UAE President: యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీపా మృతి.. 40 రోజులు సంతాపదినాలు ప్రకటించిన అక్కడి ప్రభుత్వం..

యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ శుక్రవారం మరణించారు.

UAE President: యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీపా మృతి.. 40 రోజులు సంతాపదినాలు ప్రకటించిన అక్కడి ప్రభుత్వం..
Uae President Sheikh Khalif
Follow us
Surya Kala

|

Updated on: May 13, 2022 | 6:23 PM

UAE President: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ శుక్రవారం  మరణించినట్లు అక్కడ ప్రభుత్వ  అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అతను అబుదాబి ఎమిరేట్ పాలకుడు కూడా. ఆయన వయసు 73 ఏళ్ళు. షేక్ ఖలీఫా బిన్ నవంబర్‌ 3వ తేదీ  2014 నుంచి యూఏఈ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. షేక్ ఖలీఫా అకాల మరణంతో ఆ దేశంలో విషాదం నెలకొంది. షేక్‌ ఖలీఫా మృతికి పలు దేశాల అధినేతలు, ప్రముఖులు సంతాపం చెబుతున్నారు.

1948లో పుట్టిన షేక్‌ ఖలీపా.. తండ్రి షేక్‌ జాయెద్‌ బిన్‌ సుల్తాన్‌ అల్‌ నహ్యాన్‌ నుంచి వారసత్వంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. యూఏఈ మొదటి అధ్యక్షుడు  ఆయన తన తండ్రి షేక్ జాయెద్ అల్ నహ్యాన్ 1971లో సింహాసనాన్ని అధిష్టించారు. తండ్రి మరణాంతరం.. ఆయన వారసుడిగా 2004లో యూఎఈకి అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. షేక్‌ ఖలీపా యూఏఈకి రెండో అధ్యక్షుడు కదా ఆ దేశ రాజధాని అబుదాబికి పదహారవ పాలకుడు.

యూఏఈ అధ్యక్షుడి మృతికి సంతాపంగా 40 రోజులపాటు సంతాప దినాలు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో.. దేశ పతాకాన్ని సగం వరకు కిందకు దించి అక్కడి అధికారులు సంతాపం తెలపాలని ఆదేశాలు జారీచేశారు. మూడు రోజులపాటు పబ్లిక్‌, ప్రైవేట్‌ రంగాలు పూర్తిగా బంద్‌ పాటించనున్నాయి.

ఇవి కూడా చదవండి

అబుదాబి క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ జాయెద్‌తో డి- ఫాక్టర్ పాలకుడిగా కనిపించడంతో రోజువారీ వ్యవహారాల్లో పాల్గొనడాన్ని అల్ నహ్యాన్ మానేశారు.  యూఏఈ వేగంగా అభివృద్ధి చెందడంలో షేక్ ఖలీఫా తీవ్రమైన కృషి చేశారు.  అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి ప్రజల శ్రేయస్సు కోసం ఆయన తన మొదటి వ్యూహాత్మక ప్రణాళికను ప్రారంభించారు.

షేక్ ఖలీఫా సవతి సోదరుడు, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఈ మధ్యకాలంలో పరిపాలనలో చురుకుగా ఉంటూ వస్తున్నారు. షేక్ ఖలీఫా వారసుడిగా మొహమ్మద్ బిన్ జాయెద్ అబుదాబీకి అధ్యక్షుడిగా ఎంపిక కానున్నారు. ఇక రాజ్యాంగం ప్రకారం, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్-మక్తూమ్.. యూఏఈ  కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ఏడు ఎమిరేట్స్ పాలకులను 30 రోజుల్లోపు ఫెడరల్ కౌన్సిల్ సమావేశపరచనున్నారు. అప్పటి వరకూ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ యూఏఈ అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..