Viral Video: ఎయిర్ పోర్టులో అధికారులను పరుగులు పెట్టించిన కుక్క పిల్ల.. నవ్వులు పూయిస్తున్న వీడియో..
ఎయిర్ పోర్టులో సిబ్బంది లగేజీని తీస్తుండగా.. బోనులో ఉండాల్సిన చిన్న కుక్క పిల్ల తప్పించుకుని బయటకు పరిగెత్తింది.
సాధారణంగా విమాన ప్రయాణం చేసేటప్పుడు.. మన లగేజీతోపాటు.. పెంపుడు జంతువులను కూడా కార్గోలోని బోనులలో జాగ్రత్తగా భద్రపరుస్తారు. విమానంలోపలికి ప్రయాణికులతోపాటు.. పెంపుడు జంతువులకు అనుమతి ఉండదు.. వాటికి ప్రత్యేకంగా కార్గోలో బోనులను ఏర్పాటు చేస్తారు. అయితే కొన్ని సార్లు.. బోనులో ఉండాల్సిన జంతువులు వాటి నుంచి తప్పించుకుని బయటకు వచ్చేస్తుంటాయి. అలాంటి ఘటనే ఓ ఎయిర్ పోర్టులో జరిగింది. ఎయిర్ పోర్టులో సిబ్బంది లగేజీని తీస్తుండగా.. బోనులో ఉండాల్సిన చిన్న కుక్క పిల్ల తప్పించుకుని బయటకు పరిగెత్తింది. దీంతో దానిని పట్టుకోవడానికి ఎయిర్ పోర్ట్ అధికారులు రన్ వే పై పరుగులు పెట్టారు.. ఈ ఘటన మెక్సికోలోని ఓ విమానాశ్రయంలో జరిగింది.
జాలిస్కోలోని గ్వాడలజారాలోని మిగ్యుల్ హిడాల్గో వై కాస్టిల్లా అంతర్జాతీయ విమానాశ్రయంలో.. కార్గోలో బోనులో ఉండాల్సిన చిన్న కుక్కపిల్ల ఆకస్మాత్తుగా రన్ వే పై పరుగులు పెట్టింది. దీంతో ఆ కుక్కపిల్లను పట్టుకోవడానికి అధికారులు దాని వెంట పరుగులు పెట్టారు. చాలా సమయం తర్వాత ఆ కుక్క పిల్లను పట్టుకున్నారు. ఈ ఘటన మొత్తాన్ని అక్కడే విమానం కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు తమ ఫోన్లలో రికార్డ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఫన్నీ వీడియో చూసిన నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: Tina Sadhu: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ఆట డ్యాన్స్ షో విన్నర్ టీనా మృతి
Sarkaru Vaari Paata: బాక్సాఫీస్ లెక్క వేరు.. ఇక్కడ లెక్కలు ఇంకో తీరు..సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫైట్
MS Dhoni: సరికొత్త ఇన్సింగ్స్ స్టార్ట్ చేయనున్న ధోని.. నయనతార సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ..
RRR Movie: ఆర్ఆర్ఆర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ ?.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..