AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

National Train Day 2022: చికు బుకు రైలు ప్రయాణం ఓ గొప్ప అనుభూతి.. జాతీయ రైలు దినోత్సవ ప్రత్యేకత ఏమిటో తెలుసా..

రైలులో ప్రయాణం చేయడం ఒక వ్యక్తి.. జీవితంలో పొందే అత్యంత అద్భుతమైన అనుభవాలలో ఒకటి. రైలు ప్రయాణం.. వినోదం, సాహసంతో నిండి ఉంది. జీవితంలో రైలు ప్రయాణం అద్భుతం. రైలులో ప్రయాణించే దూరం చిన్నదైనా.. గంటలు పట్టినా.. రాత్రి వేళల్లోనైనా అసలు విసుగు పుట్టించే అవకాశం లేదు.

National Train Day 2022: చికు బుకు రైలు ప్రయాణం ఓ గొప్ప అనుభూతి.. జాతీయ రైలు దినోత్సవ ప్రత్యేకత ఏమిటో తెలుసా..
National Train Day
Surya Kala
|

Updated on: May 14, 2022 | 4:12 PM

Share

National Train Day 2022: జాతీయ రైలు దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే నెల రెండవ శనివారాన్ని జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జాతీయ రైలు దినోత్సం మే 14న వచ్చింది. ఇది యునైటెడ్ స్టేట్స్‌లో జరుపుకునే వార్షికోత్సవ  కార్యక్రమం. రైలులో ప్రయాణం చేయడం ఒక వ్యక్తి.. జీవితంలో పొందే అత్యంత అద్భుతమైన అనుభవాలలో ఒకటి. రైలు ప్రయాణం.. వినోదం, సాహసంతో నిండి ఉంది. జీవితంలో రైలు ప్రయాణం అద్భుతం. రైలులో ప్రయాణించే దూరం చిన్నదైనా.. గంటలు పట్టినా.. రాత్రి వేళల్లోనైనా అసలు విసుగు పుట్టించే అవకాశం లేదు. వయసుతో సంబంధంలేకుండా.. పిలల్లు, పెద్దలు.. ఇలా ప్రతి ఒక్కరూ రైలు ప్రయాణాన్ని ఆనందిస్తారు. రైళ్లు ప్రయాణ సాధనాలుగా ప్రపంచవ్యాప్తంగా విప్లవాన్ని సృష్టించాయి. మొదటి రైల్‌ రోడ్ గ్రేట్ బ్రిటన్‌లో ఉంది. రైళ్లు మొదట గుర్రాలతో నడిచేది. యునైటెడ్ స్టేట్స్ పశ్చిమ దిశగా రహదారి విస్తరణలో రైలుమార్గం, ఆవిరి యంత్రాలు కీలకమైనవి. ఈ రైళ్లు ప్రజలకు అవసరమైన వస్తు సామాగ్రిని  పంపిణీ చేయడమే కాదు.. కొత్త జీవితాలకు అవసరమైన ఆలంబనగా నిలిచాయి.

చరిత్ర: జాతీయ రైలు దినోత్సవం మొదటిసారిగా 2008లో నిర్వహించబడింది. USలోని ఒక రైలు సంస్థ అయిన ఆమ్‌ట్రాక్, యునైటెడ్ స్టేట్స్‌లోని రైల్‌రోడ్ నెట్‌వర్క్‌ల చరిత్ర గురించి అవగాహన కల్పించడానికి ఈవెంట్‌లను ప్లాన్ చేసింది. 2015లో అమ్‌ట్రాక్ జాతీయ రైలు దినోత్సవాన్ని నిలిపివేసింది. అయినప్పటికీ మిగిలిన ఇతర రైలు కంపెనీలు అయితే దీనిని ఇప్పటికీ ఇతర రైలు కంపెనీలు పాటిస్తున్నాయి. ఆమ్‌ట్రాక్ సంస్థ.. అప్పటి రైళ్లు నడిచిన రోజును గుర్తుచేసుకోవడానికి వివిధ ఉత్సవాలను నిర్వహించారు.

ప్రాముఖ్యత: రైళ్లు రవాణా విధానాన్ని ప్రజలు ఎందుకు ఉపయోగించాలో తెలుసుకోవడం కోసం జాతీయ రైలు దినోత్సవాన్ని జరుపుకుంటారు. పర్యావరణపరంగా అత్యంత ప్రయోజనకరమైన రవాణా మార్గాలలో రైల్వే ఒకటి. ఆమ్‌ట్రాక్ యునైటెడ్ స్టేట్స్‌లోని నగరాలతో పాటు కెనడాలోని మూడు నగరాలకు సేవలు అందిస్తోంది. రైల్వే సంస్థలు ప్రజలను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చేరడానికి మాత్రమే కాకుండా కార్గో, వంటి కొన్ని సేవలను కూడా అందిస్తాయి.

ఇవి కూడా చదవండి

జాతీయ రైలు దినోత్సవాన్ని ఎలా జరుపుకుంటారంటే..

*యునైటెడ్ స్టేట్స్‌లో, స్నేహితులు, బంధువులు సమాచారాన్ని పంచుకోవడానికి.. రైలురోడ్ల వారసత్వాన్ని  అభినందించడానికి ఒకచోట చేరుకుంటారు. *ఈ రైళ్లు జాతీయ దినోత్సవ కార్యకలాపాలు పాఠశాలలు , ఇతర సంస్థలు కూడా నిర్వహిస్తారు. *రైల్వే రైడ్‌లు, మోడల్ రైల్‌రోడ్ లేఅవుట్‌లు, మ్యూజియంలు, రైలు ప్రదర్శనలు ఇలాంటివి  జాతీయ రైలు దినోత్సవంలో చోటు చేసుకుంటాయి. *ఈ రైలు జాతీయ దినోత్సవం రోజున చాలా మంది తమకు ఇష్టమైన రైలు ప్రయాణాల గురించి పోస్ట్ చేస్తారు. తమ అనుభవనాలు ఆన్‌లైన్‌లో ఇతరులతో పంచుకుంటారు.

రైళ్ల కోట్‌లు:

“రైళ్లు అద్భుతమైనవి…రైలులో ప్రయాణించడమంటే ప్రకృతిని , మనుషులను, పట్టణాలను, చర్చిలను నదులను చూడటం మాత్రమే కాదు.. నిజానికి రైలు ప్రయాణం అంటే జీవితాన్ని చూడటమే.” – అగాథ క్రిస్టి

“రైళ్లు చాలా అందంగా ఉంటాయి. ప్రయాణీకులను అత్యంత వేగంగా గమ్యస్థానానికి చేరవేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. రైళ్లలో పనిచేసే ప్రతి ఒక్కరికి వారి వ్యక్తిత్వం, ప్రయాణీకుల ఆలోచనలు తెలుసు.. రైలు సిబ్బందికి వారి స్వంత రహస్యాలు ఉన్నాయిని 2009లో సామ్ స్టార్‌బక్, ‘ది డెడ్ ఐల్ రైళ్లపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

“రైలు ప్రయాణం దాని సొంత సాహిత్యాన్ని కలిగి ఉంది.. రైళ్లు ప్రయాణం పట్టాలు, చక్రాలు, ట్యూన్స్ ఓ యుగళగీతాన్ని తలపిస్తాయని రిచర్డ్ ఎల్ రాట్లిఫ్ పేర్కొన్నాడు.

“రైలులా ఉండు; వర్షంలో వెళ్లు, ఎండలో వెళ్లు, తుఫానులో వెళ్లు, చీకటి సొరంగాల్లోకి వెళ్లు! రైలులా ఉండు.. నీవు ప్రయాణించే మార్గంలో ఏకాగ్రత వహించి సంకోచం లేకుండా వెళ్లు!” – మెహ్మెత్ మురత్ ఇల్డాన్

“జీవితం ఒక రైలు ప్రయాణం మార్గంలో ఉన్న అనేక స్టేషన్లలో మనకు ముఖ్యమైన వ్యక్తులు తారసపడతారు.  మార్గ మధ్యలో ఎందరో రైల్లో ఎక్కుతారు.. దిగుతారు.. అలా రైలు ప్రయాణం ముగిసే వరకు జరుగుతూనే ఉంది. మేము చాలా సీట్లు ఖాళీగా ఉన్న ప్యాసింజర్ పెట్టెలో కూర్చుని రైలు ప్రయాణాన్ని గమనిస్తుంటాను అని డీన్ కూంట్జ్ చెప్పారు. (Source)

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌   వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..