మెంట్‌కు పరిశీలించారు.

డీఎం ఆదేశాల మేరకు అంజుమన్ ఇన్సంజరియా మసాజిద్ కమిటీ తాళాలు తెరిచింది. ఈ బృందం నాలుగు గదులను ఒక్కొక్కటిగా సర్వే చేసింది. నేలమాళిగలో కిటికీలు లేదా లైటింగ్ లేకపోవడంతో.. ఆలయ నిర్వాహకులు దీపాలంకరణ ఏర్పాటు చేశారు. సర్వే సందర్భంగా బేస్‌మెంట్‌లోని పిల్లర్లు, తలుపులు, గోడలను కొలిచారు. పెవిలియన్ ఎత్తు గోడల మందంతో కొలుస్తారు. పిల్లర్లపై ఉన్న బొమ్మలపై పేరుకుపోయిన దుమ్మును తొలగించారు. ఆ బొమ్మలను పరిశీలించారు.

జాతీయ వార్తల కోసం 

ఇవి కూడా చదవండి: Amit Shah: తెలంగాణను మరో బెంగాల్‌లా మారుస్తున్నారు.. కేసీఆర్‌పై విరుచుకుపడిన అమిత్‌షా..

Prashant Kishor: పీకే సలహాల మేరకు కాంగ్రెస్ వ్యూహంలో కీలక మార్పులు.. ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌లో చోటు!