Wheat Exports: గోధుమ ఎగుమతిపై నిషేధం.. కేంద్రం సంచలన నిర్ణయానికి కారణాలు ఇవేనా?

Wheat Exports: దేశం నుంచి గోధుమల ఎగుమతిని నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ తో పాటు ధరలు పెరగటం దీని వెనుక ప్రధాన కారణంగా తెలుస్తోంది.

Wheat Exports: గోధుమ ఎగుమతిపై నిషేధం.. కేంద్రం సంచలన నిర్ణయానికి కారణాలు ఇవేనా?
Follow us

|

Updated on: May 14, 2022 | 3:44 PM

Wheat Exports: దేశం నుంచి గోధుమల ఎగుమతిని నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ తో పాటు ధరలు పెరగటం దీని వెనుక ప్రధాన కారణంగా తెలుస్తోంది. దేశంలో ఆహార భద్రత నిర్వహణ, పొరుగుదేశాలతో పాటు దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న దేశాలకు సహకారం అందించేందుకు భారత్ వీటిని వినియోగించనున్నట్లు వెల్లడించింది. ప్రపంచ మార్కెట్లలో అనూహ్యాంగా పెరిగిన డిమాండ్ కారణంగా ఈ నియంత్రణ చర్యలు చేపట్టినట్లు తన ఆదేశాల్లో వెల్లడించింది. దేశంలో అవసరాల కోసం 30 మిలియన్ టన్నుల గోధుమలను సేకరించాలని కేంద్ర పౌరసరఫరాల శాఖ యోచించింది. కానీ.. రైతులు ఎక్కువ శాతం తమ పంటను ప్రైవేటు వ్యాపారులకు అమ్మటం వల్ల కేవలం 19.5 మిలియన్ టన్నులను మాత్రమే సేకరించగిలిగింది. ఈ నిర్ణయం వెనుక మరో కారణం ఏమిటంటే.. దేశంలో గోధుమల దిగుబడి 8 సంవత్సరాల కనిష్ఠానికి చేరుకోవటం కూడా అని వెల్లడించింది. రిటైల్ ద్రవ్యోల్బణం పెరగటం కారణంగా దేశంలో గోధుమ పిండి రేట్లు 8 ఏళ్ల గరిష్ఠాన్ని తాకాయి.

మరో పక్క ఉక్రెయిన్- రష్యా యుద్ధం కారణంగా టన్నుల్లో దిగుమతులు నిలిచిపోవటం కూడా కొన్ని దేశాలపై ప్రభావం చూపుతోంది. వీటికి అధనంగా 120 సంవత్సరాల్లో ఎన్నడూ లేని ఎండలు, వేడిమి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా దిగుబడి తగ్గటం ధరల పెరుగుదలకు ఊతం ఇస్తోంది. ప్రపంచ దేశాలకు ఎక్కువగా గోధుమలను సరఫరా చేస్తున్న దేశాల్లో ఉక్రెయిన్ కూడా చాలా కీలకమైనదిగా ఉంది. దాదాపు 30 శాతం ప్రపంచ అవసరాలను ఉక్రెయిన్ తీరుస్తోంది. నల్లసముద్రం మార్గంలో ఉన్న కీలక పోర్టు రష్యా స్వాధీనం కావటంతో పరిస్థితులు దిగజారాయి. దీంతో అనేక దేశాలు ఆందోళనలో ఉన్నాయి. 2020 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా గోధుమల ఉత్పత్తి దాదాపు 765 మిలియన్ టన్నులుగా ఉంది. ఇందులో కేవలం భారత్, చైనా, రష్యాల వాటా 40 శాతంగా ఉంది. కానీ ఇప్పుడు దిగుబడులు భారీగా పడిపోవటం వల్ల ముందస్తు జాగ్రత్తలో భాగంగా భారత్ తమ ఎగుమతులపై ఆంక్షలు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

కొంతకాలం క్రితం గోధుమల ఎగుమతికి కేంద్రం సుముఖంగా ఉన్నట్లు వచ్చిన వార్తలతో ఈజిప్ట్, టర్కీ, బంగ్లాదేశ్ వంటి దేశాలు మన నుంచి భారీగా దిగుమతి చేసుకోవాలని అనుకున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం 30 మిలియన్ టన్నుల గోధుమలు అందుబాటులో ఉన్నాయి. ఇది అవసరానికి అనుగుణంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఆఫ్గనిస్థాన్ కు 50 వేల టన్నుల గోధుమలను పంపించేందుకు భారత్ సిద్ధంగా ఉంది. మరో పక్క రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఎరువుల ధరల పెరుగటం వల్ల అవుతున్న అధనపు ఖర్చులు కూడా ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. విదేశాల్లోని కొనుగోలుదారులకు గోధుమలను ఎగుమతి చేసే ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించే రైతులకు ఎరువుల ధరపై సబ్సిడీ ఇవ్వడం ఒక దుర్మార్గం, దీని కోసం భారతీయ ప్రజానీకం పన్నుల రూపంలో చెల్లించిన సొమ్ము సొంత ఆహార భద్రతకు ఎక్కువ ఖర్చు అయ్యోలా చేస్తోంది.

ఇవీ చదవండి..

Watch Video: 102 మీటర్ల సిక్స్‌ కొట్టిన ఆర్‌సీబీ బ్యాట్స్‌మెన్.. గాయపడిన అభిమాని.. వైరల్ వీడియో..

Coffee: కాఫీ తాగే అలవాటుందా..? తీసుకునే ముందు.. ఈ పదార్థాలకు దూరంగా ఉండండి