Elon Musk: ట్విట్టర్‌ టేకోవర్‌ డీల్‌లో ఊహించని ట్విస్ట్‌.. తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ఎలన్‌ మస్క్‌

అందరూ చేసేదే ఆయన కూడా చేస్తే అతనెందుకు ఎలన్ మస్క్‌ అవుతాడు. ఎవ్వరూ ఊహించంది చేయడమే మస్క్ స్పెషాలిటీ. అందుకే, ట్విట్టర్‌ టేకోవర్‌ కోసం ఎవ్వరూ ఊహించని డీల్‌ ఆఫర్ చేశాడో, ఇప్పుడు అంతకంటే డబుల్‌ ట్రిపుల్‌ షాకిచ్చాడు.

Elon Musk: ట్విట్టర్‌ టేకోవర్‌ డీల్‌లో ఊహించని ట్విస్ట్‌.. తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ఎలన్‌ మస్క్‌
Elon Musk
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 14, 2022 | 7:56 AM

Elon Musk Twitter Deal: టెస్లా అండ్ స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలన్‌ మస్క్‌ చర్యలు ఊహాతీతం.. ఆయన ఎప్పుడు ఏం చేస్తారో ఎవ్వరికీ తెలియదు.. పైగా ఎవ్వరూ ఊహించంది చేయడమే ఎలన్‌ మస్క్‌ స్పెషాలిటీ. ఎలన్‌ మస్క్‌ ఇచ్చే ట్విస్టులు మామూలుగా ఉండవ్‌, ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ దిగ్గజాల మైండ్‌లు సైతం బ్లాంక్‌ అయిపోతాయ్‌. అలా ఉంటాయ్‌ ఎలన్‌ మస్క్‌ ఎత్తులు జిత్తులు. ట్విట్టర్‌ విషయంలో ఎన్నో సంచలనాలకు తెరలేపిన ఎలన్‌ మస్క్‌ మరో ట్విస్ట్‌ ఇచ్చారు. రికార్డు రేటుతో ట్విట్టర్‌ టేకోవర్‌కు డీల్‌ సెట్‌ చేసుకున్న ఎలన్‌ మస్క్‌, ఇప్పుడు ఎవ్వరూ ఊహించని షాకిచ్చారు. ట్విట్టర్‌ కొనుగోలు ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ట్విట్టర్‌ టేకోవర్‌ డీల్‌పై సంచలన ట్వీట్‌ చేశారు మస్క్‌. స్పామ్‌ అండ్ ఫేక్‌ అకౌంట్స్‌ ఐదు శాతం కంటే తక్కువ ఉంటాయన్న లెక్కలను ట్విట్టర్‌ ఇంకా అందజేయలేదని, అందుకే డీల్‌ను టెంపరరీగా హోల్డ్‌లో పెడుతున్నట్లు ప్రకటించారు. ఎలన్ మస్క్‌ ప్రకటనతో అమెరికన్‌ స్టాక్ మార్కెట్‌ ప్రీ-ట్రేడింగ్‌లో ట్విట్టర్‌ షేర్లు 20శాతానికి పైగా పడిపోయాయ్‌. ప్రముఖ ఇంటర్నేషనల్‌ సోషల్‌ మీడియా ఫ్లాట్ ఫామ్‌ ట్విట్టర్‌ టేకోవర్‌ కోసం గత నెలలో డీల్‌ కుదుర్చుకున్నారు ఎలన్ మస్క్‌. దాదాపు 44 మిలియన్‌ డాలర్లకు డీల్‌ కుదిరింది. ఇండియన్‌ కరెన్సీలో సుమారు మూడున్నర లక్షల కోట్ల రూపాయలకు ట్విట్టర్‌ చేజిక్కించుకునేందుకు ఒప్పందం చేసుకున్నారు.

అయితే, డీల్‌ కండీషన్స్‌లో భాగంగా స్పామ్‌ అండ్ ఫేక్‌ అకౌంట్స్‌ లెక్కలను ట్విట్టర్‌ అందించకపోవడంతో ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు ఎలన్‌ మస్క్‌. అత్యంత భారీ డీల్‌లో నిధుల సమీకరణ కోసం తంటాలు పడుతోన్న ఎలన్‌ మస్క్‌, ఇప్పుడు టెంపరరీగా ఒప్పందాన్ని నిలిపిస్తున్నట్లు ప్రకటించడంతో అనుమానాలు చెలరేగుతున్నాయ్‌. వాల్‌స్ట్రీట్‌ వర్గాల్లోనూ అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయ్‌. అయితే, అనుమానాలను పటాపంచలు చేస్తూ, ఇప్పటికీ ట్విట్టర్‌ టేకోవర్‌కి తాను కట్టుబడే ఉన్నానంటూ ప్రకటించారు ఎలన్‌ మస్క్‌.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

Also Read:

Australia Elections: ఆస్ట్రేలియా ఎన్నికల ప్రచారంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు.. అసలు విషయం తెలుసుకుని..

UAE President: యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీపా మృతి.. 40 రోజులు సంతాపదినాలు ప్రకటించిన అక్కడి ప్రభుత్వం..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?