AP SSC paper leak case 2022: మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు కోరుతూ చిత్తూరు కోర్టులో పిటిషన్.. మే 24కు విచారణ వాయిదా!
ఆంధ్రప్రదేశ్ టెన్త్ క్లాస్ మాల్ ప్రాక్టీస్ కేసులో ఏ9 ముద్దాయిగా ఉన్న మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దుపై జిల్లా కోర్టులో చిత్తూరు పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు..
Andhra Pradesh Tenth Class Mall practice case 2022: ఆంధ్రప్రదేశ్ టెన్త్ క్లాస్ మాల్ ప్రాక్టీస్ కేసులో ఏ9 ముద్దాయిగా ఉన్న మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దుపై జిల్లా కోర్టులో చిత్తూరు పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఆర్టికల్ 14 ప్రకారం అందరూ సమానమే. మాజీ మంత్రి నారాయణ బెయిల్ మంజూరు చేసిన కేసులో 4 వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఇచ్చిన బెయిల్ పై జిల్లా కోర్టులో రివిజన్ ఫైల్ దాఖలు చేశాం. బెయిల్ పిటిషన్ వేయకుండా బెయిల్ మంజూరు అయ్యింది. చట్టానికి ఎవరు అతీతులు కారు. చట్టం ముందు అందరూ సమానమేనని పేర్కొంటూ.. బెయిల్ రద్దు కోరుతూ వన్ టౌన్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం (మే 13) విచారణకు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డితో పాటు ఆరు మంది అడ్వకేట్లు ఇప్పటికే జిల్లా కోర్టుకు చేరుకున్నారు. మధ్యాహ్నం వాదనలు వినిపించారు.
బెయిల్ రద్దు పిటిషన్ విచారణకు జిల్లా కోర్టు అనుమతి పదో తరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్నాపత్రాల మాల్ ప్రాక్టీస్ కేసులో మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు పిటిషన్ విచారణకు జిల్లా కోర్టు అనుమతిచ్చింది. ఈనెల 24కు తదుపరి విచారనను వాయిదా వేసింది. ఈ మేరకు మాజీ మంత్రి నారాయణకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
కాగా ఆంధ్ర ప్రదేశ్‌లో పదవ తరగతి పేపర్ లీకేజ్ వ్యవహారం నారాయణ విద్యా సంస్థల యజమాని, మాజీ మంత్రి నారాయణను హైదరాబాద్‌లో నారాయణను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ – ప్రివెన్షన్ ఆఫ్ మాల్‌ప్రాక్టీసెస్ అండ్ అన్‌ఫెయిర్ మీన్స్ చట్టంలోని సెక్షన్ 5, 8తో పాటు ఐపీసీ సెక్షన్ 408 కింద కేసు నమోదు చేశారు. నారాయణను అరెస్ట్ చేయడంతో రాజకీయ రగడ జరుగుతోంది.
Also Read: