Trump Hotel: ఆర్థిక కష్టాల్లో ట్రంప్?.. అతిపెద్ద హోటల్ విక్రయం.. బోర్డు పీకేసిన సీజీఐ మర్చంట్..!

Trump Hotel: వ్యాపారం సరిగ్గా లేక హోటల్‌ అమ్మేశారు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌. హోటల్‌ను కొన్న సీజీఐ మర్చంట్ గ్రూప్ ట్రంప్‌ బోర్డును తొలగించేసింది.

Trump Hotel: ఆర్థిక కష్టాల్లో ట్రంప్?.. అతిపెద్ద హోటల్ విక్రయం.. బోర్డు పీకేసిన సీజీఐ మర్చంట్..!
Trump Hotel
Follow us
Shiva Prajapati

|

Updated on: May 13, 2022 | 5:46 PM

Trump Hotel: వ్యాపారం సరిగ్గా లేక హోటల్‌ అమ్మేశారు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌. హోటల్‌ను కొన్న సీజీఐ మర్చంట్ గ్రూప్ ట్రంప్‌ బోర్డును తొలగించేసింది. అవును.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన వాషింగ్టన్‌ డీసీలోని తన హోటల్‌ను హోటల్‌ను అమ్మేశారు. మొత్తం 263 గదులున్న ట్రంప్ ఇంటర్నేషనల్‌ను మయామికి చెందిన సీజీఐ ఏకంగా 375 మిలియన్ డాలర్లు చెల్లించి కొనుగోలు చేసింది. కొత్త యాజమాన్యం హోటల్‌ తమ చేతిలోకి వచ్చిన వెంటనే ట్రంప్ పేరుతో ఉన్న బోర్డును రాత్రికి రాత్రే తొలగించింది. ఇకపై ఈ హోటల్‌ ‘వాల్​డార్ఫ్ అస్టోరియా’తో కొనసాగనున్నట్లు తెలుస్తోంది.

ట్రంప్‌ అమెరికా అధ్యక్షునిగా ఎన్నిక కావడానికి ముందు ఈ హోటల్‌ను ఏర్పాటు చేశారు. ట్రంప్‌ అధ్యక్షునిగా ఉన్న కాలంలో ఈ హోటల్‌ ఒక వెలుగు వెలిగింది. ఆయన మద్దతుదారులు, రిపబ్లికన్‌ పార్టీ నాయకులు, విదేశీ ప్రతినిధులు ఈ హోటల్‌కి ఎక్కువగా వెళ్లేవారు. అయితే ట్రంప్‌ అధికారం కోల్పోయిన తర్వాత హోటల్‌కు విజిటర్ల తాకిడి తగ్గింది. మరోవైపు కరోనా సంక్షోభం సమయంలో వ్యాపారం పడిపోయి ట్రంప్‌ కుటుంబం నష్టపోయింది. దీంతో హోటల్‌ను అమ్మేయాలని నిర్ణయించారు.

ఇవి కూడా చదవండి
Hotel

Hotel

హోటల్ విక్రయంతో వాషింగ్టన్​డీసీలో ట్రంప్ కుటుంబం వ్యాపారం ఇకపై లేకుండా పోయింది. అయితే హోటల్ విక్రయం ద్వారా ఆయనకు భారీగానే లాభాలు వచ్చాయి. ఈ డీల్ మొత్తం విలువ తెలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు సైతం ఆశ్చర్యపోయారు. ట్రంప్‌ అప్పట్లో ఫెడరల్‌ ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకున్న స్థలంలో ఈ హోటల్ ఏర్పాటు చేశారు. అవే షరతులు కొత్త యాజమాన్యానికి కూడా వర్తించనున్నాయి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?