AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Movie: ఆర్ఆర్ఆర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ ?.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..

డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తారక్, చరణ్ కలిసి నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెన్సెషన్ క్రియేట్ చేసింది.

RRR Movie: ఆర్ఆర్ఆర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ ?.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..
Rrr Movie
Rajitha Chanti
|

Updated on: May 12, 2022 | 2:52 PM

Share

ఎట్టకేలకు బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఆర్ఆర్ఆర్ (RRR) ఓటీటీలోకి వచ్చేస్తుంది. సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మూవీ మరో వారం రోజుల్లో. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తారక్, చరణ్ కలిసి నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెన్సెషన్ క్రియేట్ చేసింది. ఇప్పటివరకు దాదాపు రూ. 1300 పైగా వసూళ్లు సాధించి రికార్డుకెక్కిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ అద్భుతమైన నటనకు పాన్ ఇండియా సినీ ప్రియులు ఫిదా అయ్యారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని సౌత్ ఆడియన్స్ మాత్రమే కాకుండా.. నార్త్ వాళ్లు కూడా ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఆర్ఆర్ఆర్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు జీ5 సొంతం చేసుకుందని… అలాగే ఇప్పుడు ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయ్యిందంటూ నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఆర్ఆర్ఆర్ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం జీ5లో మే 20 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లుగా తెలుస్తోంది.. తెలుగుతోపాటు..తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లుగా సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.. దీంతో సినీ ప్రియులు ఖుషి అవుతున్నారు. ఈ మూవీలో చరణ్, తారక్‏తోపాటు.. బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్.. హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరీస్… సముద్రఖని, శ్రియా కీలకపాత్రలలో నటించగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించారు. ఇప్పటికీ ఆర్ఆర్ఆర్ సినిమా వసూళ్ల వేట కొనసాగుతుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Actress Mumtaj : చిక్కుల్లో ఖుషి సినిమా సెకండ్ హీరోయిన్.. పోలీస్ కేసు నమోదు..

Sarkaru Vaari Paata Movie Review : సర్కారు వారి పాట… ఫ్యాన్స్ కి స్పెషల్‌గా!

Sarkaru Vaari Paata: రాజమహేంద్రవరంలో ఫ్యాన్స్ రచ్చ.. పాలాభిషేకాలు, పటాసులతో హంగామా

Sarkaru Vaari Paata: కాంటెస్ట్‌లో గెలిచిన సూపర్ స్టార్ సూపర్ ఫ్యాన్స్‌కు సర్కారు వారి పాట టికెట్స్ అందించనున్న టీవీ9