Amit Shah: తెలంగాణను మరో బెంగాల్‌లా మారుస్తున్నారు.. కేసీఆర్‌పై విరుచుకుపడిన అమిత్‌షా..
Amit Shah: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా తుక్కుగూడలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. సుమారు 30 నిమిషాలు మాట్లాడిన షా టీఆర్‌ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
Amit Shah: బంగారు తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మరో బెంగాల్‌లా మార్చారని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ధ్వజమెత్తారు. ఆయన చేతకాని పాలనతోనే తెలంగాణ అప్పులమయంగా మారిపోయిందని, ఇప్పుడు మరిన్ని అప్పులు కావాలని అడుగుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా తుక్కుగూడలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. సుమారు 30 నిమిషాలు మాట్లాడిన షా టీఆర్‌ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికలు వచ్చినా బీజేపీ సిద్ధంగా ఉందని, ఈసారి టీఆర్‌ఎస్ తుడుచుకుపెట్టుకుపోవడం ఖాయమని కేంద్రమంత్రి జోస్యం చెప్పారు.
కుటుంబ విలాసాల కోసం కేంద్రం అప్పులు ఇవ్వాలా?
‘తెలంగాణను కేసీఆర్ మరో బెంగాల్ చేస్తున్నారు. ఫైవ్ స్టార్ ఫామ్ హౌజ్‌లో కూర్చొని కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారు. ఇంత అవినీతిమయమైన పాలనను నేనెక్కడా చూడలేదు. ప్రజా వ్యతిరేకతను ముందుగానే గ్రహించిన కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో కూడా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ సిద్ధంగా ఉంది. టీఆర్‌ఎస్ కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉంది. కేసీఆర్ తెలంగాణను నిండా అప్పుల్లో ముంచేశారు. ఇప్పుడు మరిన్ని అప్పులు కావాలని కోరుతున్నారు. మీ కొడుకు, కూతురు విలాసాల కోసం అప్పులు ఇవ్వాలా.? హైదరాబాద్‌లో సైన్స్ సిటీ ఏర్పాటుకు 25 ఎకరాల స్థలం అడిగితే ఇవ్వలేదు. వరంగల్‌లో సైనిక్ స్కూల్ ఏర్పాటుకోసం భూమి అడిగితే మొహం చాటేశారు. కేసీఆర్ పాలన చేతకాకపోతే పదవి నుంచి దిగిపోండి. బీజేపీ అధికారంలోకి వస్తే వరికి మద్దతు ధర ఇస్తాం. ధాన్యాన్ని మేమే కొంటాం. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు పెంచుతాం’ అని అమిత్ షా ధ్వజమెత్తారు.
అధికారంలోకి వస్తే..
ఇక బండి ప్రజా సంగ్రాయ యాత్రపై మాట్లాడిన అమిత్‌షా..’ఈ యాత్ర నిరంకుశ పాలను అంతమొందించడానికి చేసింది. ఇది ప్రజంలదరి క్షేమం కోసం చేసిన యాత్ర. కేసీఆర్‌ను గద్దె దించేందుకు నేను రావాల్సిన అవసరం లేదు, బండి సంజయ్ ఒక్కడు చాలు. రాష్ట్రంలో అధికారం కోసం సంజయ్ యాత్ర చేయలేదు. హైదరాబాద్ నిజాంను మార్చేందుకు ఈ యాత్ర చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న కేసీఆర్ ఆ హామీలు నెరవేర్చలేదు. బీజేపీ అధికారంలోకి వస్తే వాటన్నింటినీ మేము చేసి చూపిస్తాం. జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అన్నారు. దానిని అటకెక్కించారు. దళితులకు 3 ఎకరాలు అన్నారు, మూడు సెంటీ మీటర్ల స్థలం కూడా ఇవ్వలేదు. టీఆర్‌ఎస్ పాలనను అంతం చేయాల్సిన సమయం వచ్చింది. ఎవరో తాంత్రికుడు చెప్పారని కేసీఆర్ సెక్రటేరియట్ వెళ్లడం మానేశారు. నిరుద్యోగులకు ఇస్తానన్న భృతి ఇప్పటి వరకు ఇవ్వలేదు. డబుల్ బెడ్ రూమ్ పథకాన్ని నిర్వీర్యం చేశారు’ అని అమిత్‌షా తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: