మనకు సాధారణంగా కనిపించే తేళ్ల విషం అంత ప్రాణాంతకం కాదు. అదే సమయంలో నిద్రపోవడానికి నిత్య ఒక చుక్క తేలు విషం సేవించే వ్యక్తులు కూడా ఉన్నారు. తేళ్లను విషపూరితమైనవిగా భావించి వాటిని చంపడం లేదా వాటి నుండి తమను తాము రక్షించుకోవడం చూస్తుంటాం. ఒక ఇంటి నేలమాళిగలో వందలాది తేళ్లు బయటపడ్డాయి. అందుకు సంబంధించిన క్లిప్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో లక్షలాది తేళ్లు నేలమాళిగలో అన్ని చోట్లా ఉన్నట్లు మీరు చూడవచ్చు. దీన్ని చూసిన నెటిజన్లు తమ కళ్లను తామే నమ్మేలేమంటూ భిన్నమైన కామెంట్స్ పెడుతున్నారు. ఆ తేళ్లన్నీ విషపూరితమైనవని, వాటి విషం కోసం మాత్రమే వాటిని పెంచుతూ ఉండవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం వాటిని మందులు తయారు చేసేందుకు ఉపయోగిస్తూ ఉండవచ్చని అంటున్నారు.