Pacific Ocean: పసిఫిక్ మహాసముద్రంలో అద్భుతం.. అడుగు బాగాన ‘ఇటుకల రహదారి’.. పూర్తి వివరాలివే..!

Pacific Ocean: ఈ భూమిపై ఉన్న మహా సముద్రాలలో పసిఫిక్ మహాసముద్రం అత్యంత లోతైనది. ఈ సముద్రంలో అత్యంత లోతైన అగాధాలు కూడా ఉన్నాయి. అయితే, పదుల కిలోమీటర్ల..

Pacific Ocean: పసిఫిక్ మహాసముద్రంలో అద్భుతం.. అడుగు బాగాన ‘ఇటుకల రహదారి’.. పూర్తి వివరాలివే..!
Bricks
Follow us
Shiva Prajapati

|

Updated on: May 11, 2022 | 10:29 PM

Pacific Ocean: ఈ భూమిపై ఉన్న మహా సముద్రాలలో పసిఫిక్ మహాసముద్రం అత్యంత లోతైనది. ఈ సముద్రంలో అత్యంత లోతైన అగాధాలు కూడా ఉన్నాయి. అయితే, పదుల కిలోమీటర్ల లోతు కలిగిన మహాసముద్రాల్లో ఇప్పటికీ ఎన్నో అంతుచిక్కని, వెలుగులోకి రాని రహ్యాలు ఉన్నాయి. అందుకే నిత్యం ఏదో ఒకటి అంశం వెలుగు చూస్తూనే ఉంటుంది. ఈ రహస్యాలను చేధించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది సముద్ర పరిశోధకులు పరిశోధనలను సాగిస్తూనే ఉన్నారు. సముద్ర గర్భంలోకి అణువణువూ గాలిస్తున్నారు.

ఇదిలాఉంటే.. తాజాగా పసిఫిక్ మహాసముద్రంలో అద్భుతం బయటపడింది. పసుపు ఇటుకలతో కూడి రహదారిని కనుగొన్నారు పరిశోధకులు. పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న పర్వత శిఖరం అడుగు బాగంలో ఆసక్తికర దృశ్యాన్ని గమనించారు. ఇదేదో కొత్తగా ఉందని పరిశీలించి చూశారు. పసుపు రంగులో ఉన్న ఇటుకలతో నిర్మించిన రహదారిని పరిశోధకులు గుర్తించారు.

పసిఫిక్ మహాసముద్రంలోని పాపహనామోకుకేయా మెరైన్ నేషన్ మాన్యుమెంట్(PMNM)లోని లిలియుకలాని శిఖరాన్ని సర్వే చేస్తున్నప్పుడు పరిశోధకులు ‘పసుపు ఇటుకల రహదారి’ని కనిపెట్టారు. పౌరాణిక నగరమైన అట్లాంటిస్‌కు రహదారిగా అభిప్రాయపడ్డారు ఓ పరిశోధకుడు. మరొకరు దీన్ని ది విజార్డ్ ఆఫ్ ఓజ్ చిత్రం ద్వారా ప్రాచుర్యం పొందిన పసుపు ఇసుక రహదారితో పోల్చారు. మనుషులు తయారు చేసినట్లుగా కనిపించే నిర్మాణాన్ని కనిపెట్టడం చాలా ఉత్సాహంగా ఉందన్నారు పరిశోధకులు.

ఇవి కూడా చదవండి

ఇంతకీ సముద్రం అడుగున రహదారి ఎలా ఏర్పడింది? మహాసముద్రం అడుగు బాగాన ఇటుకల రహదారి ఏర్పడటానికి ఓ కారణం ఉందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఈ అద్భుతమైన, ప్రత్యేకమైన, మనోహరమైన భౌగోళిక నిర్మాణం పురాతన అగ్నిపర్వత శిలలు ఏకరీతిలో విచ్ఛిన్నం అవడం ఇది ఏర్పడిందని వివరించారు. పౌరాణిక నగరమైన అట్లాంటిస్‌కి పసుపు ఇటుక రహదారి మాదిరిగా కనిపించడం నిజంగా పురాతన క్రియాశీల అగ్నిపర్వత భూగర్భ శాస్త్రానికి ఉదాహరణగా పేర్కొంటున్నారు శాస్త్రవేత్తలు.

ఎండిన సరస్సు మంచం వలెం కనిపించే నిర్మాణం వాస్తవానికి హైలోక్లాస్టైట్, అధిక శక్తి విస్పోటనాలతో ఏర్పడిన అగ్నిపర్వత శిల అని చెప్పారు శాస్త్రవేత్తలు. సముద్ర గర్భంలో అనేక రాతి శకలాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో మరిన్ని అగ్నిపర్వత విస్పోటనాలు చోటు చేసుకోవడంతో కాలక్రమేణా పదేపదే శిలలు వేడెక్కడం, ఒక క్రమ పద్ధతిలి విచ్ఛిన్నం అవడం కారణంగా ఇవి ఏర్పడినట్లు తెలిపారు.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే