CSL Recruitment 2022: పదో తరగతి అర్హతతో కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో 261 ఉద్యోగాలు..నెలకు రూ.77000ల జీతం..

భారత ప్రభుత్వ పోర్టులు, షిప్పింగ్‌, జలమార్గాల మంత్రిత్వశాఖకు చెందిన కేరళలోని కొచ్చిన్‌లో గల కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (Cochin Shipyard Limited).. సీనియర్‌ షిప్‌ డ్రాఫ్ట్స్‌మెన్‌, తదితర (Senior Ship Draftsman Posts) పోస్టుల భర్తీకి అర్హులైన..

CSL Recruitment 2022: పదో తరగతి అర్హతతో కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో 261 ఉద్యోగాలు..నెలకు రూ.77000ల జీతం..
Cochin Shipyard Jobs
Follow us
Srilakshmi C

|

Updated on: May 14, 2022 | 9:28 AM

Cochin Shipyard Limited Workmen Recruitment 2022: భారత ప్రభుత్వ పోర్టులు, షిప్పింగ్‌, జలమార్గాల మంత్రిత్వశాఖకు చెందిన కేరళలోని కొచ్చిన్‌లో గల కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (Cochin Shipyard Limited).. సీనియర్‌ షిప్‌ డ్రాఫ్ట్స్‌మెన్‌, జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అసిస్టెంట్‌, స్టోర్‌ కీపర్‌, జూనియర్‌ కమర్షియల్‌ అసిస్టెంట్‌, వెల్డర్‌ కమ్‌ ఫిట్టర్‌ తదితర (Senior Ship Draftsman Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 261

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు:

  • వెల్డర్‌ కమ్‌ ఫిట్టర్‌ పోస్టులు: 206 విభాగాలు: వెల్డర్‌, ప్లంబర్‌, మెకానిక్‌ డీజిల్‌, ఫిట్టర్‌, షీట్‌మెటల్‌ వర్కర్‌
  • సీనియర్‌ షిప్‌ డ్రాఫ్ట్స్‌మెన్‌ పోస్టులు: 16 విభాగాలు: మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌
  • జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్ పోస్టులు: 5 విభాగాలు: మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఏబీఏపీ
  • ల్యాబొరేటరీ అసిస్టెంట్‌ పోస్టులు: 2 విభాగాలు: మెకానికల్‌, కెమికల్‌
  • స్టోర్‌ కీపర్‌ పోస్టులు: 4
  • జూనియర్‌ కమర్షియల్‌ అసిస్టెంట్‌ పోస్టులు: 2
  • అసిస్టెంట్ పోస్టులు: 7
  • ఫిట్టర్‌ పోస్టులు: 16
  • షిప్‌రైట్‌ ఉడ్‌ పోస్టులు: 3

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు జూన్‌ 6, 2022 నాటికి 35 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.22,500ల నుంచి రూ.77,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, ఇంజనీరింగ్‌ డిప్లొమా, బీసీఏ, బీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్‌ అవసరం.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్‌, ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

  • జనరల్ అభ్యర్ధులకు: రూ.400
  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 6, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి. 

Also Read:

JMI Admissions 2022: జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే..