MS Dhoni: సరికొత్త ఇన్సింగ్స్ స్టార్ట్ చేయనున్న ధోని.. నయనతార సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ..

MS Dhoni: సరికొత్త ఇన్సింగ్స్ స్టార్ట్ చేయనున్న ధోని.. నయనతార సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ..
Dhoni

లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రాన్ని ధోని నిర్మించబోతున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

Rajitha Chanti

|

May 12, 2022 | 3:26 PM

టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు… ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‏లో ఎన్నో గొప్ప విజయాలను సాధించిన ధోని.. ఇప్పుడు సినీ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. కానీ హీరోగా.. నటుడిగా మాత్రం కాదండోయ్.. నిర్మాతగా సినీ పరిశ్రమలోకి అరంగేట్రం చేయబోతున్నాడు. లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రాన్ని ధోని నిర్మించబోతున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అంతేకాకుండా. ధోని నిర్మాణంలో నటించేందుకు నయన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట.. ప్రస్తుతం ధోని తన సొంత నిర్మాణ సంస్థ కోసం టీమ్‏ను రెడీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.

ఇదిలా ఉంటే ధోని ప్రస్తుతం ఐపీఎల్ మ్యా్చ్‏లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు వచ్చే నెలలో నయన్.. విఘ్నేష్ శివన్ పెళ్లి చేసుకోబోతున్నారు. అటు ఐపీఎల్ మ్యాచ్ లు ముగిసిన తర్వాత.. మరోవైపు నయన్ పెళ్లి తర్వాత ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను ప్రకటించనున్నాని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నారు. అయితే గతంలోనూ ధోని సినీ ఇండస్ట్రీలో కొద్దిగా అనుబంధం కలిగి ఉన్నాడు.. తన జీవిత చరిత్ర ఆధారంగా 2016లో విడుదలైన ఎంఎస్ ధోని చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఈ సినిమాలో ధోనీ పాత్రలో నటించగా.. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ధోని భార్య సాక్షి సింగ్ పాత్రలో నటించింది. ఇక సౌత్ ఇండస్ట్రీలోనే లేడీ సూపర్ స్టార్ గా భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న నయన్.. ప్రధాన పాత్రలో ధోని సినిమా నిర్మిస్తుండడంతో ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులలో క్యూరియాసిటీ ఏర్పడింది. ప్రస్తుతం నయన్ చేతిలో ఐదు చిత్రాలున్నాయి. అలాగే డైరెక్టర్ అట్లీ, షారుఖ్ ఖాన్ కాంబోలో రాబోతున్న సినిమాలో నయన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Actress Mumtaj : చిక్కుల్లో ఖుషి సినిమా సెకండ్ హీరోయిన్.. పోలీస్ కేసు నమోదు..

Sarkaru Vaari Paata Movie Review : సర్కారు వారి పాట… ఫ్యాన్స్ కి స్పెషల్‌గా!

Sarkaru Vaari Paata: రాజమహేంద్రవరంలో ఫ్యాన్స్ రచ్చ.. పాలాభిషేకాలు, పటాసులతో హంగామా

ఇవి కూడా చదవండి

Sarkaru Vaari Paata: కాంటెస్ట్‌లో గెలిచిన సూపర్ స్టార్ సూపర్ ఫ్యాన్స్‌కు సర్కారు వారి పాట టికెట్స్ అందించనున్న టీవీ9

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu