Mohanlal: చిక్కుల్లో మలయాళ సూపర్ స్టార్.. విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు.. ఎందుకోసమంటే?
Mohanlal: ఘరానా మోసగాడు పురాతన వస్తువుల డీలర్ మాన్సన్ మవుకల్‌తో సంబంధాలపై మోహన్‌లాల్‌ను ఈడీ అధికారులు విచారించనున్నారు. విదేశాలకు నకిలీ పురాతన వస్తువులను ఎగుమతి చేసి. చాలామందిని మోసం చేసినట్టు మాన్సన్‌పై కేసు నమోదైంది.
Mohanlal: మలయాళం సూపర్‌స్టార్ మోహన్‌లాల్ (Mohanlal) చిక్కుల్లో పడ్డారు. మనీలాండరింగ్ కేసులో వచ్చేవారం విచారణకు హాజరుకావాలని ఆయనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) సమన్లు జారీ చేసింది. కాగా ఘరానా మోసగాడు పురాతన వస్తువుల డీలర్ మాన్సన్ మవుకల్‌తో సంబంధాలపై మోహన్‌లాల్‌ను ఈడీ అధికారులు విచారించనున్నారు. విదేశాలకు నకిలీ పురాతన వస్తువులను ఎగుమతి చేసి. చాలామందిని మోసం చేసినట్టు మాన్సన్‌పై కేసు నమోదైంది. ఈక్రమంలోనే గత ఏడాది సెప్టెంబర్‌లో మాన్సన్‌ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. తన దగ్గర టిప్పు సుల్తాన్ సింహాసనం ఉందని , ఔరంగజేబు ఉంగరం ఉందని జనానికి కుచ్చుటోపి పెట్టాడు మాన్సన్. ఇలా మాయమాటలు చెప్పి రూ.10 కోట్ల వరకు డబ్బులు లాగాడీ కేటుగాడు. అలాంటి మోసగాడి ఇంటికి ఓసారి వెళ్లారు మోహన్‌లాల్. ఇప్పుడు ఈ వ్యవహారంపైనే ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఔరంగజేబు ఉంగరం ఉందంటూ..
కాగా మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సినీ నటులు, ఉన్నతాధికారులతో మాన్సన్ కు సంబంధాలున్నట్లు ఈడీ పేర్కొంది. మోహన్‌లాల్ కలూర్‌లోని మాన్సన్ ఇంటికి వెళ్లినట్టుగా ఈడీకి వాంగ్మూలం అందింది. కాగా ఈ మోసగాడితో సన్నిహిత సంబంధాలున్న మరో నటుడు మోహన్‌లాల్‌ను అక్కడికి తీసుకువెళ్లినట్టుగా తెలుస్తోంది. ఇక కేరళ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళకు చెందిన మాన్సన్ కళాఖండాలు, అవశేషాలను సేకరించేవాడిగా నటిస్తూ ప్రజలను రూ.10 కోట్ల వరకు మోసం చేశాడు. టిప్పు సుల్తాన్ సింహాసనం, ఔరంగజేబు ఉంగరం, ఛత్రపతి శివాజీ భగవద్గీత కాపీ, సెయింట్ ఆంటోనీ వేలి గోర్లు వంటి పురాతన వస్తువులు ఉన్నాయంటూ జనానికి కుచ్చుటోపీ పెట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: