Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’పై స్పందించిన వైసీపీ నేత విజయసాయి రెడ్డి.. ఒక్క లైన్‌లో కథ ఏంటో చెప్పేశారుగా..

Sarkaru Vaari Paata: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా మహేష్‌ బాబు మేనియానే నడుస్తోంది. సర్కారు వారి పాట సినిమా హంగామాతో థియేటర్లలో సందడి వాతావరణం నెలకొంది. కరోనా కారణంగా పలు సార్లు..

Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట'పై స్పందించిన వైసీపీ నేత విజయసాయి రెడ్డి.. ఒక్క లైన్‌లో కథ ఏంటో చెప్పేశారుగా..
Follow us
Narender Vaitla

|

Updated on: May 12, 2022 | 5:55 PM

Sarkaru Vaari Paata: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా మహేష్‌ బాబు మేనియానే నడుస్తోంది. సర్కారు వారి పాట సినిమా హంగామాతో థియేటర్లలో సందడి వాతావరణం నెలకొంది. కరోనా కారణంగా పలు సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు గురువారం ప్రేక్షకులకు ముందుకు వచ్చేసింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు తొలి రోజు నుంచే దుమ్ము రేపుతోంది. విడుదలైన అన్ని చోట్ల మంచి టాక్‌ సొంతం చేసుకొని దూసుకుపోతోంది. ముఖ్యంగా మహేష్‌ బాబు పోకిరి, దూకుడు వంటి సినిమాల తర్వాత నటిస్తోన్న ఫుల్‌ లెంత్‌ మాస్‌ ఎంటర్‌టైనర్ అని ప్రచారం జరగడంతో అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇక సినిమా కూడా పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకొని దూసుకుపోతోంది.

ఈ నేపథ్యంలో అభిమానుల నుంచి మొదలు సినీ ప్రముఖుల వరకు సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మహేష్‌ బాబు నటన, పరశురామ్‌ దర్శక ప్రతిభకు హ్యాట్సాఫ్‌ చెబుతున్నారు. సోషల్‌ మీడియాలో వేదికగా సినిమా రివ్యూకు సంబంధించిన పోస్టులు చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ జాబితాలోకి వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి కూడా వచ్చి చేరారు. ట్విట్టర్‌ వేదికగా సినిమా గురించి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

సినిమాను వీక్షించిన విజయసాయి రెడ్డి.. ‘సమకాలీన అంశాలను స్పృశిస్తూ సాగిన సందేశాత్మక చిత్రం ‘సర్కార్ వారి పాట’ బాగుంది. పేదలు, పెద్దలకు అప్పు ఇవ్వడంలో బ్యాంక్స్ చూపే తేడా విధానం తెరపై బాగా ఆవిష్కరించారు’ అంటూ రాసుకొచ్చారు. అంతేకాకుండా హీరో మహేష్‌ బాబుకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. ఇక సర్కారు వారి పాట సినిమా బ్యాంకింగ్‌ వ్యవస్థను ఇతి వృత్తంగా తెరకెక్కించిన విషయం తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..