Google Search: గూగుల్‌లో ఈ పదాలను అస్సలు సెర్చ్ చేయకండి.. చేస్తే మీరు జైలు ఊచలు లెక్కపెట్టాల్సి రావచ్చు.. అవేంటో తెలుసుకోండి..

మనకు తెలియని ప్రతీ ప్రశ్నకు జవాబును ఇక్కడ అడిగి తెలుసుకోవచ్చు. ప్రపంచాన్ని మన కళ్ల ముందు ఉంచడమే కాదు.. మన గుప్పిట్లో చిక్కు ముడులు వీడుతుంది. ఇలా..

Google Search: గూగుల్‌లో ఈ పదాలను అస్సలు సెర్చ్ చేయకండి.. చేస్తే మీరు జైలు ఊచలు లెక్కపెట్టాల్సి రావచ్చు.. అవేంటో తెలుసుకోండి..
Google Search
Follow us
Sanjay Kasula

| Edited By: Ravi Kiran

Updated on: May 18, 2022 | 10:07 AM

గూగుల్. ప్రస్తుతం చిన్న పిల్లాడి నుంచి మొదలు.. ముసలివారి వరకు ప్రతీ ఒక్కరికీ పరిచయమైన పదం. ఈ గూగుల్ అంటే తెలియని వారు దాదాపు ఇప్పుడు కనిపించరు. మనకు తెలియని ప్రతీ ప్రశ్నకు జవాబును ఇక్కడ అడిగి తెలుసుకోవచ్చు. ప్రపంచాన్ని మన కళ్ల ముందు ఉంచడమే కాదు.. మన గుప్పిట్లో చిక్కు ముడులు వీడుతుంది. ఇలా అడ్రస్ వెత‌క‌డం నుంచి ఆన్‌లైన్ బ్యాంకింగ్ వ‌ర‌కు ఏ విష‌యం కావాల‌న్నా ముందుగా సెర్చ్ చేసేది గూగుల్‌లోనే.. అంత‌లా మ‌నం గూగుల్‌కు అల‌వాటు ప‌డిపోయాం.ఈరోజు మనం ఇంటర్నెట్‌లో ఏదైనా సెర్చ్ చేయాలనుకుంటే ముందుగా గూగుల్‌కి వెళ్తాము. ఎందుకంటే ఇక్కడ మనకు అవసరమైన సమాచారం లభిస్తుంది. కానీ Googleలో ఏదైనా శోధించడం మీపై భారంగా ఉంటుంది. అవును, మీరు Googleలో శోధించలేని కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అలా చేయడం మిమ్మల్ని  కటకటాలు లెక్కింపచేసే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు పొరపాటున కూడా గూగుల్‌లో సెర్చ్ చేయకూడాని అంశాలను ఇక్కడ అందిస్తున్నాం.

1) పిల్లల అశ్లీలత (చైల్డ్ పోర్న్) ఐటీ నిబంధనల కోరలకు కేంద్రం మరింత పదును పెడుతోంది. ఈ పదం అంటే మీరు పిల్లలకు సంబంధించిన అశ్లీల కంటెంట్‌ను వెతకడం. భారత ప్రభుత్వం దీనికి సంబంధించి కఠినమైన చట్టాన్ని చేసింది. ఇది పోక్సో చట్టం కింద జైలు ఊచలు లెక్కించాల్సి ఉంటుంది. ఇలా గూగుల్‌లో ఏదైనా సెర్చ్ చేస్తూ పట్టుబడితే 5 నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

2) బాంబ్ ఎలా తయారు చేయాలి.. మీరు కూడా అనుకోకుండా గూగుల్ లో సెర్చ్ చేస్తే బాంబ్ ఎలా తయారు చేయాలి అని సెర్చ్ చేస్తే మీరు చిక్కుల్లో పడవచ్చు. ఇలా చేయడం ద్వారా మీరు భద్రతా ఏజెన్సీ రాడార్‌లో ఉంటారు. మీపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు.

3) మీరు గూగుల్‌లో విపరీతంగా వెతకవలసి మీరు అబార్షన్‌కు సంబంధించిన సమాచారాన్ని గూగుల్‌లో కూడా సెర్చ్ చేస్తే మీరు ఇబ్బందుల్లో పడతారు. దీనికి కారణం భారత్ లోని ప్రభుత్వం దీని కోసం కఠినమైన చట్టాలను రూపొందించింది. ఇది డాక్టర్ ఆమోదం తర్వాత మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఇలాంటి వాటి కోసం వెతకడానికి ముందు ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసకోండి.