Congress Chintan Shivir: చింతన్ శివిర్‌ సంకల్పం నెరవేరేనా..? కాంగ్రెస్‌కు మళ్లీ పూర్వవైభవం దక్కేనా..!

2024 ఎన్నికల ముందు అవసరమైన సంస్థాగత మార్పులను పరిగణనలోకి తీసుకోవడానికి కాంగ్రెస్ మూడు రోజుల ఆత్మపరిశీలన సమావేశాన్ని నిర్వహిస్తోంది. 2014, 2019 లో ఓటమి తర్వాత కాంగ్రెస్ తొలిసారిగా ఉదయ్‌పూర్‌లో మూడు రోజుల పాటు 'చింతన్ శివిర్' నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది..

Congress Chintan Shivir: చింతన్ శివిర్‌ సంకల్పం నెరవేరేనా..? కాంగ్రెస్‌కు మళ్లీ పూర్వవైభవం దక్కేనా..!
Congress
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 14, 2022 | 9:40 AM

Congress Chintan Shivir : దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ.. గత కొంత కాలం నుంచి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. వరుస ఓటములతో సతమవుతున్న అఖిల భారత కాంగ్రెస్.. ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ.. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో చింతన్ శివిర్‌ను నిర్వహిస్తోంది. మే 13 నుంచి 15 వరకు జరగనున్న కాంగ్రెస్ పార్టీ ‘చింతన్ శివిర్’ మేధోమథన సభలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతోపాటు.. 2024 ఎన్నికలకు వ్యూహ ప్రతివ్యూహాలను పార్టీ పెద్దలు నిర్ణయించనున్నారు. 400 మంది ప్రతినిధులు పాల్గొననున్న ఈ సమావేశంలో.. ఎన్నికల్లో వరుస పరాజయాలు, పార్టీలో నెలకొన్న అసమ్మతి, మిషన్ 2024 వ్యూహం తదితర అంశాలపై కాంగ్రెస్ మేధోమథనం నిర్వహిస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రారంభోపన్యాసం చేశారు. పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు నేతలు కష్టపడాలని.. పార్టీ మనకు చాలా ఇచ్చిందని పార్టీ మనం ఎంతోకంత తిరిగివ్వాలంటూ సోనియా పేర్కొన్నారు. నవ సంకల్ప్‌ పేరిట పార్టీ ప్రక్షాళన, ఎన్ని కష్టాలు ఎదురైనా పార్టీని బలమైన శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. కాంగ్రెస్‌ నేతలు వ్యక్తిగత స్వార్థం వీడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. మైనారిటీలపై దాడులు పెరిగాయని.. రాజకీయ ప్రత్యర్థులను బెదిరిస్తున్నారన్నారు. మోదీ పాలనలో ప్రజలు భయంభయంగా బతుకుతున్నారని పేర్కొన్నారు. గాంధీజీని చంపిన వాళ్లను కీర్తిస్తూ.. భయాందోళన సృష్టిస్తున్నారని సోనియా ధ్వజమెత్తారు.

అయితే.. చింతన్ శివిర్ కార్యక్రమానికి ముందు కాంగ్రెస్ లీడర్ అజయ్ మాకెన్ కీలక విషయాలు వెల్లడించారు. ఒక కుటుంబం – ఒక టికెట్ రూల్‌కు కాంగ్రెస్ రెడీ అయినట్లు తెలిపారు. ఈ నిబంధనపై కాంగ్రెస్ ప్యానెల్‌కు ఏకాభిప్రాయం ఉన్నదని అజయ్ మాకెన్ వివరించారు. పార్టీ లీడర్‌కు తప్పితే వారి బంధువులకు టికెట్ ఇవ్వరాదనే నిబంధనకు నేతలు సుముఖంగా ఉన్నారన్నారు. అయితే, వారికీ టికెట్ ఇవ్వాలంటే వారు కనీసం ఐదు సంవత్సరాలు పార్టీ కోసం పని చేసి ఉండాలంటూ చెప్పారు. ఈ నిబంధన నుంచి గాంధీలకు మినహాయింపు ఉంటుందా అని ప్రశ్నించగా.. వారు రాజకీయాల్లో ఐదేళ్లుగా యాక్టివ్‌గా ఉన్నారని, ప్రియాంక గాంధీ 2018 నుంచే పార్టీ కోసం పని చేస్తున్నారంటూ మాకెన్ వివరించారు. కాగా.. ఈ సమావేశంలో మొబైల్‌ ఫోన్లను అనుమతించడం లేదు.

అయితే.. 2024 ఎన్నికల ముందు అవసరమైన సంస్థాగత మార్పులను పరిగణనలోకి తీసుకోవడానికి కాంగ్రెస్ మూడు రోజుల ఆత్మపరిశీలన సమావేశాన్ని నిర్వహిస్తోందని.. ఆశిష్ మెహతా పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన న్యూస్9కి రాసిన వ్యాసంలో కీలక విషయాలను ప్రస్తావించారు. 2014, 2019 లో ఓటమి తర్వాత కాంగ్రెస్ తొలిసారిగా ఉదయ్‌పూర్‌లో మూడు రోజుల పాటు ‘చింతన్ శివిర్’ అనే ఆత్మపరిశీలన సభను నిర్వహిస్తోంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి చాలా కాలం పాటు ప్రధాన రాజకీయ పార్టీగా ఉన్న పురాతన పార్టీ ఎనిమిదేళ్ల నుంచి కష్టాల్లో కూరుకుపోయింది. దృఢంగా.. తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిన బిజెపికి ధీటుగా నిలబడేందుకు పురాతన పార్టీ అస్తిత్వ ముప్పును ఎదుర్కొంటుంది.

ఇవి కూడా చదవండి

ఆరు అంశాలు.. 

శిబిరంలో ఆరు విస్తృత అంశాలను చర్చించడానికి రూపొందించారు. మొదటగా.. సంస్థలోని అంతర్గత విషయాలు, ఇంకా జాతీయ విషయాలు.. రాజకీయ సమస్యలు, ఆర్థికం, వ్యవసాయం, సామాజిక న్యాయం, సంక్షేమం – యువత, విద్య – ఉపాధి అంశాలను చర్చించనున్నారు. ఈ సమావేశంలో ఆరుగురు సీనియర్ నాయకులు ప్రతి అంశంపై సుధీర్ఘంగా ప్రస్తావించనున్నారు. దీంతోపాటు వారి ప్రజెంటేషన్‌.. శివిర్ ఆలోచనలను దీనిలో చర్చించనున్నారు.

పై నుంచి వచ్చిన సూచనల ఆధారంగా మాత్రమే నడుస్తుందని తెలిసిన పార్టీకి.. స్వేచ్ఛగా.. తేలికైన చర్చ సాధారణం కాదు. అందుకే, వర్కింగ్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ ఈ వారం మాట్లాడుతూ.. ఈ సమావేశం కేవలం ఆచారంగా మారకూడదని అన్నారు. ఆమె సమావేశం లక్ష్యాన్ని స్పష్టంగా వివరించారు. సంస్థను పునర్నిర్మించడం, తద్వారా అది సైద్ధాంతికంగా బలపడుతుందని.. దీంతో ఎన్నికలు – నిర్వాహక సవాళ్లను ఎదుర్కోగలదని ఆమె చెప్పారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన కీలక రాష్ట్రాల ఎన్నికలలో ఓటమి తర్వాత.. పార్టీని సంస్థాగతంగా బలంగా రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్న ‘ఉదయ్‌పూర్ ప్రణాళిక’ 2024 మిషన్.. లోక్‌సభ ఎన్నికల కోసం.. అదేవిధంగా బలోపేతం తదితర ప్రకటన కానుంది.

బలోపేతం అయ్యేనా..?

అయితే.. కాంగ్రెస్‌కు బయటి ఆలోచనలు అవసరం లేదని.. దానిలో ఆలోచనలు, సత్తా చాటే విషయాలు, అంశాలు పుష్కలంగా ఉన్నాయి. కాంగ్రెస్‌కు అవసరం ఏమిటంటే.. తనను తాను బలోపేతం చేసుకునేలా ప్రణాళిక రూపొందించడం అని ఆశిష్ మెహతా వాదించారు. 2014, 2019లో జరిగిన ఓటములు.. పార్టీలోని అంతర్గత పోరు.. తప్పు ఎక్కడ జరిగిందన్న విషయాలను తెలసుకునేందుకు పార్టీ ఆత్మపరిశీలన చేయనుంది.

ఉత్తరప్రదేశ్‌లో తాజా పరాజయం.. పంజాబ్ రాష్ట్రంలో అధికారం కోల్పోవడం.. పార్టీని ఇంకా మేల్కొల్పడంలో విఫలమైంది. గత ఎనిమిదేళ్ల నుంచి నేర్చుకున్న గుణపాఠాలు – అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. చింతన్ శివిర్ ఎటువంటి ఫలితాలను ఇచ్చే అవకాశం లేదు. ఒకవేళ ఉంటే.. పార్టీ ఉద్దేశాన్ని తెలపడం. అయితే.. అప్పుడు మూడు రోజుల పాటు శిబిరాన్ని నిర్వహించాల్సిన అవసరం లేదు. పార్టీ ఏమి చేయాలి అనేది ఒక రహస్యం కాదు.. ఇది లోతైన అంశాలు, తెలియపరిచే విధానం, విస్తృతమైన, ఖచ్చితమైన నిర్మాణాత్మక చర్చా సమావేశాలు పార్టీకి అవసరం అని పేర్కొన్నారు. అగ్ర నాయకత్వం – సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాత్ర, వారు ఫుల్-టైమర్లుగా చూపించుకోవాల్సిన బాధ్యత, సీనియర్ నాయకుల అభిప్రాయం, వారి వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది.

దృఢ సంకల్పం ఏదీ..?

ముఖ్యంగా శివిర్‌కు ఒకే ఒక పాయింట్.. ఎజెండా ఉండాలి. అంతర్గత విమర్శకులు మాట్లాడటానికి అవకాశమివ్వాలి. G23 నేతల బృందం – సంస్థాగత మార్పుల విషయంపై చర్చించాలి. దీంతోపాటు ప్రశాంత్ కిషోర్ అంశాలను కూడా ప్రస్తావించాలి. అప్పుడే కాంగ్రెస్ పుంజుకుంటుందని ఆశిశ్ మెహతా అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా కాంగ్రెస్ చింతన్ శివిర్లో అంతర్గతంగా మారాలనే దృఢ సంకల్పం లేకపోవడం వ్యర్థమని పేర్కొన్నారు.

Also Read:

Congress Conference: ఉత్సాహంగా కాంగ్రెస్ నవ సంకల్ప్ చింతన్ శిబిరం.. బీజేపీ సర్కార్‌పై నేతల ఫైర్..

Delhi Fire Accident: ఢిల్లీ దుర్ఘటనలో 27 మంది సజీవ దహనం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోడీ