Congress Chintan Shivir: చింతన్ శిబిర్‌లో కాంగ్రెస్ కీలక నిర్ణయం.. రాహుల్ పాదయాత్రకు ప్లాన్..

ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ వచ్చే ఏడాది కాలంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు యాత్ర చేపట్టనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో ఎక్కువభాగం పాదయాత్ర చేస్తారని.. దేశంలోని..

Congress Chintan Shivir: చింతన్ శిబిర్‌లో కాంగ్రెస్ కీలక నిర్ణయం.. రాహుల్ పాదయాత్రకు ప్లాన్..
Rahul Gandhi Padyatra
Follow us

|

Updated on: May 15, 2022 | 8:14 AM

ఉదయ్‌పూర్‌లో జరుగుతున్న చింతన్ శిబిర్ లో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ వచ్చే ఏడాది కాలంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు యాత్ర చేపట్టనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో ఎక్కువభాగం పాదయాత్ర చేస్తారని.. దేశంలోని ప్రజల సమస్యలు తెలుసుకుంటారని పేర్కొన్నారు. త్వరలోనే దీనిపై ప్రకటన రానున్నట్లు సమాచారం. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కాంగ్రెస్‌(Congress) చింతన్‌ శివర్‌(Chintan Shivir) కొనసాగుతోంది. కాగా, 2024 సార్వత్రిక ఎన్నికల కోసం కాంగ్రెస్‌ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. రాహుల్ గాంధీ వచ్చే ఏడాదిలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పర్యటించనున్నారు. ఈ ప్రయాణంలో ఎక్కువ భాగం పాదయాత్రగా ఉంటుంది. ఈ యాత్ర కార్మికులు, సాధారణ ప్రజలతో నేరుగా కనెక్ట్ అవ్వడంతోపాటు 2024 లోక్‌సభ ఎన్నికలకు కార్యకర్తలను సన్నద్ధం చేయడం ప్రధాన లక్ష్యం.

కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ బోర్డు ఏర్పాటుకు డిమాండ్

మూలాల ప్రకారం, G23 నాయకులు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఉదయపూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ చింతన్ శివిర్‌ చివరి రోజుకు చేరింది. సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ సహా పలువురు పెద్ద నేతలు ఈ సదస్సులో పాల్గొంటున్నారు.

సంస్థను బలోపేతం చేసేందుకు మేధోమథనం

మేధోమదనం కొనసాగుతోంది. కాంగ్రెస్‌ ప్రక్షాళనకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. చింతన్‌ శిబిర్‌ వేదికగా పక్కా వ్యూహాలు రచిస్తోంది హైకమాండ్‌. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నాయకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు సోనియా గాంధీ. ఇవాళ చింతన శిబిరం రెండో రోజు సందర్భంగా ఈ భేటీ జరిగింది. మరోవైపు, అసమ్మతివాదుల ముఖ్య డిమాండ్‌పై చర్చించేందుకు పార్టీ ఆమోదించింది.

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ వేదికగా కాంగ్రెస్‌ మేథో మధనం కొనసాగుతోంది. నవ సంకల్ప్‌ చింతన శిబిరం రెండో రోజు కీలకాంశాలపై కాంగ్రెస్‌ నాయకులు చర్చలు జరిపారు. శిబిరం చివరి రోజైన డిక్లరేషన్‌ను ప్రకటించనున్నారు సోనియా గాంధీ. పార్టీలో చేపట్టాల్సిన సంస్కరణలు, వచ్చే ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలు, విధానపరమైన అంశాలపై ఈ సదస్సులో మేథో మధనం జరుగుతోంది.

కాంగ్రెస్‌ పార్లమెంటరీ బోర్డ్‌ను ఏర్పాటు చేయాలన్న అసమ్మతివాదుల డిమాండ్‌ను పార్టీ ఆలకించింది. దీనిపై కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలో చర్చించేందుకు ఆమోదించింది. సీడబ్ల్యూసీలో కూడా ఆమోదముద్ర లభిస్తే పార్టీ ఎలక్షన్‌ కమిటీ స్థానంలో పార్లమెంటరీ బోర్డు ఏర్పాటవుతుంది. అసమ్మతివాదుల డిమాండ్‌ను చర్చకు ఆమోదించవద్దని గాంధీ విధేయులు అడ్డు తగిలినా లాభం లేకపోయింది.

పార్టీ పదవుల్లో సగం 50 ఏళ్లలోపు వారికి ఇవ్వాలని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ప్రాతినిధ్యం 50 శాతానికి పెంచాలన్న అంశంపై కూడా చింతన శిబిరంలో చర్చ జరిగింది. మరోవైపు, రెండో విడత జన్‌ జాగరణ్‌ అభియాన్‌పై కూడా ఈ శిబిరం సందర్భంగానే సమాలోచనలు జరిగాయి. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నాయకులతో సోనియా, రాహుల్‌ భేటీ అయ్యారు. వివిధ సమస్యలపై గత ఏడాది నవంబర్‌లో తొలి విడత జన్‌ జాగరణ్‌ అభియాన్‌ను నిర్వహించింది కాంగ్రెస్‌. త్వరలో రెండో విడతకు రెడీ అవుతోంది.

రాజకీయ వార్తల కోసం

ఇవి కూడా చదవండి: Asaduddin Owaisi: ముస్లింలు ప్రభుత్వాన్ని మార్చలేరు.. ఓటు బ్యాంక్‌పై ఓవైసీ కీలక కామెంట్స్‌..

Chandrababu: జగన్ ఇలాకాలోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్‌.. ఈనెల 18న కడపలో చంద్రబాబు పర్యటన..