Viral Video: చంకలో బిడ్డ.. చేతిలో సూట్‌కేస్.. మహిళ చేసిన పనికి అంతా షాక్.. వీడియో
విమానంలో శిశువును తీసుకొని ప్రయాణించిన మహిళ.. చేసిన పనికి అంతా షాకవుతున్నారు. మహిళ తన కాలుతో విమానంలోని ఓవర్‌హెడ్ క్యాబిన్‌ను మూసివేస్తుంది.
Woman Stunt Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ మహిళకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సాధారణంగా కొంతమంది నెట్టింట వైరల్ అయ్యేందుకు ఎన్నో రకాల స్టంట్లు చేస్తుంటారు. అయితే.. కొంతమంది ఎలాంటి స్టంట్లు చేయకుండానే.. వైరల్ అవుతుంటారు. ప్రయాణంలో కొంతమంది సామాను తీసుకెళ్లడం మనం చూసుంటాం.. అయితే.. కొందరు వ్యక్తులు మల్టీ టాస్కింగ్‌లో వారి పనులను సొంతంగా పూర్తిచేస్తుంటారు. అయితే.. ఓ మహిళ ఇలాంటి పనులకు ఉదాహరణగా నిలిచింది. విమానంలో శిశువును తీసుకొని ప్రయాణించిన మహిళ.. చేసిన పనికి అంతా షాకవుతున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ మహిళ తన కాలుతో విమానంలోని ఓవర్‌హెడ్ క్యాబిన్‌ను మూసివేస్తుంది. ఇదేలా సాధ్యం అనుకుంటున్నారా..? ఇది నిజంగా జరిగింది. ఈ వీడియోను బుధవారం ఫిగెన్ అనే ట్విటర్ యూజర్.. షేర్ చేసి.. OMG చాలా బాగుందంటూ క్యాప్షన్ రాశారు.
దీనిలో మహిళ విమానం దిగేందుకు సిద్ధమవుతుంటుంది. ఆమె ఒక చేతిలో బిడ్డను పట్టుకుని, మరొక చేతిలో విమానం క్యాబిన్ నుంచి లగేజీని బయటకు తీస్తుంది. ఈ క్రమంలో ఆమెకు సాయం చేసేందుకు.. తోటి ప్రయాణికులు కానీ.. విమాన సిబ్బందిని కానీ లేదు. ఈ క్రమంలో క్యాబిన్ ను క్లోజ్ చేసేందుకు.. ఆమె కుడి కాలును జిమ్నాస్ట్ లాగా పైకెత్తి ఓవర్ హెడ్ క్యాబిన్ తలుపును మూసేస్తుంది. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
వైరల్ వీడియో..
OMG so cool! ???pic.twitter.com/sFZeCiiB9U
— Figen (@TheFigen) May 11, 2022
ఈ వీడియోకు ఇప్పటివరకు 2.1 లక్షల వీక్షణలు రాగా.. 6,861 లైక్‌లు వచ్చాయి. ఈ స్టంట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తూ.. అమెజింగ్ అంటూ మహిళను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి
Also Read: