Sarkaru Vaari Paata: బాక్సాఫీస్ లెక్క వేరు.. ఇక్కడ లెక్కలు ఇంకో తీరు..సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫైట్

ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అదిరిపోయిందంటూ ఉదయం నుంచే సోషల్ మీడియాలో కామెంట్స్.. హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి.

Sarkaru Vaari Paata: బాక్సాఫీస్ లెక్క వేరు.. ఇక్కడ లెక్కలు ఇంకో తీరు..సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫైట్
Svp
Follow us
Rajitha Chanti

|

Updated on: May 12, 2022 | 3:59 PM

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మహేష్ (Mahesh Babu) మేనియా కొనసాగుతుంది. సూపర్ స్టార్ మహేష్.. కీర్తి సురేష్ జంటగా డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) ఈరోజు గ్రాండ్ గా విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అదిరిపోయిందంటూ ఉదయం నుంచే సోషల్ మీడియాలో కామెంట్స్.. హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అలాగే మరోవైపు.. సర్కారు వారి పాట డిజాస్టర్ అంటూ డిజాస్టర్ ఎస్వీపీ అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే సినిమా చూశామని.. అనుకున్నంత స్థాయిలో లేదంటూ డిజాస్టర్ ఎస్వీపీ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు ఇతర హీరోల ఫ్యాన్స్. మహేష్‌బాబు కెరీర్‌లో రెండేళ్ల బిగ్గెస్ట్ గ్యాప్‌ తర్వాత రిలీజైన సినిమా సర్కారువారిపాట. క్రేజీ కంటెంట్‌కి కేరాఫ్ అనే పేరున్న పరశురామ్ డైరెక్ట్ చేసిన మూవీగా సూపర్‌గా పాపులరైంది. ఓపెనింగ్స్ కూడా అదే లెక్కన అదుర్స్ అనిపిస్తున్నాయి.

కాకపోతే… సినిమా ఒరిజినల్ టాకేంటి… సూపర్‌హిట్టా… లేక జస్ట్ హిట్టా… వన్‌టైమ్‌ వాచబులా లేక రిపీటెడ్ ఆడియన్స్‌కి ఛాన్సుందా.. అసలు సినిమా ఎలా ఉందబ్బా… ఎవ్వరికి ఎవరు ఎదురుపడ్డా ఇదే మాట. కానీ… ఆన్‌లైన్‌లో మాత్రం కథ కంప్లీట్‌గా వేరుంది. సర్కారువారి పాట ఒరిజినల్ టాక్ ఏంటో తెలీనంత గజిబిజిగా షో నడిపిస్తున్నారు మిగతా హీరోల అభిమానులు. డిజాస్టర్ SVP పేరుతో ఒక హ్యాష్‌ట్యాగ్ క్రియేట్ చేసుకునిమరీ ట్వీట్స్ చేస్తున్నారు. సర్కారువారి పాట విషయానికే వస్తే… ఎన్టీఆర్, ప్రభాస్‌, పవన్‌ కల్యాణ్‌… హీరో ఎవరన్న తేడా లేకుండా విపరీతంగా జరుగుతోంది ఇంటెన్షనల్ ట్రోలింగ్‌. హీరోల మధ్య… లేని గ్యాప్‌ని పెంచుకుంటూ పోతున్నారు ఆన్ లైన్ అభిమానులు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. సినిమా విడుదలై.. ఫస్ట్ హాఫ్ కూడ కంప్లీట్ కాకముందే ట్విట్టర్ వేదికపై డిజాస్టర్ అంటూ కామెంట్స్ పెట్టేస్తున్నారు ఇతర హీరోల ఫ్యాన్స్.. మరోవైపు మహేష్ బాబు ఫ్యాన్స్ సైతం రంగంలోకి దిగారు.. సర్కారు వారి పాట సూపర్ హిట్ అంటూ.. మహేష్ నటన అదుర్స్.. డైరక్టర్ స్క్రీన్ ప్లే బాగుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో అసలు సర్కారు వారి పాట చూడటానికి ఆసక్తి చూపే సామన్య ప్రేక్షకులు ట్విట్టర్‏లో మొదలైన ఫ్యాన్స్ వార్ తో సినిమా చూడాలా వద్దా అని ఎటూ తెల్చుకోలేకపోతున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

Also Read: Actress Mumtaj : చిక్కుల్లో ఖుషి సినిమా సెకండ్ హీరోయిన్.. పోలీస్ కేసు నమోదు..

Sarkaru Vaari Paata Movie Review : సర్కారు వారి పాట… ఫ్యాన్స్ కి స్పెషల్‌గా!

Sarkaru Vaari Paata: రాజమహేంద్రవరంలో ఫ్యాన్స్ రచ్చ.. పాలాభిషేకాలు, పటాసులతో హంగామా

Sarkaru Vaari Paata: కాంటెస్ట్‌లో గెలిచిన సూపర్ స్టార్ సూపర్ ఫ్యాన్స్‌కు సర్కారు వారి పాట టికెట్స్ అందించనున్న టీవీ9

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే