AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఎట్టెట్టా.. హెలికాప్టర్‌ను ఐదు తలల తిమింగళం మింగేసిందా?.. కిరణ్ బేడీ షేర్ చేసిన షాకింగ్ వీడియో..!

Viral Video: టెక్నాలజీ రోజు రోజుకు ఊహకందని రీతిలో అభివృద్ధి చెందుతోంది. ప్రజలకు కూడా టెక్నాలజీని అందిపుచ్చుకుని..

Viral: ఎట్టెట్టా.. హెలికాప్టర్‌ను ఐదు తలల తిమింగళం మింగేసిందా?.. కిరణ్ బేడీ షేర్ చేసిన షాకింగ్ వీడియో..!
Shark
Shiva Prajapati
|

Updated on: May 12, 2022 | 6:11 PM

Share

Viral Video: టెక్నాలజీ రోజు రోజుకు ఊహకందని రీతిలో అభివృద్ధి చెందుతోంది. ప్రజలకు కూడా టెక్నాలజీని అందిపుచ్చుకుని.. జీవితంలో ముందుకు సాగుతున్నారు. అయితే, మరీ ముఖ్యంగా ఇంటర్నెట్ సదుపాయం మారుమూల గ్రామాలకు సైతం అందుబాటులోకి వచ్చాక.. యావత్ ప్రపంచం ఒక కుగ్రామంలా మారిపోయింది. సోషల్ మీడియా యాప్స్‌ కారణంగా ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా ఇట్టే తెలిసిపోంది. సోషల్ మీడియా యాప్స్‌లో రోజుకు లక్షలాది వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని సహజమైనవి ఉంటే.. మరికొన్ని క్రియేట్ చేసినవి ఉంటాయి. అయితే, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో నెటిజన్లను షాక్‌కు గురి చేస్తుంది. ‘ఇది నిజమేనా?’ అని ఆశ్యర్యానికి గురి చేస్తుంది. అయితే, ఈ వీడియోను ఏకంగా మాజీ ఐపీఎస్ అధికారి, మాజీ గవర్నర్ కిరణ్ బేడీ షేర్ చేయడంతో ఆ వీడియో మరింత వైరల్ అయ్యింది.

ఇంతకీ పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ షేర్ చేసిన ఆ వీడియోలో ఏముందో చూద్దాం.. వీడియోలో ఓ హెలికాప్టర్ సముద్రం మీదుగా ప్రయాణిస్తోంది. సముద్రంలో పడవలో ప్రయాణిస్తున్న పర్యాటకులు ఆ హెలికాప్టర్‌ను గమనిస్తూ.. అందులోని వారికి హాయ్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఇంతలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. సముద్రంలోంచి అకస్మాత్తుగా దూసుకొచ్చిన షార్క్.. గాల్లోకి ఎగిరి ఆ హెలికాప్టర్‌ను అమాంతం సముద్రంలోకి తీసుకెళ్లింది. అది చూసిన షిప్‌లోని పర్యాటకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇదీ ఆ వీడియోలో ఉన్న కథ.

ఇవి కూడా చదవండి

అయితే, ఇదంతా నిజం కాదండోయ్.. ఆ వీడియో ఎడిటింగ్ చేసినట్లుగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. వాస్తవానికి ఈ వీడియో 2017లో వచ్చిన హాలీవుడ్ సినిమా 5 Headed Shark Attackd లోని సన్నివేశం. ఇది ఒక ఎడిటెడ్ వీడియో. ఇలాంటి ఎడెటెడ్ వీడియోను కిరణ్ బేడీ లాంటి ప్రముఖులు షేర్ చేయడంపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వీడియోలను ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. చూడటానికి ఆసక్తికరంగా ఉన్నప్పటికీ.. అది వాస్తవానికి దూరంగా ఉన్నందున దీన్ని షేర్ చేయడం కరెక్ట్ కాదని కొందరు సోషల్ మీడియా యూజర్స్ అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా.. ఈ వీడియోను చూసి చాలా మంది నెటిజన్లు అవాక్కవుతున్నారు. టెక్నాలజీపై అవగాహన లేని వారు.. ఇది నిజంగా నిజమేనేమో అని భ్రమపడిపోతున్నారు.