CONGRESS PARTY: పునర్వైభవం దిశగా ఆలోచనలు.. చింతన్ శిబిర్‌లో లోతైన చర్చలు.. మళ్ళీ పాత వాసనలు.. కోలుకోవడం సాధ్యమేనా?

ఇప్పుడు కూడా అలెర్ట్ కాకపోతే .... లోపాలు, వైఫల్యాలపై నిర్మొహమాటంగా చర్చించకపోతే.. ఇక కాంగ్రెస్ కోలుకోవడం కష్టమే. ఇది గమనించే కాంగ్రెస్ చింతన్‌ శిబిర్ ఏర్పాటు చేసుకుంది. సరైన దిశా లేకుండా నడిసంద్రంలో నావలాగా సాగిపోతున్న పార్టీకి ఓ చుక్కానిగా మారి..రోడ్‌ మ్యాప్‌ను సిద్ధం చేయాల్సిన కీలక మీటింగ్ ఇది.

CONGRESS PARTY: పునర్వైభవం దిశగా ఆలోచనలు.. చింతన్ శిబిర్‌లో లోతైన చర్చలు.. మళ్ళీ పాత వాసనలు.. కోలుకోవడం సాధ్యమేనా?
Congress Chintan Shivir
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: May 14, 2022 | 3:54 PM

CONGRESS PARTY INTROSPECTIVE CAMP IN-DEPTH DIALOGUES MONOTONY REPEATING: సవాళ్లు..ఎటు చూసినా సవాళ్లే.! సమస్యలు.. అన్ని వైపులా సమస్యలే.! ప్రశ్నలు..అన్నీ సమాధానం లేని ప్రశ్నలే..! హస్తవాసి ఏ మాత్రం మారడం లేదు. ఎన్నికలొస్తున్నాయి.. పోతున్నాయి.. కానీ చేతిలో గెలుపు రేఖలు మారడం లేదు. సరికదా క్రమంగా మాయమవుతున్నాయి. వరుస ఓటములు వెక్కిరిస్తున్నాయి.! ఇలా చింతలన్నీ చుట్టు ముట్టి, ముప్పేట దాడితో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సమయంలో జరుగుతోంది చింతన్ శిబిర్(Chintan Shivir).! శతాధిక వసంతాల పార్టీలో ఎప్పుడూ లేని సంక్షోభం..! నో డౌట్..! సోనియా గాంధీ(Sonia Gandhi)నుంచి రాహుల్ గాంధీ(Rahul Gandhi) వరకు అందరూ ఒప్పుకుంటున్న కఠోర సత్యమిది. ఇది పార్టీకి కొత్త రూపు.. సరికొత్త ఊపు ఇవ్వాల్సిన సమయం..! మరి చింతన్ శిబర్‌ ఈ చింతలన్నింటినీ తీరుస్తుందా? కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చుక్కాని లేని నావలా వున్న సమయంలో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజస్థాన్‌ RAJASTHANలోని ఉదయ్‌పూర్ UDAIPUR విడిది కేంద్రంలో చింతన్ శిబిర్ #ChintanShivir నిర్వహిస్తున్నారు. రాజకీయ పార్టీలన్నాక సంక్షోభాలు సహజం. ఎప్పుడూ విజయాలే కాదు ..అపజయాలూ పలకరిస్తాయి. ఓ వార్నింగ్ బెల్ మోగిస్తాయి. అది అప్రమత్తం కావాల్సిన సమయం..! వాస్తవానికి ఇలాంటి వార్నింగ్ బెల్‌ కాంగ్రెస్‌కు 2014కు ముందే మోగింది. కానీ రాబోయే ముప్పును..ప్రభుత్వ పరంగా..పార్టీ పరంగా చేసిన తప్పులని కాంగ్రెస్ పెద్దలు గుర్తించలేక పోయారు. అలా వేసిన రాంగ్‌ స్టెప్‌ రిజల్టే ఇప్పుడు కాంగ్రెస్ ప్రజెంట్ సిచ్యుయేషన్‌కు కారణం అంటే కాదనే వారు లేరేమో. 2014లో ఎదురైన ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ క్రమంగా మసకబారుతూ వచ్చింది. 2019లో ఓటమి తర్వాత అది పీక్ స్టేజ్‌కు చేరింది. చివరికి అది పార్టీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని సంక్షోభంగా మారి ఉనికి కోసం పాకులాడాల్సిన పరిస్థితిని కల్పించింది. ఇప్పుడు కూడా అలెర్ట్ కాకపోతే …. లోపాలు, వైఫల్యాలపై నిర్మొహమాటంగా చర్చించకపోతే.. ఇక కాంగ్రెస్ కోలుకోవడం కష్టమే. ఇది గమనించే కాంగ్రెస్ చింతన్‌ శిబిర్ ఏర్పాటు చేసుకుంది. సరైన దిశా లేకుండా నడిసంద్రంలో నావలాగా సాగిపోతున్న పార్టీకి ఓ చుక్కానిగా మారి..రోడ్‌ మ్యాప్‌ను సిద్ధం చేయాల్సిన కీలక మీటింగ్ ఇది. ఓవైపు ఏడు రాష్ట్రాల ఎన్నికలు తరుముకొస్తున్నాయి.. మరోవైపు 2024 ఎన్నికలకు టైమ్ దగ్గర పడుతోంది. పార్టీని గాడిలో పెట్టడంతోపాటు వచ్చే ఎన్నికలన్నింటికీ శ్రేణులను సిద్ధం చేయడం ఇప్పుడు కాంగ్రెస్ ముందున్న అతిపెద్ద సవాలు. 127 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో ఈ తరహా గడ్డుపరిస్థితులను ఆ పార్టీ గతంలో చూడలేదు. అయితే కిందపడిన ప్రతిసారి తిరిగి లేచేందుకు .. పోస్ట్‌మార్టమ్ చేసుకొని పార్టీని తిరిగి గాడిలో పెట్టేందుకు చింతన్ శిబర్‌ వంటి సమావేశాల్ని ఏర్పాటు చేస్తోంది కాంగ్రెస్. గతంలో 1974లో మొదటి చింతన్ శిబిర్ జరిగింది. ఆ తర్వాత 1998లో పంచమడి(Pachmarhi), 2003లో సిమ్లా(Shimla), 2013లో జైపూర్‌(Jaipur)లో చింతర్‌ శిబిర్‌లు నిర్వహించారు. అయితే అప్పటి పరిస్థితులు వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరు. ఇప్పటికే కాంగ్రెస్ ముక్త భారత్ అన్న నినాదంతో బీజేపీ దూసుకెళ్తోంది. ఈ స్లోగన్ పార్టీ శ్రేణులపైనా సైకలాజికల్‌గా చాలా ఎఫెక్ట్ చూపుతోంది. ఇప్పుడు కాంగ్రెస్ సొంతంగా అధికారంలో ఉన్న రాష్ట్రాలు కేవలం రెండంటే రెండే.! అందులో ఒకటి రాజస్థాన్. రెండోది ఛత్తీస్‌గఢ్. ఈ రెండు రాష్ట్రాలకు 2023లో ఎన్నికలు జరుగుతాయి. ఒకవేళ ఈ రెండింటిని గనుక మళ్లీ నిలుపుకోకపోతే బీజేపీ కోరుకున్న కాంగ్రెస్ ముక్తభారత్ సాకారమైనట్లే.

భారత్ Bharath వంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షం బలంగా ఉండాలి. అప్పుడే పాలన ఏకపక్షం కాకుండా ఉంటుంది. అందరూ ఇది ఒప్పుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ పరిస్థితి మాత్రం రోజురోజుకీ తీసికట్టుగా మారుతోంది. అందుకే చింతన్‌ శిబిర్‌ను మొక్కుబడి తంతుగా ముగించకుండా 2024కు రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయాలని హైకమాండ్ ప్లాన్. పనిలో పనిగా.. బీజేపీ BJP, మోదీ MODI పరిపాలనను ఎండగట్టనున్నారు. మే 15 వరకు జరిగే చింతన్ శిబిర్‌లో ప్రధానంగా 6 అంశాలపై ఫోకస్ చేస్తారు. రాజకీయాలు, సామాజిక న్యాయం-సాధికారికత, సంస్థాగత వ్యవహారాలు, దేశ ఆర్థిక వ్యవస్థ, రైతులు-రైతు కూలీలు, యువతకు సంబంధించి ఇష్యూలపై సుదీర్ఘంగా చర్చించి…ఫైనల్‌గా ఓ రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తారు. పార్టీ పునరుజ్జీవానికే గాక.. మొత్తం దేశానికి దిశానిర్దేశం చేసేలా ఈ తీర్మానాలు ఉండాలన్నది కాంగ్రెస్ పెద్దల ఆలోచన. ప్లానింగ్ పక్కాగానే ఉంది. కానీ దాన్ని అమలు చేయడమే ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. ఈ ఏడాది చివర్లో జరిగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు ఆ పార్టీకి మొదటి సవాల్. ఆ తర్వాత జరిగే రాజస్థాన్, మధ్య ప్రదేశ్, చత్తీస్‌గఢ్, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు రెండో సవాల్. ఈ ఎన్నికల్లో కాస్తో కూస్తో….సానుకూల ఫలితాలు సాధిస్తేనే లోక్‌సభ ఎన్నికల వరకు పార్టీ శ్రేణుల్లో ఓ విశ్వాసం ఏర్పడుతుంది. విజయం సాధించగలమనే ధైర్యం వస్తుంది. లేదంటే 127 ఏళ్ల పార్టీ భవిష్యత్‌ను ఊహించడం కూడా కష్టంగానే ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే NOW ARE NEVER అనే సిచ్యుయేషన్‌లో ఉంది కాంగ్రెస్ పార్టీ. మరి ఇంకా లోపాలను కప్పిపుచ్చుతూనే కాలం వెళ్ళదిస్తారా? చింతన్‌ శిబిర్‌లోనైనా ఖుల్లంఖుల్లాగా చర్చిస్తారా? ఇదిప్పుడు ఆసక్తి రేపుతోంది. తొలిరోజు సమావేశంలో సోనియా గాంధీ చేసిన ప్రసంగం మాత్రం మూస ధోరణిలోనే కొనసాగింది. మోదీపై విరుచుకుపడుతూనే మైనారిటీల ఓటు బ్యాంకుపైనే అధినేత్రి కన్నేసినట్లు కనిపించింది. సోనియా ప్రసంగం విన్న తర్వాత ఆ పార్టీ ఆలోచనలు ఇంకా ఆ పాతకాలం పోకడల్లోంచి బయట పడలేకపోతున్నాయా అనిపిస్తోంది. ఇంకా అదే ఫ్యామిలీ సెంటిమెంట్‌ను పట్టుకొని వెలాడుతున్నట్లు తొలిరోజే స్పష్టమైంది. ఒక్కో కుటుంబానికి ఒకటే టిక్కెట్ ఫార్ములా నుంచి నెహ్రూ ఫ్యామిలీకి మినహాయింపునివ్వడమే అందుకు నిదర్శనం. చింతర్ శిబిర్ అంటూనే బ్యాక్‌ టు బేసిక్స్‌ రాగం ఆలపిస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు. ప్రక్షాళన జరగాల్సిన అవసరాన్ని పైకి ఒప్పుకుంటున్నా.. లోలోపలు కుటుంబ ఆధిప్యతం దిశగానే అడుగులు పడుతున్నట్లు కనిపిస్తోంది. ఇదే జరిగితే చింతన్ శిబిర్లతో ఉపయోగం ఏంటన్నదిక్కడ పెద్ద ప్రశ్న. కాంగ్రెస్‌ పార్టీ యూత్‌కు దూరమైందన్నది కాదనలేని సత్యం. మర్రిచెట్టు నీడలో మరో మొక్క ఎదగదు అన్నట్లు.. ఏళ్ల తరబడి పార్టీలోనే పాతుకు పోయిన సీనియర్ మోస్ట్‌ లీడర్లు..యూత్‌ను ఎదగనివ్వలేదు. కాంగ్రెస్‌లో ఎటు వైపు నుంచి చూసినా సీనియర్లే కనిపిస్తారు. కాస్త చురుగ్గా ఉన్న యూత్‌ లీడర్లను వేళ్లపై లెక్కించ వచ్చు. ఆ ఉన్న కొద్దిమంది కూడా సీనియర్ల పోరు పడలేక పక్కచూపులు చూస్తున్నారు.. మరో దారి వెతుక్కుంటున్నారు. జ్యోతిరాధిత్య సింధియా వంటి మంచి యూత్‌లీడర్‌ను ఇలాగే దూరం చేసుకుంది. కమలనాథ్‌తో వచ్చిన గ్యాప్.. దాన్ని పరిష్కరించడంలో హైకమాండ్ వైఫల్యాన్ని BJP చక్కగా క్యాష్ చేసుకుంది. ఇక సచిన్ ఫైలట్‌కు- అశోక్ గెహ్లాట్‌కు కూడా ఇదే తరహా జనరేషన్ గ్యాప్. సచిన్ కూడా పార్టీని వీడుతారన్న వార్తలు అప్పట్లో జోరుగా వినిపించాయి. సచిన్‌ను బుజ్జగించి పార్టీలో కొనసాగేలా చేసిన కాంగ్రెస్ అధిష్టానం.. తాజాగా చింతన్ శిబిర్‌లో ఆయనకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇక గుజరాత్‌లో పార్టీకి కాస్త హోప్‌గా కనిపిస్తున్న హార్ధిక్‌ పటేల్‌ది కూడా ఇలాంటి సిచ్యుయేషనే. ప్రస్తుతం ఆయన పార్టీతో అంటీముట్టనట్లే వ్యవహరిస్తున్నారు.

మరోవైపు పార్టీలో కురువృద్ధ నేతలు, రాహుల్‌ వర్గానికి మధ్య గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది. వీరికి తోడు G-23 గ్రూప్‌ పేరుతో కాంగ్రెస్‌కు మరో తలనొప్పి రెడీగా ఉంది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుగా సీనియర్లంతా సూటిపోటి మాటలతో విరుచుకు పడుతూనేఉన్నారు. పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నది వీళ్ల వాదన. ఆ మధ్య గాంధీయేతర వ్యక్తికి పార్టీ బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్‌ను కూడా బలంగానే తెరపైకి తెచ్చారు. పార్టీ ప్రక్షాళన కోసం రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన నివేదికలోను ఇదే అంశాన్ని నొక్కి చెప్పినట్లు సమాచారం. అంతేకాదు ఇదే మూస పద్ధతిలో పోతే మరో 50 ఏళ్లు ప్రతిపక్షంలోనే ఉంటామంటూ గులాం నబీ ఆజాద్‌, కపిల్‌ సిబల్‌ వంటి సీనియర్లు చేసిన కామెంట్స్‌ పార్టీ దుస్థితికి అద్దం పట్టేవే. అన్ని రకాల నష్టం జరిగిన తర్వాత.. ఇప్పుడు 50-50 ఫార్ములాను తెరపైకి తెస్తోంది కాంగ్రెస్. పార్టీ పదవులు, అన్ని కమిటీల్లోనూ 50 శాతం జూనియర్లు ఉండాలన్నదే ఈ ఫార్ములా. ఇప్పుడు చింతన్‌ శిబిర్‌కు హాజరైన ప్రతినిధుల్లోనూ యూత్‌కు 50 శాతం అవకాశం కల్పించింది. వాస్తవానికి ఈ మార్పు ఎప్పుడో జరగాల్సింది. ఇప్పటికే బీజేపీ, వామపక్షాలు ఓ కటాఫ్‌ ఏజ్‌ను పెట్టుకున్నాయి. 75 ఏళ్లు దాటిన వారికి పార్టీ టికెట్లు, పదవులు ఇవ్వడం లేదు. ఇక కాంగ్రెస్‌ నుంచి వినిపిస్తున్న మరో కొత్త మాట వన్‌ ఫ్యామిలీ వన్ టికెట్. ఇది కూడా ఎప్పుడో జరగాల్సిన మార్పు. గతంలో పార్టీపై ఆధిపత్యం, హైకమాండ్‌తో మంచి రిలేషన్స్ ఉన్న నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించేవాళ్లు. ఒక్కో ఫ్యామిలీ నుంచి ముగ్గురు నుంచి నలుగురు పోటీ చేసిన సందర్భాలూ ఉన్నాయి. కాంగ్రెస్ అంటేనే వారసత్వ రాజకీయానికి మారుపేరుగా మరోపేరు అన్న విమర్శ ఉంది. ఇప్పటికైనా వన్‌ ఫ్యామిలీ వన్‌ టికెట్‌ పేరుతో ప్రక్షాళన చేయాలన్న ఆలోచన రావడం ఆహ్వానించదగిందే. కానీ ఇక్కడా కుటుంబ పార్టీ అనే ముద్రను తొలగించుకోలేని నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. వన్ ఫ్యామిలీ వన్ టిక్కెట్ నుంచి నెహ్రూ కుటుంబానికి మినహాయింపునిచ్చింది. అయితే ఇక్కడే మరో ప్రశ్న వస్తోంది. పార్టీ కట్టుబాట్లకు నెహ్రూ కుటుంబం అతీతమా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే వన్‌ ఫ్యామిలీ వన్ టికెట్ నిబంధన గాంధీ కుటుంబానికి వర్తించదట. అంటే మిగతా వాళ్లతో పోలిస్తే వీళ్లు కాస్త ఎక్కువ సమానమా అన్న క్వశ్చన్ బయటకు వస్తోంది. పార్టీ శ్రేణులు బయట పడకపోయినా.. అంతర్గత సమావేశాల్లో ఇదే టాక్‌ నడుస్తోందట. ప్రస్తుతం దేశ రాజకీయాలన్ని యువత చుట్టూ తిరుగుతున్నాయి. వారిని ఆకట్టుకోవడంలో కాంగ్రెస్‌ది ఘోర వైఫల్యం. పాత తరం నాయకత్వం..పాత కాలపు విధానాలను యువత తీసి పక్కనపడేసింది. అందుకే కాంగ్రెస్‌ విజయాలకు దూరమైంది. తరతరాలుగా చేసిన తప్పులే… నిలువెత్తు నిర్లక్ష్యంగా మారి పార్టీ అస్తిత్వాన్నే సవాల్‌ చేసేవరకూ పరిస్థితిని దిగజార్చాయి.

ఇక మరో కీలకాంశం. రాహుల్ గాంధీ పూర్తి స్థాయిలో పార్టీ పగ్గాలు చేపట్టడం. అందుకు ఆయన సిద్దంగా వున్నట్లు కనిపించడం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాహుల్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తోన్న సూటి ప్రశ్న ఇది. పార్టీని ముందుండి నడిపించాల్సిన వాడు… చుక్కానిగా మారి దిశానిర్దేశం చేయాల్సిన వాడే కాడి వదిలేస్తే ఎలా..? నెహ్రూ కుటుంబానికి చెందిన ఐదో తరం నేతగా…బలమైన ఇమేజ్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన రాహుల్‌ ఎక్కడ విఫలం అవుతున్నారు ? ఇప్పటికైనా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాల్సిన అవసరం లేదా? సీనియర్లు కోరుతున్నట్లుగా నెహ్రూ కుటుంబేతర వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా నియమించడం సాధ్యమేనా ? ఇవి ఆసక్తి రేకెత్తించే ప్రశ్నలే. ‘‘ పార్టీ మనందరికీ చాలా ఇచ్చింది. ఇప్పుడు మనం పార్టీకి ఇవ్వాల్సిన సమయం వచ్చింది.. ’’ చింతన్ శిబిర్ వేదికగా సోనియాగాంధీ చేసిన కామెంట్ ఇది. నిజమే పార్టీ అత్యంత క్లిష్టపరిస్థితుల్లో ఉంది. ఇకపై వేసే ప్రతి అడుగు ప్రధానమే. ఇప్పటికైనా నేతలు మేల్కొంటే మంచిది. లేదంటే…కాంగ్రెస్ పార్టీ పేరును భవిష్యత్తరాలు చరిత్రపుటల్లో చదువుకోవాల్సిన పరిస్థితి తలెత్తక తప్పదు. నిజానికి నాయకుడైనా, లీడర్ అయినా, కెప్టెన్ అయినా.. దేనికైనా నాయకత్వం వహిస్తున్న వ్యక్తి బలంగా ఉండాలి. విజయానికి పొంగిపోవద్దు. అపజయానికి కుంగిపోవద్దు. ఆటుపోట్లను తట్టుకొని నిలబడాలి. తిరిగి తలపడాలి. ఈ విషయంలో రాహుల్ ఫెయిలయ్యాడనే చెప్పాలి. 2014 నుంచి రాహుల్‌కు పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం సాగింది. అనేక ట్విస్టుల మధ్య చివరికి 2017లో ఒకానొక శుభముహుర్తాన యువరాజుకి పట్టాభిషేకం జరిగింది. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలువలేదు. 2019లో పార్టీ ఘోర పరాభవం చవిచూసింది. ఆ వెంటనే అధ్యక్షపదవికి రాజీనామా చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు రాహుల్. వృద్ధాప్యభారం మీదపడినా…అనారోగ్యం వెంటాడుతున్నా చివరికి సోనియా గాంధే మళ్లీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. చివరికి ఇందిరాగాంధీ సెంటిమెంట్‌తో ప్రియాంకా గాంధీ అనే అస్త్రాన్ని బయటకు తీసినా అది కాస్తా ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల తర్వాత అట్టర్ ఫేయిల్యూర్‌గా తేలింది. కాలుకిబలపం కట్టుకుని మరీ ప్రియాంకా, రాహుల్ గాంధీ యూపీ మొత్తం తిరిగి ప్రచారం చేస్తే వచ్చింది రెండంటే రెండు సీట్లు. 97 శాతం సీట్లలో డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఇక పంజాబ్‌లో అయితే ఏకంగా అధికారాన్నే కోల్పోయింది. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనైనా కాస్త పాజిటివ్ రిజల్ట్స్ వస్తే…రాహుల్‌కు మళ్లీ పార్టీ పగ్గాలు అప్పగించాలని భావించారు. కానీ ఫలితం అందుకు భిన్నం. యథారాజా తథాప్రజా అన్నట్లుగానే…జాతీయస్థాయిలోనే నాయకత్వం అంత వీక్‌గా ఉంటే ఇక రాష్ట్రాల సంగతి చెప్పేదేం ఉంటుంది. ప్రతిచోటా కలహాల కాపురాలే. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే… ఏపీలో కాంగ్రెస్ ఉనికే లేదు..! కాస్తో కూస్తో హోప్ ఉన్న తెలంగాణలో మూడు వివాదాలు.. ఆరు పంచాయితీలు అన్నట్లుగానే ఉంటుంది. మే తొలివారంలో రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చారు. వెళ్లారు. వరంగల్ డిక్లరేషన్‌పేరుతో ఓ హైప్‌ తీసుకొచ్చారు. దాని ఆధారంగానే తెలంగాణ నాయకత్వం ఎన్నికలకు రోడ్ మ్యాప్ సిద్దం చేసుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కోలుకోవాలంటే .. ఉన్నఫలంగా అధికారంలోకి రావాలంటే మాత్రం కచ్చితంగా ఏదో ఒక అద్భతమే జరిగాలి. ఇప్పటికే రెండు విడతలుగా పార్టీ అధికారానికి దూరంగా ఉంది. మళ్లీ మళ్లీ అవే పరిస్థితులు ఎదురైతే కాంగ్రెస్ కోలుకోవడం కష్టం. పాతాళపు అంచుల్లోకి కూరుకుపోయిన స్థితి నుంచి పునర్వైభవం దిశగా అడుగులు పడటం అంత సులువేమీ కాదు.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో