Elon Musk: ట్రంప్‌పై ట్విట్టర్ బ్యాన్ ఎత్తేస్తా.. ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం..
ఇటీవల ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన ఎలన్ మస్క్ ట్రంప్‌పై ఉన్న ట్విట్టర్ నిషేధాన్ని ఎత్తివేస్తానని ప్రకటించారు. ఫైనాన్షియల్ టైమ్స్ ఫ్యూచర్ ఆఫ్ ది కార్ కాన్ఫరెన్స్‌లో మస్క్ ఈ విషయాన్ని వెల్లడించారు. శాశ్వత నిషేధాలు..
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్(Donald Trump) ట్రంప్‌పై ట్విట్టర్(Twitter) నిషేధాన్ని ఎత్తివేస్తానని టెస్లా సీఈవో(Tesla CEO), ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్(Elon Musk)ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ట్రంప్ పదవీకాలం చివరి రోజుల్లో ఉన్నప్పుడు ఆయన ఖాతాపై నిషేధం విధించారు. ట్విట్టర్ విధానాలను ఉల్లంఘించారని ట్రంప్ ఖాతాను నిషేధించారు. అయితే ఇటీవల ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన ఎలన్ మస్క్ ట్రంప్‌పై ఉన్న ట్విట్టర్ నిషేధాన్ని ఎత్తివేస్తానని ప్రకటించారు. ఫైనాన్షియల్ టైమ్స్ ఫ్యూచర్ ఆఫ్ ది కార్ కాన్ఫరెన్స్‌లో మస్క్ ఈ విషయాన్ని వెల్లడించారు. శాశ్వత నిషేధాలు చాలా అరుదుగా ఉండాలని, స్కామ్‌లు లేదా స్పామ్ ఖాతాలకు ఇది వర్తింపజేయాలని అభిప్రాయపడ్డారు. ట్రంప్‌పై నిషేధం విధించడం సరికాదని తాను భావిస్తున్నానని, శాశ్వత నిషేధాన్ని తొలగిస్తామని మస్క్ తెలిపారు.
జనవరి 2021లో, ట్రంప్ మద్దతుదారులు US పార్లమెంట్‌పై దాడి చేయడంతో ట్రంప్ ట్విట్టర్ ను శాశ్వతంగా నిషేధించారు. జనవరి 6న పార్లమెంట్‌పై దాడి తర్వాత హింసాత్మక ఘటనలు మరింత పెరిగే ప్రమాదం ఉన్నందున నిషేధం విధించాలని నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. ఆ సమయంలో, అమెరికా మాజీ అధ్యక్షుడికి ట్విట్టర్‌లో 80 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని ట్రంప్, తన మద్దతుదారులను ట్విట్టర్ ద్వారా యుఎస్ పార్లమెంటును ఘెరావ్ చేయాలని కోరారు. ఆయన మద్దతుదారులు పార్లమెంటులో హింసకు పాల్పడ్డారు. అదే సమయంలో, హింసను ఖండించడానికి బదులుగా.. ట్రంప్ మద్దతుదారులను విప్లవకారులుగా పిలిచారు. ఆ సమయంలో హింసను ప్రేరేపించే అవకాశం ఉన్నందున ట్రంప్ ట్విట్టర్ ఖాతాను నిషేధించారు.
అయితే ఎలన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేస్తున్నట్ట ప్రకటన వెలువడగానే ట్రంప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లోకి తిరిగి రావడానికి దారితీస్తుందా అనే చర్చలు కూడా అప్పుడే మొదలయ్యాయి. వారి అంచనాలు ఇప్పుడు నిజమయ్యాయి. అయితే ట్రంప్ మాత్రం తాను ట్విట్టర్‌కి తిరిగి వెళ్లననీ, గత కొన్ని వారాల్లో ట్రూత్ సోషల్ లో యాక్టివ్‌గా ఉంటాననీ తెలిపారు. అయితే ఇప్పుడు ఎలన్ మస్క్ వల్ల ఆయన తిరిగి ట్విట్టర్ ఖాతాను ఉపయోగిస్తారా ? లేదా ట్రూత్ సోషల్‌లోనే కొనసాగుతారా ? అనేది త్వరలోనే తేలిపోనుంది.