Google Translate: యూజర్లకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన గూగుల్‌.. ట్రాన్స్‌లేషన్‌లో కొత్తగా మరో 24 భాషలు..

Google Translate: ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే బ్రౌజర్లలో గూగుల్‌ మొదటి వరుసలో ఉంటుంది. ఆ మాటకొస్తే ఎన్నో వెబ్‌ బ్రౌజర్లు అందుబాటులో ఉన్నా చాలా మంది మొదటగా గుర్తొచ్చేది గూగుల్‌ ఒక్కటే. అంతలా యూజర్లను..

Google Translate: యూజర్లకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన గూగుల్‌.. ట్రాన్స్‌లేషన్‌లో కొత్తగా మరో 24 భాషలు..
Google Translate
Follow us
Narender Vaitla

|

Updated on: May 12, 2022 | 2:36 PM

Google Translate: ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే బ్రౌజర్లలో గూగుల్‌ మొదటి వరుసలో ఉంటుంది. ఆ మాటకొస్తే ఎన్నో వెబ్‌ బ్రౌజర్లు అందుబాటులో ఉన్నా చాలా మంది మొదటగా గుర్తొచ్చేది గూగుల్‌ ఒక్కటే. అంతలా యూజర్లను ఆకట్టుకుందీ వెబ్‌ బ్రౌజర్‌. ఏ చిన్న సమాచారం కావాలన్నా వెంటనే గూగుల్‌లో చూడకపోయావ అనే సమాధానం వస్తుంది. ఇలా గూగుల్‌ అందించే పలు రకాల సేవల్లో ‘గూగుల్‌ ట్రాన్స్‌లేట్‌’ ఒకటి. ఇతర భాషల్లో ఉన్న కంటెంట్‌ను నచ్చిన భాషల్లోకి క్షణాల్లో మార్చుకొని చూసుకునే అవకాశం గూగుల్‌ అందించింది.

ఇదిలా ఉంటే తాజాగా గూగుల్‌ ట్రాన్స్‌లేట్‌ సేవలను మరో 24 కొత్త భాషలకు విస్తరించింది. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 133 భాషల్లోకి కంటెంట్‌ను ట్రాన్స్‌లేట్‌ చేసుకునే అవకాశం కల్పించింది. కొత్తగా జోడించింన ఈ 24 భాషలను 300 మిలియన్ల ప్రజలు మాట్లాడుతున్నట్లు గూగుల్‌ తెలిపింది. వీటిలో భారత్‌కు చెందిన 8 భాషలు ఉన్నాయి. గూగుల్‌ కొత్తగా చేర్చిన అస్సామీ ఈశాన్య భారతంలోని 25 మిలియన్ల మంది మాట్లాడుతున్నారు. అలాగే ఉత్తర భారతదేశం, నేపాల్‌, ఫిజిలో భోజ్‌పురి భాషను 50 మిలియన్ల మంది మాట్లాడుతున్నారు. డోగ్రీ (3 మిలియన్‌), కొంకణి (2 మిలియన్‌), మైతిలీ (34 మిలియన్‌), మణిపురి (2 మిలియన్‌), మిజో (8,30,000), సంస్కృతం (20,000) మాట్లాడే భాషలను గూగుల్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది.

గూగుల్ ట్రాన్స్‌లేట్‌ను వినియోగించుకునేందుకు అందుబాటులో ఉన్న విధానాలు..

* నేరుగా గూగుల్‌ ట్రాన్స్‌లేట్‌ను టైప్‌ చేయడం ద్వారా.

ఇవి కూడా చదవండి

* ఇతర భాషల్లో ఉన్న ఇమేజ్‌ టెక్ట్స్‌ను నచ్చిన భాషల్లోకి తర్జుమా చేసుకోవడం.

* ఫోన్‌ కెమెరాతో అప్పటికప్పుడు ట్రాన్స్‌లేషన్‌ చేసుకునే విధానం.

* అక్షరాలు/ పదాలను చేతితో రాయడం ద్వారా.

* ఎవరైనా మాట్లాడుతుండగా అప్పటికప్పుడు నచ్చిన భాషల్లోకి తర్జూమా చేసుకోవడం.

* గూగుల్‌ ట్రాన్స్‌లేట్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే యూజర్లు ఇంటర్‌నెట్‌ లేకుండానే కంటెంట్‌ను ట్రాన్స్‌లేట్‌ చేసుకోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..