US-Israel Iran War Highlights: గల్ఫ్ దేశాల నుంచి భారత్‌కు విమానాల రాకపోకలు
US-Israel Iran War News Highlights in Telugu: ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం మధ్యప్రాచ్యాన్ని అతలాకుతలం చేస్తోంది. కువైట్, ఖతర్, యూఏఈ, బహ్రెయిన్ వంటి గల్ఫ్ దేశాలపై దాడులు జరగడంతో అక్కడ ఉద్యోగాలు చేస్తున్న లక్షలాది మంది తెలుగువారు భయాందోళనల్లో గడుపుతున్నారు. ఆకాశంలో పేలుళ్ల దృశ్యాలను చూసి ఇక్కడ వారి కుటుంబసభ్యులు క్షణక్షణం భయంతో కాలం వెళ్లదీస్తున్నారు. ఈ సమయంలో మోదీ ఇజ్రాయెల్ ప్రధానితో మాట్లాడారు.

US-Israel Iran War Highlights: ఇజ్రాయిల్-ఇరాన్ వార్ భీకరంగా మారుతోంది. ఈ యుద్ధం కేవలం రెండు దేశాలకు మాత్రమే పరిమితం కాకుండా, మొత్తం మిడిల్ ఈస్ట్‌నే అతలాకుతలం చేస్తోంది. భారతీయులు.. ప్రత్యేకించి తెలుగువాళ్లు ఎక్కువగా నివసించే కువైట్, ఖతర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ వంటి దేశాలపైనా దాడులు జరిగాయి. ఆకాశంలో పేలుతున్న దృశ్యాలు చూసి హైదరాబాద్ వాసులు భయప్రాంతాలకు గురవుతున్నారు.. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం తెలంగాణకు చెందిన లక్షల మంది గల్ఫ్ దేశాల్లో వివిధ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. యుద్ధం నేపథ్యంలో ఏ క్షణాన ఏ వార్త వినాల్సి వస్తుందో అన్న భయంతో గడుపుతున్నారు. ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో అక్కడ ఉపాధి పొందుతున్న వారి బాధిత కుటుంబసభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉంది.
ఇజ్రాయెల్ ప్రధానితో మోదీ
ఈ క్రమంలో ప్రధాని మోదీ ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో టెలిఫోన్‌లో మాట్లాడారు. ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేనీ హత్య నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులు, ఇరాన్ చేపట్టిన ప్రతీకార దాడుల నేపథ్యంలో ఈ చర్చ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రాంతీయ పరిస్థితులను వివరంగా చర్చించామని మోదీ తెలిపారు. “ఇటీవలి పరిణామాలపై భారత ఆందోళనలను నెతన్యాహుకు తెలియజేశాను. పౌరుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. శత్రుత్వాలను త్వరగా నిలిపివేయాల్సిన అవసరం ఉంది” అని మోదీ స్పష్టం చేశారు.
మరోవైపు ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్ మరో ప్రకటన చేశారు. 9 ఇరాన్ యుద్ధనౌకలు సముద్రంలో మునిగిపోయాయని, ఇరాన్ నేవీ హెడ్‌క్వార్టర్స్‌ను కూడా ధ్వంసం చేశామన్నారు. మిగిలిన నౌకల వేట కూడా కొనసాగుతోందని.. ఇరాన్ నౌకాదళం మొత్తం నాశనమైందని తెలిపారు. దాడుల్లో 48 మంది ఇరాన్ నేతలు చనిపోయారన్నారు. చమురు ధరల పెరుగుదలపై ఆందోళన వద్దని తెలిపారు ట్రంప్. ఇరాన్ నేతలు నాతో మాట్లాడాలని కోరుకుంటున్నారని, ఇరాన్‌తో చర్చలకు సిద్ధం అన్నారు ట్రంప్. చర్చల కోసం ఇరాన్ ముందే రావాల్సిందన్నారు ట్రంప్.
LIVE NEWS & UPDATES
-
ఇజ్రాయిల్ కొత్త రక్షణమంత్రి మృతి: ఇజ్రాయెల్ మీడియా
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం మధ్యప్రాచ్యాన్ని అతలాకుతలం చేస్తోంది. అయితే తాజాగా జరిగిన దాడుల్లో ఇజ్రాయెల్ రక్షణ మత్రిగా బాధ్యతలు చేపట్టిన మజీద్ ఆల్‌రెజా మృతి చెందినట్లు ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. రక్షణమంత్రిగా నిన్నే బాధ్యతలు చేపట్టారు మజీద్ అల్ రెజా.
-
ఇరాన్ అధ్యక్షుడు కీలక ప్రకటన
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతుండగా, గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలు, అమెరికా రాయబార కార్యాలయాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేస్తోంది. అమెరికా అధ్యక్ష భవనంపై దాడులు జరిపినట్టు ఇజ్రాయెల్ తాజాగా ప్రకటించింది. ఈ క్రమంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియన్ తాజాగా కీలక ప్రకటన చేసారు. యుద్ధం కొనసాగుతున్నా ఇరాన్ ప్రభుత్వ యంత్రాంగ అద్భుతంగా పనిచేస్తోందన్నారు.
-
-
ట్రంప్ ప్రకటన విడుదల
అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇరాన్ ఇప్పుడు చర్చలు జరపాలని కోరుకుంటోందని, కానీ చాలా ఆలస్యం అయిందని తాను నమ్ముతున్నానని ఆయన అన్నారు. అమెరికా – ఇజ్రాయెల్ సంయుక్త చర్యల కారణంగా మధ్యప్రాచ్యంలో పరిస్థితి చాలా తీవ్రంగా మారిన సమయంలో ఈ ప్రకటన వచ్చింది. టెహ్రాన్‌పై అమెరికా – ఇజ్రాయెల్ సంయుక్త దాడుల మధ్య ఇరాన్ నాయకత్వం చర్చలు జరపాలని కోరుకుంటున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.
-
48 గంటల్లో 8 దేశాధినేతలతో మాట్లాడిన మోదీ
ఇరాన్ – అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రతరం అవుతోంది. ఈ నేపథ్యంలో యుఎఇ-ఒమన్ నుండి ఖతార్ వరకు.. భారత ప్రధాని మోదీ 48 గంటల్లో ఈ 8 దేశాల అధినేతలతో మాట్లాడారు. పశ్చిమాసియాలో తాజా పరిస్థితిపై చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లో పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
-
ఇరాన్‌పై మరోసారి విరుచుకుపడ్డ ట్రంప్
ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్, నేవీని నాశనం చేశామని వెల్లడించారు. మరో చర్చలకు సిద్ధమని ఇరాన్ అంటోందని, కానీ ఇప్పటికే ఆలస్యమైందని అన్నారు.
-
-
దాడిని ఖండించిన సౌదీ
తమ దేశంలో అమెరికన్ ఎంబీసీపై దాడిని ఖండించింది సౌది. ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని తెలిపింది.
-
ఒమన్‌లో ఇరాన్ డ్రోన్ల కలకలం
ఒమన్‌లో ఇరాన్ డ్రోన్లు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. దోఫర్‌లో రెండు డ్రోన్లను అడ్డుకున్నాయి భద్రతాదళాలు. సలాల పోర్ట్ సమీపంలో మరో డ్రోన్ కూలిపోయింది.
-
గల్ఫ్ దేశాధినేతలకు ప్రధాని మోదీ ఫోన్
గల్ఫ్ దేశాల నేతలతో ప్రధాని మోదీ మరోసారి ఫోన్లో మాట్లాడారు. ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిఖ్, కువైట్ యువరాజు షేక్ సబా అల్ ఖలీద్‌తో చర్చలు జరిపారు. ఒమన్ , కువైట్ దాడులపై మోదీ తీవ్రంగా ఖండించారు. రెండు దేశాల్లో భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.
మరోవైపు యూరోపియన్ యూనియన్ నేతలతో విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ చర్చలు జరిపారు. పశ్చిమాసియాలో తాజా పరిస్థితిపై చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లో పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని సూచించారు జైశంకర్.
-
చమురు, గ్యాస్ నిల్వలపై కేంద్రం కీలక ప్రకటన
చమురు, గ్యాస్ నిల్వలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. భారతదేశంలో 45 రోజుల పాటు ఉండేంత ముడి చమురు నిల్వలు ఉన్నాయని తెలిపింది. ముడి చమురు సరఫరా అంతరాయం కలిగితే దేశ పురోగతిని ఆపదు. ముడి చమురుకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపింది.
-
ఆయిల్ ఫీల్డ్‌పై డ్రోన్‌లతో దాడి
యూఏఈలోని ఫుజైరా ఆయిల్ ఫీల్డ్‌పై డ్రోన్‌లతో దాడులకు తెగబడుతున్నారు. ఆయిల్ ఫీల్డ్ నుంచి భారీ ఎత్తున మంటల ఎగిసి పడుతున్నాయి. అయితే డ్రోన్ దాడిని గాల్లోనే అడ్డుకుంటోంది యూఏఈ. డ్రోన్ శకలాలు పడి మంటలు చెలరేగాయని UAE తెలిపింది.
-
మేము వారికి సమాయం చేయలేము- అమెరికా
ఇరాన్‌తో యుద్ధం కారణంగా ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న తమ పౌరులను తరలించడానికి ఎటువంటి ప్రయత్నం చేయబోమని జెరూసలేంలోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది. ఇజ్రాయెల్‌ను విడిచి వెళ్లడానికి అమెరికన్ పౌరులు తమ స్వంత ఏర్పాట్లు చేసుకోవాలని రాయబార కార్యాలయం పేర్కొంది. “మేము వారికి సహాయం చేయలేము” అని అది పేర్కొంది. తన పౌరులను రక్షించడం గురించి అమెరికా ఇటువంటి ప్రకటన జారీ చేయడం ఇదే మొదటిసారి.
-
గల్ఫ్‌లోని చమురు క్షేత్రాలు లక్ష్యంగా ఇరాన్ దాడులు
గల్ఫ్‌లోని చమురు క్షేత్రాల లక్ష్యంగా ఇరాన్ దాడులకు తెగబడుతోంది. యూఏఈలోని పుజైరా ఆయిల్ ఫీల్డ్‌పై డ్రోన్ దాడి చేసింది. ఆయిల్ ఫీల్డ్ నుంచి మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి.
-
గల్ఫ్ దేశాల నుంచి భారత్‌కు విమానాల రాకపోకలు
–గల్ఫ్ దేశాల నుంచి కొనసాగుతోన్న విమాన రాకపోకలు
–దుబాయ్ నుంచి 149 మందితో ఢిల్లీకి తొలి విమానం
–దుబాయ్, అబుదాబి, మస్కట్ నుంచి భారత్‌కు విమానాలు
–మస్కట్, అబుదాబి నుంచి ఢిల్లీ చేరుకున్న 2 విమానాలు
–జెడ్డా నుంచి భారత్‌కు 10 విమానాలు నడుపుతున్న ఇండిగో
–జెడ్డాకు ఆరు విమానాలు నడుపుతున్నట్టు ఆకాశ ఎయిర్ ప్రకటన
–ఒమన్‌కు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసులు
-
టెహ్రాన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల తరలింపు
టెహ్రాన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని ఇండియన్ ఎంబసీ పేర్కొంది. విద్యార్థులకు ఎలాంటి హానీ జరుగకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపింది.
-
అణు కేంద్రంపై దాడి
ఇరాన్‌లోని నటాన్జ్ అణుకేంద్రంపై దాడి జరిగినట్లు IAEA తెలిపింది. అణు కేంద్రం ప్రాంగణంలోని భవనాలు దెబ్బతిన్నాయని తెలిపింది. అయితే రేడియేషన్ లీకేజీ జరగలేదని పేర్కొంది.
-
ఇరాన్‌లో ఇప్పటి వరకు 787 మంది మృతి
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం మధ్యప్రాచ్యాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇరాన్‌లో ఇప్పటి వరకు 787 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. కువైట్, ఖతర్, యూఏఈ, బహ్రెయిన్ వంటి గల్ఫ్ దేశాలపై దాడులు జరగడంతో అక్కడ ఉద్యోగాలు చేస్తున్న లక్షలాది మంది తెలుగువారు భయాందోళనల్లో గడుపుతున్నారు.
-
ఖమేనీని చంపడానికి అమెరికా ఎంత ఖర్చు చేసిందో తెలుసా..?
ఖమేనీని చంపేందుకు అమెరికా భారీ ఎత్తున ఖర్చు చేసింది. 2023 అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా , హమాస్ దాడుల తర్వాత అమెరికా ఇరాన్‌లో CIAని విస్తృతంగా మోహరించింది. బ్రౌన్ ఎడు విశ్లేషణ ప్రకారం, 2023 -2025 మధ్య, ఇరాన్‌లో నిఘా సమాచారాన్ని సేకరించి ఈ ఆపరేషన్‌ను నిర్వహించడానికి అమెరికా సుమారు $2.5 బిలియన్లు (సుమారు రూ. 2.28 లక్షల కోట్లు) ఖర్చు చేసింది.
-
ఇరాన్‌లో భారీ భూకంపం
రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైన భూకంప తీవ్రత
దక్షిణ ఇరాన్‌లోని ఫార్స్ ప్రావిన్స్‌లోని ఖోంజ్ సమీపంలో కంపించిన భూమి
గెరాష్‌కు ఉత్తర-వాయువ్యంగా 55 కి.మీ దూరంలో భూకంప కేంద్ర గుర్తింపు
భూమి నుంచి 10 కి.మీ లోతులో ఏర్పడిన భూకంప కేంద్రం
భూకంప కేంద్రానికి దగ్గరగా ఉన్న ఇళ్లలో భూ ప్రకంపనలు
-
ఇరాన్ రాజధాని టెహ్రాన్ శివారు ప్రాంతాల్లో IDF దాడులు
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌తో పాటు శివారు ప్రాంతాలపై ఇజ్రాయెల్ రక్షణ దళం IDF భీకర దాడులు చేసింది. ఈ దాడులతో నగరంలో భారీ పేలుళ్లు సంభవించి ఆకాశంలోకి దట్టమైన పొగలు వ్యాపించాయి. ఇరాన్‌లోని టెహ్రాన్, లెబనాన్‌లోని బీరుట్‌లో ఉన్న సైనిక, వ్యూహాత్మక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. రెండు నగరాల్లోని “సైనిక లక్ష్యాలపై” కొత్త దాడులను ప్రారంభిస్తున్నట్లు ఇజ్రాయెల్ ఈ ఉదయం ప్రకటించింది.
-
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా పాకిస్తాన్‌లో ఆందోళనలు
లాహోర్‌లోని అమెరికా కాన్సులేట్ వెలుపల ఉద్రిక్తత
కాన్సులేట్‌లోకి దూసుకెళ్లిన వందలాది మంది ఇరాన్ మద్దతుదారులు
కాన్సులేట్ కాన్సులేట్ గేట్‌కు నిప్పు పెట్టారు.
ఇటు ఇస్లామాబాద్, పెషావర్‌లో కూడా నిరసనలు
అన్ని ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
మరోవైపు పాక్‌లోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని
ఇస్లామాబాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం సూచించింది
-
అమెరికా-ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధంలో కీలక పరిణామం
ఇరాన్‌కు మద్దతుగా గళం విప్పిన చైనా
ఇరాన్ సార్వభౌమాధికారాన్ని కాపాడుతామన్న చైనా
అమెరికా , ఇజ్రాయెల్ వెంటనే దాడులు ఆపాలన్న చైనా
ఇరానియన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చితో ఫోన్‌లో మాట్లాడిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యి
Chinese FM Wang Yi held a phone conversation with Iranian FM Seyed Abbas Araghchi.#China supports #Iran in safeguarding its sovereignty, security, territorial integrity, and national dignity, and supports Iran in upholding its legitimate and lawful rights and interests.
China… pic.twitter.com/VMQC1LnpID
— Xu Feihong (@China_Amb_India) March 3, 2026
-
ఇరాన్‌కు అమెరికా విదేశాంగమంత్రి వార్నింగ్
ఇరాన్ పై మరోసారి అమెరికా విదేశాంగమంత్రి మార్కో రూబియో ఫైర్
ఇరాన్ ని అంత తేలిగ్గా వదలబోమన్న మార్కో
దాడికి ప్రతీ దాడి కచ్చితంగా ఉంటుందని మార్కో వార్నింగ్
-
గల్ఫ్‌దేశాల నుంచి స్వదేశం చేరుకున్న భారత పైలెట్లు, క్యాబిన్ క్రూ
దుబాయ్‌లో చిక్కుుకున్న ప్రయాణికులను తీసుకురావడానికి..
AI916D ప్రత్యేక విమానం నడిపిన ఎయర్ ఇండియా
149 మందిప్రయాణికులతో ఢిల్లీ చేరుకున్న విమానం
ప్రత్యేక విమానంలో ఇండియా చేరుకున్న143 మంది పైలట్లు, క్యాబిన్ సిబ్బంది
-
యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సహాయక చర్యలు
గల్ఫ్ దేశాల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతున్న వారిని సురక్షితంగా స్వదేశానికి చేర్చడానికి చర్యలు
అత్యవసర హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసి ఎంబసీలను సంప్రదించాలని సూచన
కువైట్ ఉన్న భారతీయులు +965-65501946 నెంబర్‌ను సంప్రదించాలని సూచన
ఒమన్‌లో ఉన్న భారతీయుల కోసం +968-98282270, 80071234 నెంబర్లు ఏర్పాటు00
సౌదీ అరేబియాలోని భారతీయుల కోసం 00-966-11-4884697, 00-966-542126748, 8002471234 టోల్-ఫ్రీ, వాట్సాప్ నెంబర్లు ఏర్పాటు
బహ్రెయిన్ భారతీయుల కోసం 00973-39418071 నెంబర్ ఏర్పాటు
దుబాయ్( యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) లోని భారతీయుల కోసం 800-46342 (టోల్-ఫ్రీ), +971543090571 నెంబర్లు ఏర్పాటు
-
ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్.. ప్రత్యేక మివానాల్లో ఇండియాకు భారతీయులు
దుబాయ్ నుంచి రెండు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం
దుబాయిలో చిక్కుకున్న మహారాష్ట్రీయుల ప్రత్యేక విమానాలు ఏర్పాటు
ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసిన మహారాష్ట్ర సీఎం, ప్రభుత్వం
UAEలోని పుజైరా విమానాశ్రయం నుంచి బయలుదేరనున్న స్టార్ ఎయిర్ విమానాలు
మధ్యాహ్నం 3:30, సాయంత్రం 4:30కి టేకాఫ్ కానున్న విమానాలు
164 మంది ప్రయాణికులతో ముంబై చేరుకోనున్న విమానాలు
ఈ రెండు విమానాలలో మొత్తం 164 మంది ప్రయాణికులు
సాయంత్రం 6.30 తర్వాత ముంబై చేరుకోనున్న విమానాలు
పుణేలోని ఇందిరా స్కూల్ ఆఫ్ బిజినెస్ స్టడీస్ నుంచి 84 మంది విద్యార్థులు.. దుబాయ్ వెళ్లి అక్కడ చిక్కుకుపోయారు.
-
బహ్రెయిన్‌లో చెలరేగిన అంతర్గత అల్లర్లు
యుద్ధం కారణంగా ఇరాన్ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ
ఇరాన్‌కు అనుకూల విధానంతో షియా వర్గం ప్రజలు
ఇరాన్ దాడులను వ్యతిరేకిస్తున్న సున్నీ పాలకులు
అమెరికా, ఇజ్రాయెల్ దాడులపై షియా వర్గం నిరసనలు
బహ్రెయిన్ భద్రతా బలగాలపై చేతికందిన వస్తువును విసిరేస్తున్న షియా వర్గం ప్రజలు
-
ఆరాంకోపై ఇరాన్ దాడితో ధ్వంసమైన రిఫైనరీ
సౌదీలోని రస్ తనూరాలో ఉన్న ఆరాంకో ఆయిల్ రిఫైనరీ
విధ్వంసానికి సంబంధించి శాటిలైట్ చిత్రాలు విడుదల
ఆయిల్ రిఫైనరీతోపాటు పలు ప్రాంతాలపై ఇరాన్ దాడులు
ఇరాన్ మిసైల్, డ్రోన్ల అటాక్స్‌తో పలు ప్రాంతాల్లో విధ్వంసం
-
ఇరాన్ యుద్ధంతో తగ్గుతున్న దేశీయ ముడిచమురు నిల్వలు
ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ ఇప్పుడు ఇతర దేశాలపై కూడా పడుతుంది. ఈ దేశాల మధ్య యుద్దంతో భారత్ సహా అనేక దేశాలకు పెట్రోల్, డీజిల్ సరఫరా ఆగిపోయింది. దీంతో దేశంలో ముడి చమురు నిల్వలు తగ్గిపోయాయి. ప్రస్తుతం దేశంలో 17-18 రోజులకు సరిపోయేలా మాత్రమే ముడిచమురు నిల్వలు ఉన్నాయి. 20-21 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉండగా 10-12 రోజులకు సరిపోయేలా లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ నిల్వలు ఉన్నాయి. హార్ముజ్ జలసంధిని దాటిన ముడిచమురు చేరుకుంటే.. మనదేశంలో మరో 2 వారాల నిల్వలు పెరిగే చాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇక ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సప్లై దెబ్బతింటే.. ప్రత్యామ్నాయ అవకాశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. దేశంలో ఆయిల్ నిల్వలు తగ్గిపోతే పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై నిషేధాన్ని విధించే అవకాశం కూడా ఉండొచ్చు. అయితే పెట్రోల్ నిల్వల్లో మూడింట ఒక వంతును భారత్ ఎగుమతి చేస్తుండగా, డీజిల్ నిల్వల్లో నాలుగింట ఒకవంతును ఎగుమతి చేస్తోంది. అలాంటి పరిస్థితుల్లో రష్యా నుంచి ఆయిల్ దిగుమతులను పెంచుకోవడంపైనా మోదీ సర్కార్ అయోమయంలో పడిపోయింది.
ఇప్పటికే అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ 10 శాతం పెరిగింది.. ప్రస్తుతం 80 డాలర్ల దగ్గర ట్రేడవుతోన్న బ్రెంట్ క్రూడ్. యుద్ధం ఇలాగే కొనసాగితే దాని ధర 100 డాలర్లకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌తో ఇప్పటికే యూరప్‌లోనూ ఇంధన ధరలు సుమారు 40 శాతం పెరిగాయి.
-
గల్ఫ్ నుంచి స్వదేశానికి చేరుకుంటున్న భారతీయులు
దుబాయ్, అబుదాబి, మస్కట్ నుంచి భారత్‌కు విమానాలు
దుబాయ్ నుంచి బెంగుళూరు చేరుకున్నవిమానం
మస్కట్, అబుదాబి నుంచి ఢిల్లీ చేరుకున్న 2 విమానాలు
రెండు రోజులు విమానాలు లేక ఇబ్బందులు పడ్డామన్న ప్రయాణికులు
UAE ప్రభుత్వ సహకారంతో క్షేమంగా ఇండియా చేరుకున్నమన్న ప్రయాణికులు
ప్రస్తుతం UAEలో సాధారణ పరిస్థితులు ఉన్నాయంటున్న ప్రయాణికులు
-
ఖమేనీ మృతిపై కేంద్రానికి సోనియా గాంధీ లేఖ
కేంద్రం మౌనంగా ఉండడంపై ప్రశ్నించిన సోనియా
మౌనంగా ఉండడం అంటే తటస్థంగా వ్యవహరించడం కాదు- సోనియా
మీ మౌనం త్యజించడం లాంటిదే – సోనియా
భారత్‌తో ఇరాన్‌కు వందల ఏళ్ల బంధం ఉంది – సోనియా
ఇరాన్‌తో నాగరికత, వ్యూహాత్మక సంబంధాలున్నాయి – సోనియా
ఇరాన్ భారత్‌కు అనేక సందర్భాల్లో సాయం చేసింది – సోనియా
ఇరాన్‌పై అమెరికా దాడిని ఖండించకుండా..
ఇరాన్, యూఏఈపై చేసిన దాడిని ప్రధాని ఖండించారు – సోనియా
-
సురక్షితంగా భారత్‌కు పీవీ సింధూ
దుబాయ్ నుంచి బెంగళూరుకు చేరుకున్న పీవీ సింధూ
తెల్లవారుజామున బెంగళూరు చేరుకున్న పీవీ సింధూ
యుద్ధం కారణంగా దుబాయ్‌లో చిక్కుకున్న సింధూ
-
ఇరాన్ వరుస దాడులతో దుబాయ్ సంపన్నుల్లో వణుకు
దుబాయ్ నుంచి పారిపోయేందుకు సంపన్నుల ప్రయత్నాలు
దుబాయ్ ఎయిర్‌పోర్టు మూతపడడంతో వేరే మార్గాల అన్వేషణ
సౌదీలోని రియాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లి అక్కడి నుంచి ప్రైవేట్ జెట్ల ద్వారా యూరప్ వెళ్లిపోతున్న సంపన్నులు
ఒక్కో ప్రైవేట్ జెట్‌కు రూ.3.5 కోట్లు వెచ్చిస్తున్న దుబాయ్ సంపన్నులు
దుబాయ్ నుంచి పది గంటలపాటు రియాద్‌కు రోడ్డు ద్వారా ప్రయాణం
రియాద్ నుంచి ప్రైవేట్ జెట్ల ద్వారా యూరప్‌కు పయనం
-
యూఏఈలో చిక్కుకొన్న భారతీయులను తరలించేందుకు స్పైస్‌జెట్ 4 ప్రత్యేక విమానాలు
ఫుజైరా నుంచి ఇండియాకు బయల్దేరనున్న విమానాలు
తాజా ప్రకటనలో వెల్లడించిన స్పైస్‌జెట్
ఫుజైరా నుంచి దిల్లీ, ముంబయి, కొచ్చికి చేరుకోనున్న విమానాలు
-
ఖమేని మృతితో బహ్రెయిన్‌లో షియాల తిరుగుబాటు
రక్షణ బలగాలు షియా తిరుగుబాటుదారుల మధ్య ఘర్షణ
రక్షణ బలగాలపై పెట్రోల్ బాంబులతో షియా వర్గం దాడులు
షియా తిరుగుబాటుదారులపై టియర్ గ్యాస్, వాటర్ క్యానన్ల ప్రయోగం
-
ఇరాన్‌పై యుద్ధాన్ని మరింత ఉధృతం చేస్తోన్న అమెరికా
ఇరాన్ ప్రతీకార దాడుల తర్వాత జోరు పెంచిన అగ్రరాజ్యం
పశ్చిమాసియాలో ఇప్పటిదాకా ఆరుగురు అమెరికా సైనికుల మృతి
నిన్న కువైట్, బహ్రెయిన్, రియాద్‌లోని అమెరిక ఎంబసీలపై ఇరాన్ దాడులు
ఇరాన్ దాడులకు దీటైన జవాబు ఇవ్వాలని అమెరికా నిర్ణయం
పశ్చిమాసియాకు అదనపు బలగాలని పంపడానికి అగ్రరాజ్యం రెడీ
యుద్ధం మరో 4-5 వారాలు సాగుతుందని ట్రంప్ క్లారిటీ
ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు లేకుండా చేయాలనేదే..
ఈ దాడుల లక్ష్యమన్న ట్రంప్ వివరణ
-
హర్మూజ్‌లోకి వచ్చే నౌకలకు తగబెడతామంటున్న ఇరాన్
చమురు రవాణాకు అత్యంతక కీలక మార్గంగా ఉన్న హర్మూజ్ జలసంధి
హర్మూజ్‌లోకి వస్తే నౌకలకు నిప్పు పెడతామని ఇరాన్ హెచ్చరికలు
హెచ్చరికలు జారీ చేసిన ఐఆర్‌జీసీ బ్రిగేడియర్ జనరల్ సర్దార్ ఇబ్రహీం జబారీ
-
ఇరాన్‌పై సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తోన్న అమెరికా సైన్యం
ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో ఇరాన్ మిసైల్ లాంచర్లు ధ్వంసం
ఇరాన్ మిసైల్స్‌ను గుర్తించి పకడ్బందీగా దాడులు
గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో కూడా అమెరికా భీకరదాడులు
రెండురోజుల క్రితంవరకు 11 యుద్ధనౌకలు ఉండేవనీ..
ఇప్పుడు ఆ ప్రాంతంలో ఎలాంటి నౌకలు లేవన్న అమెరికా సెంట్రల్ కమాండ్
-
PIJ కమాండర్ హతం
లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ దాడి
దాడిలో PIJ కమాండర్ అబూ హమ్జా మృతి
హమ్జాను మట్టుబెట్టినట్టు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటన
-
దుబాయ్‌లో అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడి
160 మంది అమెరికా సైనికులను టార్గెట్ చేశామన్న ఇరాన్
కేవలం అమెరికా స్థావరాలపైనే దాడులు చేస్తున్నట్టు ప్రకటన
-
ఇరాన్ యుద్ధ పరిణామాలతో బిక్కుబిక్కుమంటోన్న లెబనాన్ ప్రజలు
దక్షిణ లెబనాన్ నుంచి భయంతో వలసపోతున్న స్థానికులు
బీరుట్, సైడాన్, మౌంట్ లెబనాన్, ట్రిపోలి వంటి ప్రాంతాలకు ప్రయాణం
జనం ఒక్కసారిగా రావడంతో కిక్కిరిసిన రోడ్లు
వేలసంఖ్యలో వాహనాల్లో పరుగులు తీస్తున్న జనం
వాహనాలు లేక అవస్థలు పడుతోన్న చాలామంది దక్షిణ లెబనాన్ వాసులు
నిరాశ్రయుల కోసం ఇప్పటికే 171కిపైగా షెల్టర్లు ఏర్పాటుచేసిన ప్రభుత్వం
-
రియాద్లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ల దాడి
ఇరాన్ దాడిపై స్పందించిన అమెరికా ప్రసిడెంట్ డొనాల్డ్ ట్రంప్
ఇరాన్ కి గట్టిగా బుద్ధి చెబుతామని వార్నింగ్ ఇచ్చిన ట్రంప్
ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, తయారీ కేంద్రాలను నాశనం చేస్తామని హెచ్చరిక
ఇరాన్ నావికదళాన్ని ఇప్పటికే నాశనం చేశామన్న డొనాల్డ్ ట్రంప్
-
గల్ఫ్ దేశాలపై కొనసాగుతున్న ఇరాన్ దాడులు
ఇరాక్‌లోని ఎర్బిల్‌లో యూఎస్ స్థావరాలపై దాడులు
ఎర్బిల్‌లోని యూఎస్ ఎయిర్‌బేస్‌పై డ్రోన్ దాడి
ఖాన్జాద్ హోటల్‌పై ఇరాన్ డ్రోన్ అటాక్
అమెరికన్ సైనికులు ఉన్నారన్న సమాచారంతో దాడి
-
ఇరాన్ పార్లమెంట్ భవనంపై దాడి
టెహ్రాన్‌లోని ఇరాన్ పార్లమెంట్ భవనంపై దాడి
పార్లమెంట్ భవనం నుంచి ఎగసిపడుతున్న మంటలు
-
గల్ఫ్ దేశాలపై కొనసాగుతున్న ఇరాన్ దాడులు
సౌదీ అరేబియాలోని రియాద్‌లో US ఎంబసీపై ఇరాన్ దాడి
రెండు సాయుధ డ్రోన్లతో దాడి చేసిన ఇరాన్
రియాద్‌లోని అమెరికా ఎంబసీ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు
హై అలర్ట్ ప్రకటించిన భద్రతా బలగాలు
-
గల్ఫ్ నుంచి తిరిగొస్తున్న భారతీయులు
అబుదాబి నుంచి ఢిల్లీ, బెంగళూరు చేరుకున్న విమానాలు
దుబాయ్ నుంచి భారత్‌కు మరో విమానం
జెడ్డా నుంచి భారత్‌కు మరిన్ని ప్రత్యేక విమానాలు
10 విమానాలు నడపనున్నట్టు ఇండిగో ప్రకటన
-
ఇరాన్ దాడులపై కువైట్ రక్షణ మంత్రి ప్రకటన
తమ దేశంపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తోందన్న కువైట్
ఇరాన్ ఇప్పటి వరకు 384 డ్రోన్ దాడులు చేసింది -కువైట్ రక్షణ మంత్రి
178 బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ దాడి – కువైట్ రక్షణ మంత్రి
-
ఇరాన్‌పై డ్రోన్లతో అమెరికా దాడి
ఇరాన్ మిసైల్ లాంచర్‌ని ధ్వంస చేసిన అమెరికా
ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా అమెరికా డ్రోన్ దాడి
డ్రోన్ దాడితో మిసైల్ లాంచర్‌లో చెలరేగిన మంటలు
-
ఖమేనీ మృతి.. ఇజ్రాయెల్‌కు వ్యక్తిరేకంగి HYDలో ఆందోళనలు
హైదరాబాద్ పాతబస్తీలో కొనసాగుతున్న ఆందోళనలు
ఇజ్రాయెల్, అమెరికాకు వ్యతిరేకంగా నిరసనలు
ఖమేనీ ఫొటోలతో పెద్దఎత్తున రోడ్లపైకి ముస్లింలు
-
ఇరాన్-ఇజ్రాయెల్ వార్.. ఇబ్బందుల్లో యాత్రికులు
హైదరాబాద్ నుంచి ఇరాన్, ఇరాక్, ఉమ్రా యాత్రలకు వెళ్లి తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతున్న జనం
సౌదీలో ఓవర్ స్టే చేయడంతో హోటల్ నుంచి ఖాళీ చేయించిన యాజమాన్యం
జెడ్డా ఎయిర్‌పోర్టులో పడిగాపులు కాస్తున్న యాత్రికులు
తమను తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తులు
-
పెట్రోల్ బంకులకు క్యూ
- ఇరాన్‌పై యుద్ధంతో పెట్రోల్ షార్టేజ్ వస్తుందని భయాందోళనలు
- ఓల్డ్ సిటీలో ఇప్పటికే కొన్ని బంకులకు జనం క్యూ
- అర్థరాత్రి పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు
- ఫుల్ ట్యాంక్‌లు చేయించుకోవడంతో పాటు..
- ప్లాస్టిక్ క్యాన్లలో పెట్రోల్, డీజిల్ నింపుకుని వెళ్తున్న జనం
-
ఇజ్రాయెల్‌పై ఇరాన్ భీకర దాడులు
- ఇజ్రాయెల్‌పై ఇరాన్ భీకర క్షిపణి దాడులు
- మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి
- క్లస్టర్ బాంబ్‌వార్ హెడ్లను వినియోగించిన ఇరాన్
-
ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ పై మరోసారి పెద్ద దాడి జరుగబోతోందని అన్నారు. ఇప్పటి వరకు తాము దాడుదల ఉధృతం చేయలేదని, మున్ముందు భారీ దాడులు చేయబోతున్నామని అన్నారు. ఇరానియన్లు ఇంటి లోపలే ఉండాలని, బయటకు రాకూడదని సూచించారు.
-
ఫ్రెంచ్ అధ్యక్షుడు కీలక ప్రకటన
ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. ప్రపంచ అనిశ్చితి దృష్ట్యా, మేము అణ్వాయుధాల సంఖ్యను పెంచుతామని ఆయన అన్నారు.
-
రెండు ఇరానియన్ యుద్ధ విమానాలను కూల్చివేసిన ఖతార్
ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం, ఖతార్ రెండు ఇరానియన్ యుద్ధ విమానాలను కూల్చివేసింది.
-
ఖమేనీ కుమార్తె, అల్లుడు కూడా మృతి
ఖమేనీ కుమార్తె, అల్లుడు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఖమేనీ కాంపౌండ్ పై 30 క్షిపణులతో దాడి జరిగింది. అతని కోడలు, కోడలు, మనవరాలు సహా 40 మంది కమాండర్లు మరణించారు. ఖమేనీ భార్య మన్సౌరా ఖోజాస్తే, మషద్‌లోని ప్రముఖ వ్యాపారవేత్త మొహమ్మద్ ఎస్మాయిల్ ఖోజాస్తే బఘెర్జాదే కుమార్తె. ఆమె సోదరుడు హసన్, ఇరాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే టీవీ, రేడియో నెట్‌వర్క్, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్‌కాస్టింగ్ (IRIB)కి మాజీ డిప్యూటీ డైరెక్టర్.
-
40 రోజుల జాతీయ సంతాప దినాలు
ఖమేనీ కుటుంబంలోని ఇతర సభ్యుల మరణాలను అమెరికా, ఇజ్రాయెల్ విడివిడిగా ధృవీకరించలేదు. అయితే ఇరాన్ రాష్ట్ర మీడియా ఈ దాడుల్లో అతని కుటుంబంలోని అనేక మంది సభ్యులు మరణించారని నిరంతరం నివేదించింది. ఖమేనీ మరణం తరువాత ఇరాన్ 40 రోజుల జాతీయ సంతాప దినాలు ప్రకటించింది. 1989 నుండి ఖమేనీ ఇరాన్ అత్యంత ప్రముఖ రాజకీయ, మత నాయకుడు.
-
ఖమేనీ భార్య మృతి
ఇరాన్ మాజీ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ భార్య మన్సౌరే ఖోజాస్తే బగెర్జాదే మరణించారు. ఇరాన్ రాష్ట్ర మీడియా ప్రకారం, ఆమె రెండు రోజుల క్రితం అమెరికా- ఇజ్రాయెల్ దాడులలో గాయపడ్డారు. ఆమె చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ దాడులలో ఖమేనీ,అతని కుటుంబంలోని అనేక మంది సభ్యులు కూడా మరణించారు. మన్సౌరే 1964లో ఖమేనీని వివాహం చేసుకున్నారు. ఆమె ఎల్లప్పుడూ ప్రజా జీవితానికి దూరంగా ఉండేది. ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలలో అరుదుగా కనిపించేది.

-
300 మందికి పైగా మృతి
ఇజ్రాయెల్ – అమెరికా ఇరాన్ అణు స్థావరంపై దాడి నేపథ్యంలో ఇప్పటివరకు 300 మందికి పైగా మరణించారని ఇరాన్ పేర్కొంది. ఇరాన్ కూడా ప్రతీకారం తీర్చుకుంటోంది. ఈలోగా, ఇరాన్ అణు కేంద్రంపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంతలో దాడికి ఎటువంటి ఆధారాలు లేనప్పటికీ, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ రేడియోధార్మిక రేడియేషన్ భయాన్ని తోసిపుచ్చడం లేదు.
-
ఇరాన్‌లో రేడియేషన్ ముప్పు
ఇజ్రాయెల్ – అమెరికా ఇరాన్ అణు స్థావరంపై దాడి చేసినట్లు ఇరాన్ పేర్కొంది. దీని కారణంగా రేడియోధార్మిక రేడియేషన్ భయం ఉంది. అయితే, ఇప్పటివరకు ఏ అణు స్థావరం ధ్వంసమైనట్లు లేదా దెబ్బతిన్నట్లు ఎటువంటి ఆధారాలు గుర్తించలేదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ పేర్కొంది. ఇజ్రాయెల్-అమెరికా ఇరాన్‌పై ఉమ్మడి ప్రతీకార చర్యను కొనసాగించాయి.
-
నెతన్యాహు కార్యాలయంపై దాడి చేసింది తామే -ఇరాన్
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయంపై దాడి చేసింది తామేనని ఇరాన్ ప్రకటించింది.
-
ఇరాన్ దాడులతో ఖతార్ కీలక నిర్ణయం
ఇరాన్ దాడులతో ఖాతార్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ ఉత్పత్తిని నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ దేశాలకు ఖతార్ నుంచి 20 శాతం గ్యాస్ సరఫరా అవుతోంది.
-
యూఏఈ నుంచి విమానాల రాకపోకలు
యూఏఈ నుంచి విమానాల రాకపోకలు మొదలయ్యాయి. అబుదాబి నుంచి విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. మధ్యాహ్నం నుంచి 6 విమానాలు టేకాఫ్ అయ్యాయి. ఢిల్లీ, ఇస్లామాబాద్, ముంబై, కరాచీ, మాస్కో, పారిస్, అమ్‌స్టర్‌డామ్, లండన్ నగరాలకు విమానాల రాకపోకలు కొనసాగుతున్నాయి.
-
అమెరికా కీలక ప్రకటన
యుద్ధం సందర్భంగా అమెరికా కీలక ప్రకటన చేసింది. తాము యుద్ధం ప్రారంభించలేదని, మేమే ముగింపు పలుకుతామని తెలిపింది. తాము ఎన్ని సార్లు హెచ్చరించినా ఇరాన్ అణ్వాయుధాల తయారీ కొనసాగించిందనితెలిపింది. అమెరికా, ఇజ్రాయెల్‌కు చావే అని ఖమేనీ అన్నారని గుర్తు చేసింది. కానీ యుద్ధంలో ఖమేనీ చనిపోయారు. యుద్ధంలో ఇరు పక్షాలకు నష్టం జరుగుతోందని అమెరికా పేర్కొంది.
-
గల్ఫ్ దేశాల నేతలతో మోదీ మంతనాలు
గల్ప్ దేశాల నేతలతో ప్రధాని మోదీ మంతనాలు కొనసాగిస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో భారతీయుల భద్రతపై చర్చిస్తున్నారు. దేశాధినేతలతో మోదీ ఫోన్‌లో మాట్లాడారు.
-
అమెజాన్ డేటా సెంటర్‌పై దాడి
ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) డేటా సెంటర్లు తీవ్రమైన కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కొంటున్నట్లుగా ఆ సంస్థ ప్రకటించింది. ఇప్పటికే యూఏఈలోని అమెజాన్ వెబ్ సర్వీస్ జోన్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. డేటా సెంటర్లపై మిస్సైల్స్ పడి మంటలు చెలరేగి భారీగా నష్టం వాటిల్లిందని అమెజాన్ తెలిపింది.
-
కువైట్‌లో అమెరికా దౌత్య కార్యాలయం మూసివేత
కువైట్‌లో అమెరికా దౌత్య కార్యాలయం మూసివేశారు. ఉదయం ఇరాన్ ఎంబసీని మిస్సైళ్లతో టార్గెట్ చేసింది.
-
ఇరాన్‌లోని ఆయిల్ పైప్‌లైన్‌పై ఎయిర్ స్ట్రయిక్స్
ఇరాన్‌లోని ఆయిల్ పైప్‌లైన్‌పై ఎయిర్ స్ట్రయిక్స్ జరిగింది. ఆహ్వజ్ చమురు పైప్‌లైన్‌పై అమెరికా దాడి చేసింది. దాడిలో చమురు పైప్‌లైన్ ధ్వంసమైంది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. పైప్‌లైన్ నుంచి రోజుకు 8 లక్షల బ్యారెళ్ల చమురు వెళ్తుంది. ఆహ్వాజ్ పైప్‌లైన్‌కు ఇరాన్ చమురు సరఫరాలో 20 శాతం వాటా ఉంది.
-
అరేబియా నుండి కువైట్ వరకు విధ్వంసం
యుద్ధం రెండవ రోజున ఇరాన్ సౌదీ అరేబియా నుండి కువైట్ వరకు విధ్వంసం సృష్టించింది. మొదట, ఇరాన్ కువైట్ స్థావరం నుండి ఎగురుతున్న అనేక US F-15 జెట్‌లను ధ్వంసం చేసింది. జెట్‌లలో ఒకదాని వీడియో కూడా వేగంగా వైరల్ అవుతోంది. దీని తరువాత, టెహ్రాన్ సౌదీ చమురు సంస్థాపనలపై దాడి చేసింది. ఈ దాడిలో, ఇరాన్ అరాంకో కంపెనీ పనిచేసే సౌదీ యొక్క తనూరా శుద్ధి కర్మాగారాన్ని లక్ష్యంగా చేసుకుంది.
-
అణు కేంద్రంపై దాడులు
ఇరాన్ నట్టాన్జ్ న్యూక్లియర్ సైట్‌పై దాడులు కొనసాగుతున్నాయి. దాడులు జరిగినట్లు IAEAకి తెలిపింది ఇరాన్ అంబాసిర్. అయితే రేడియేషన్ లీకేజీని IAEA తోసిపుచ్చలేమంటోంది.
-
కువైట్ నగరం దాడి
కువైట్ నగరంలో అమెరికా రాయబార కార్యాలయంపై దాడి జరిగిన తర్వాత లోపల నుండి మంటలు, పొగలు ఎగసిపడుతున్నాయి. కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ దేశంలో అనేక అమెరికన్ యుద్ధ విమానాలు కూలిపోయాయని, పైలట్లు స్థిరంగా ఆసుపత్రిలో చేరారని తెలిపింది. దీనిపై అమెరికా సైన్యం వెంటనే స్పందించలేదు. రాయబార కార్యాలయం వద్ద ప్రాణనష్టం జరిగినట్లు తక్షణ నివేదికలు లేవు.
-
555 మంది మృతి
ప్రస్తుతం ఇరాన్- ఇజ్రాయెల్-యుఎస్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఇరాన్ అనేక గల్ఫ్ దేశాలపై కూడా దాడి చేసింది. ఈ యుద్ధంలో మరణించిన వ్యక్తుల గణాంకాలను ఇరాన్ అందించింది. ఇరాన్‌లో అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 555 మంది మరణించారని ఇరాన్ చెబుతోంది. ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడి ప్రచారంలో ఇస్లామిక్ రిపబ్లిక్‌లో ఇప్పటివరకు కనీసం 555 మంది మరణించారని ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ సోమవారం తెలిపింది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు 131 నగరాలపై దాడి జరిగిందని సొసైటీ తెలిపింది.
-
కువైట్ రక్షణ శాఖ కీలక ప్రకటన
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో కువైట్ రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది. అమెరికా యుద్ధ విమానాలు చాలా కూలిపోయాయని తెలిపింది. అయితే ఆ విమానాలను తామే కూల్చివేశామని ఇరాన్ వెల్లడించింది. యుద్ధ విమానాల నష్టంపై అమెరికా మౌనం పాటిస్తోంది.
-
యూరప్‌లో భారీగా పెరిగిన చమురు ధరలు
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం మధ్యప్రాచ్యాన్ని అతలాకుతలం చేస్తోంది. యూరప్‌లో చమురు ధరలు భారీగా పెరిగాయి. ఒక్క రోజులోనే 22 శాతం పెరిగాయి.
-
హాలిడే ట్రిప్ కోసం వెళ్లి చిక్కుకుపోయిన హైదరాబాద్ వాసులు..
హాలిడే ట్రిప్ కోసం వెళ్లి దుబాయ్‌లో చిక్కుకున్నారు కొందరు హైదరాబాద్ వాసులు. ఇరాన్-అమెరికా యుద్ధంతో ఎటు నుంచి మిస్సైల్స్ వచ్చి పడతాయోనన్న భయాందోళనకు గురవుతున్నారు. అయితే వారి కుటుంబ సభ్యులు మాత్రం ఎంబసీలను సంప్రదిస్తున్నారు. తమవాళ్ల బాగోగుల గురించి ఆందోళన చెందుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ ఎలేందర్ అందిస్తారు.
-
శ్రీనగర్‌లో ఇరాన్‌కు మద్దతుగా ఆందోళనలు
- జమ్ముకశ్మీర్ శ్రీనగర్‌లో ఉద్రిక్తత
- ఇరాన్‌కు మద్దతుగా రోడ్లపైకి ఆందోళనకారులు
- ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగం
- నిరసనకారులపై పోలీసుల లాఠీఛార్జ్
- కశ్మీర్‌లో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం
- కశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు
- పాఠశాలల మూసివేతతో పాటు పరీక్షల వాయిదా
-
తెలంగాణ పౌరుల కోసం ఢిల్లీలో కంట్రోల్ రూమ్
- గల్ఫ్‌లో ఉన్న తెలంగాణ పౌరుల కోసం ఢిల్లీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
- తెలంగాణ భవన్‌లో 24×7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
- సీఎం రేవంత్ ఆదేశాలతో చర్యలు చేపట్టిన తెలంగాణ అధికారులు
- భారత విదేశాంగశాఖ, రాయబార కార్యాలయాలతో నిరంతరం సంప్రదింపులు
- అత్యవసర సాయం కోసం సంప్రదించవచ్చన్న తెలంగాణ భవన్ అధికారులు
- గల్ఫ్‌లోని తెలంగాణ పౌరులను సురక్షితంగా భారత్‌కి తీసుకొచ్చేందుకు చర్యలు
- తెలంగాణ హెల్ప్‌లైన్స్: +91 9871999044, +91 9958322143
- తెలంగాణ హెల్ప్‌లైన్స్: +91 9910014749, +91 9643723157
-
కువైట్‌లో కుప్పకూలిన అమెరికా యుద్ధ విమానాలు
- కువైట్‌లో కుప్పకూలిన అమెరికా యుద్ధ విమానాలు
- ఇవాళ ఉదయం యుద్ద విమానాలు కుప్పకూలినట్టు కువైట్ ప్రకటన
- గాయాలతో బయటపడ్డ పైలట్లు
- యుద్ధ విమానాల నష్టంపై యూఎస్ మౌనం..
- తామే కూల్చేశామని ప్రకటించిన ఇరాన్..
-
మోదీ కీలక వ్యాఖ్యలు
- పశ్చిమాసియా యుద్ధంపై మోదీ కీలక వ్యాఖ్యలు
- పరిస్థితి చాలా ఆందోళనకరం గా ఉంది
- శాంతి స్థాపన ,చర్చల తోనే ఈ సమస్యకు పరిష్కారం – మోదీ
- భారత్ శాంతి కోసం కృషి చేస్తుంది
- గల్ఫ్‌లో చిక్కుకున్న భారతీయులను రక్షించడానికి అన్ని చర్యలు – మోదీ
-
అతిపెద్ద ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ దాడి
- పశ్చిమాసియా దేశాలపై దాడులను ఉధృతం చేసిన ఇరాన్
- సౌదీ అరేబియాలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ ఆరామ్‌కోపై డ్రోన్లతో దాడులు
- ఆరామ్‌కో రిఫైనరీలో భారీ విధ్వంసం
- రోజుకు 5.5 లక్షల బ్యారెళ్ల చమురును శుద్ధిచేస్తోన్న ఆరామ్‌కో
-
ఇరాన్‌పై అమెరికా భీకరదాడులు
- ఇరాన్‌పై భీకరదాడులు చేస్తోన్న అమెరికా
- 2 రోజుల్లోనే వెయ్యి లక్ష్యాలపై దాడులు చేశామన్న US సెంట్రల్ కమాండ్
- ఇరాన్‌కు చెందిన నౌకలు, జలాంతర్గాములు, మిసైల్ లాంచ్ ప్యాడ్స్..
- కమ్యూనికేషన్ వ్యవస్థలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు ధ్వంసమైనట్లు ప్రకటన
- ఇరాన్ విరుచుకుపడకుండా ముప్పేటదాడులు చేస్తున్న అగ్రరాజ్యం
- ఇరాన్‌లోని ఎయిర్‌క్రాఫ్ట్ సెంటర్లు, స్టోరేజ్ బంకర్లు ధ్వంసం
- అమెరికా దాడుల్లో ఇరాన్‌లో 201 మంది మృతి, 750 మందికి గాయాలు
-
కుప్పకూలిన అమెరికా ఫైటర్ జెట్
- కువైట్‌లో కుప్పకూలిన అమెరికా ఫైటర్ జెట్
- కుప్పకూలిన F-15 ఫైటర్ జెట్
- ఫైటర్ జెట్ కూలడంపై క్లారిటీ ఇవ్వని అమెరికా
- ఫైటర్‌జెట్ క్రాష్‌లో పైలట్ క్షేమం
- పారాచూట్ ద్వారా దూకేసిన ఫైటర్ జెట్ పైలట్
- ఎయిర్‌ఫోర్స్ ఎక్సర్‌సైజ్‌లు చేస్తున్న సమయంలో కూలిన విమానం
-
ఒకేసారి ఏడు దేశాలపై దాడులు
- ఒకేసారి ఏడు దేశాలపై దాడులు ప్రారంభించిన ఇరాన్
- ఖతార్, కువైట్, యూఏఈ, బహ్రెయిన్‌లో ఇరాన్ దాడులు
- దుబాయ్, అబుదాబిలోని అమెరికా సైనిక స్థావరాలే టార్గెట్
- దక్షిణ ఇజ్రాయెల్‌లో తీవ్రమైన ఇరాన్ దాడులు
- ఇరాన్ దాడులతో అప్రమత్తమైన ఏడు దేశాలు
-
దాడులను ఖండించిన చైనా
- ఇరాన్‌పై జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ దాడులను ఖండించిన చైనా
- ఆర్థికపరమైన చర్యలకు దూరంగా చైనా
- ఇరాన్ నుంచి 80శాతానికి పైగా చమురును దిగుమతి చేసుకుంటున్న చైనా
-
భారత్‌లోని అమెరికన్ పౌరులకు అలర్ట్
- భారత్‌లోని అమెరికన్ పౌరులకు US ఎంబసీ సూచనలు
- ప్రపంచవ్యాప్త పరిణామాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
- స్థానిక సమాచారం ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని ఆదేశం
- స్మార్ట్ ట్రావెలర్ ఎన్‌రోల్‌మెంట్ ప్రోగ్రామ్‌లో..
- తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచన
- సైనిక బలగాల సమీపంలో ఉన్నప్పుడు అదనపు జాగ్రత్త వహించాలి
-
దుబాయ్‌పై ఇరాన్ భీకర దాడులు
- దుబాయ్‌పై మిసైల్స్‌తో ఇరాన్ భీకర దాడులు
- కువైట్‌లో డ్రోన్లతో విరుచుకుపడుతున్న ఇరాన్
- గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే టార్గెట్‌గా దాడులు
- ఇరాన్ దాడుల్లో ముగ్గురు అమెరికా సైనికులు మృతి
- ఇరాన్ దాడులను ఖండించిన గల్ఫ్ దేశాలు
- ఇరాన్ ప్రమాదకర స్థాయిలో ఉద్రిక్తలను పెంచుతోందని ఆందోళన
- చాలా దేశాల సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించినట్లు ఆరోపణ
- తాము ఎప్పటికీ తల వంచమంటున్న ఇరాన్
-
దుబాయ్‌లో చిక్కుకున్న మంత్రి తుమ్మల
- దుబాయ్‌లో చిక్కుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- 5 రోజుల కిందట దుబాయ్‌కు వెళ్లిన మంత్రి తుమ్మల
- తమ కుటుంబసభ్యుల్లో ఒకరికి చికిత్స కోసం వెళ్లిన మంత్రి
- దుబాయ్ ఎయిర్‌పోర్టుపై దాడులు జరిగడంతో అక్కడ విమానాలు రద్దు
- ఎయిర్‌పోర్ట్ క్లియరెన్స్ ఇచ్చేంతవరకు భారత్‌కు తిరిగి రాలేని పరిస్థితి
-
ఇరాన్ అనుకూల ర్యాలీలపై కేంద్రం అలర్ట్
- ఇరాన్ అనుకూల ర్యాలీలపై కేంద్రం అలర్ట్
- మనదేశంలో ర్యాలీల సందర్భంగా హింస చెలరేగొచ్చని హెచ్చరిక
- ఇరాన్ అనుకూల ర్యాలీపై అప్రమతంగా ఉండాలని..
- రాష్ట్రాలకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ లేఖలు
- ఫిబ్రవరి 28 తేదీతో రాష్ట్రాలకు చేరిన కేంద్రం లేఖలు
- ఇరాన్ అనుకూల ప్రసంగాలతో రెచ్చగొట్టేవారిని గుర్తించాలంటూ..
- రాష్ట్రాలకు రాసిన లేఖలో ఆదేశించిన కేంద్ర ప్రభుత్వం
-
ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలకవ్యాఖ్యలు
- తమ దాడులు 4 వారాలపాటు సాగవచ్చన్న ట్రంప్
- పెద్ద దేశమైన ఇరాన్‌ను అదుపులోకి తీసుకోవడానికి..
- కొంత సమయం పడుతుందన్న అమెరికా అధ్యక్షుడు
- అమెరికా సైనికులను వేలసంఖ్యలో పంపాల్సిన అవసరం లేదు- ట్రంప్
- ఇరాన్ ఐఆర్‌జీసీ, మిలిటరీ దళాలకు ట్రంప్ ఆఫర్
- ఆయుధాలు వదిలేసిన వారికి రక్షణ కల్పిస్తాం- ట్రంప్
-
వేలాది విమానాలు రద్దు
- మిడిల్ ఈస్ట్ వార్‌తో వేలాది విమానాలు రద్దు
- దుబాయ్, దోహా, అబుదాబి ఎయిర్‌పోర్టుపై ఇరాన్ దాడులు
- ఎయిర్‌స్పేస్‌ను పూర్తిగా మూసేసిన పలు గల్ఫ్ దేశాలు
- చరిత్రలో తొలిసారి దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత
- రెండు రోజులుగా మిడిల్‌ఈస్ట్‌లో 3200 విమానాలు రద్దు
- భారత్ నుంచి 750 విమానాలు రద్దు
- ఈరోజు కూడా పలు విమానాలు రద్దు అయ్యే అవకాశం
-
క్రూడ్ ఆయిల్ కుతకుత.. బంగారం భగభగ
- ముడిచమురు సరఫరాకు బ్రేకులు పడొచ్చని భయాలు
- ఇప్పటికే 80 డాలర్లకు చేరువలో బ్యారెల్ ముడిచమురు ధర
- హర్ముజ్ జలసంధిని మూసేయడంతో అంతర్జాతీయంగా కలవరం
- 2025లో మూడొంతుల చమురు సరఫరా జరిగిన ప్రాంతం ఈ జలసంధి
- అంర్జాతీయంగా భారీగా పెరుగుతున్న గోల్డ్ ధరలు
- నెలరోజుల గరిష్ఠస్థాయికి చేరుకున్న బంగారం
- 5340 డాలర్లకుపైనే ట్రేడవుతున్న ఔన్స్ బంగారం
- ఇప్పటికే నష్టాల్లో మొదలైన ఆసియా మార్కెట్లు
-
ఇరాన్ ప్రతిదాడులు
- అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ ప్రతిదాడులు
- పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడి
- UAEలోని అమెజాన్ డేటా సెంటర్‌పై ఇరాన్ దాడులు
- ఇరాన్ మిసైల్ దాడిలో దెబ్బతిన్న UAE అమెజాన్ సెంటర్
-
ఇజ్రాయెల్‌పై మూడు వైపుల నుంచి దాడులు
- ఇజ్రాయెల్‌పై మూడు వైపుల నుంచి దాడులు
- ఇరాన్ మిసైళ్లు, హెజ్బొల్లా, హుతీల రాకెట్ దాడులు
- మూడు దాడులను ఏక కాలంలో ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్
- లెబనాన్ నుంచి ఇజ్రాయెల్‌పై దాడులు చేసిన హెజ్బొల్లా
- కౌంటర్ స్ట్రైక్స్ చేస్తున్న ఇజ్రాయెల్
- దక్షిణ బీరూట్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు
- రాత్రి నుంచి వరుస దాడులు చేస్తున్న ఇజ్రాయెల్
-
అమెరికా, ఇజ్రాయెల్‌కు బ్రిటన్ సాయం
- అమెరికా, ఇజ్రాయెల్‌కు బ్రిటన్ సాయం
- అవసరమైతే తమ బేస్‌లు వాడుకొవచ్చన్న బ్రిటన్ ప్రధాని
- ఇప్పటికే ఇరాన్‌పై దాడుల్లో పాల్గొంటున్న బ్రిటన్ ఎయిర్‌ఫోర్స్
- మరోవైపు అమెరికాకు సాయం చేస్తున్నందుకు..
- సిప్రస్‌లోని యూకే బేస్‌లపైకి మిసైళ్లను సంధించిన ఇరాన్
- తమ ఎయిర్‌డిఫెన్స్ వాటిని అడ్డుకుందని ప్రకటించిన యూకే
- మిడిల్ ఈస్ట్‌లోని తమ ఆర్మీ బేస్‌లను యాక్టివేట్ చేసిన యూకే
-
ముగ్గురు యూఎస్ సైనికులు మృతి
- మిడిల్ ఈస్ట్‌లో తీవ్రంగా నడుస్తున్న యుద్ధం
- ఇరాన్ దాడిలో ముగ్గురు సైనికులను కోల్పోయామన్న అమెరికా
- ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు ప్రకటించిన USA
- ఎక్కడ మరణించారో వెల్లడించని అమెరికా ప్రభుత్వం
- ఇప్పటికే అమెరికా యుద్ధనౌకలు, ఆర్మీ బేస్‌లపై ఇరాన్ మిసైల్ దాడులు
- సైనికుల మృతికి ప్రతీకారం తప్పదన్న ట్రంప్
- అమెరికా దాడుల్లో ఇరాన్‌లో 201 మంది మృతి, 750 మందికి గాయాలు
- ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో పదిమంది మృతి, 120 మందికి గాయాలు
- UAEలో ముగ్గురు మృతి, 58మందికి గాయాలు
Published On - Mar 02,2026 7:54 AM




