AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రష్యాపై అమెరికా ఎకనామిక్ స్ట్రైక్.. భారత్ సహా పలు దేశాలపై ప్రభావం చూపే బిల్లు!

రష్యాపై మరింత ఆర్థిక ఒత్తిడి తీసుకురావాలనే లక్ష్యంతో రూపొందించిన కీలక ఆంక్షల బిల్లుపై అమెరికా సెనేట్ విధానపరమైన ఓటింగ్ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ వాషింగ్టన్‌లో పర్యటిస్తున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌కు బలమైన మద్దతుదారుగా పేరొందిన దివంగత సెనేటర్ లిండ్సే గ్రాహంకు నివాళిగా ఈ బిల్లును ముందుకు తీసుకువస్తున్నట్లు జెలెన్‌స్కీ పేర్కొన్నారు.

రష్యాపై అమెరికా ఎకనామిక్ స్ట్రైక్.. భారత్ సహా పలు దేశాలపై ప్రభావం చూపే బిల్లు!
Pm Modi Putin Trump
Balaraju Goud
|

Updated on: Jul 29, 2026 | 8:14 AM

Share

రష్యాపై మరింత ఆర్థిక ఒత్తిడి తీసుకురావాలనే లక్ష్యంతో రూపొందించిన కీలక ఆంక్షల బిల్లుపై అమెరికా సెనేట్ విధానపరమైన ఓటింగ్ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ వాషింగ్టన్‌లో పర్యటిస్తున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌కు బలమైన మద్దతుదారుగా పేరొందిన దివంగత సెనేటర్ లిండ్సే గ్రాహంకు నివాళిగా ఈ బిల్లును ముందుకు తీసుకువస్తున్నట్లు జెలెన్‌స్కీ పేర్కొన్నారు.

‘లిండ్సే ఓ. గ్రాహం రష్యా, ఇరాన్‌పై ఆంక్షల చట్టం–2026’గా పిలుస్తున్న ఈ బిల్లు, రష్యా చమురు, సహజవాయువు ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయాన్ని తగ్గించడమే లక్ష్యంగా రూపొందించారు. రష్యా ఇంధనాన్ని పెద్ద ఎత్తున దిగుమతి చేసుకునే దేశాలపై కఠిన చర్యలు తీసుకునే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడికి ఈ చట్టం కల్పిస్తుంది. రష్యా ముడి చమురు లేదా గ్యాస్‌ను అత్యధికంగా కొనుగోలు చేసే ఐదు దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 100 శాతం వరకు సుంకాలు విధించే అవకాశం ఈ బిల్లులో ఉంది.

ఈ బిల్లు చట్టంగా మారితే భారత్, చైనా, జపాన్‌తో పాటు యూరోపియన్ యూనియన్‌లోని కొన్ని దేశాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా రష్యా చమురును అధికంగా దిగుమతి చేసుకుంటున్న దేశాలపై అదనపు సుంకాల భారం పడే అవకాశముంది. అయితే ఆ సుంకాలను అమలు చేయాలా లేదా అనే విషయంలో తుది నిర్ణయాధికారం అమెరికా అధ్యక్షుడికే ఉంటుంది.

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ బిల్లులో ఇరాన్‌పై అదనపు ఆంక్షలకు సంబంధించిన నిబంధనలను చేర్చిన తర్వాత దీనికి మద్దతు ప్రకటించారు. మరోవైపు, డెమోక్రాటిక్ పార్టీకి చెందిన కొందరు సభ్యులు మాత్రం ఈ బిల్లుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అధ్యక్షుడికి విస్తృత సుంకాల అధికారాన్ని ఇవ్వడం వల్ల అమెరికా మిత్రదేశాలతో వాణిజ్య సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

అయితే రిపబ్లికన్, డెమోక్రటిక్ సభ్యుల ద్వైపాక్షిక బృందం ఈ బిల్లుకు మద్దతు ప్రకటించింది. రష్యా చమురు, గ్యాస్ ఆదాయం ద్వారా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుద్ధాన్ని కొనసాగించే అవకాశాలను అడ్డుకోవడంతో పాటు, ఇరాన్‌కు ఇంధనం, ఆయుధాల కోసం నిధులు సమకూరకుండా నిరోధించడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశమని వారు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అమెరికా సెనేట్‌లో జరిగే ఓటింగ్ అంతర్జాతీయ రాజకీయాలు, ఇంధన మార్కెట్లు, భారత్ వంటి దేశాల వాణిజ్య ప్రయోజనాలపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us