Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAN Card Safety Tips: పాన్‌ కార్డు విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారా..? మోసానికి గురైనట్లే..!

PAN Card Safety Tips: శాశ్వత ఖాతా సంఖ్య అంటే పాన్ కార్డ్. బ్యాంకు లావాదేవీలకు సంబంధించి పాన్‌ కార్డు తప్పనిసరి కావాల్సిందే. బ్యాంకు ఖాతా తెరవడం నుంచి లావాదేవీలు ..

PAN Card Safety Tips: పాన్‌ కార్డు విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారా..? మోసానికి గురైనట్లే..!
Follow us
Subhash Goud

|

Updated on: May 12, 2022 | 3:02 PM

PAN Card Safety Tips: శాశ్వత ఖాతా సంఖ్య అంటే పాన్ కార్డ్. బ్యాంకు లావాదేవీలకు సంబంధించి పాన్‌ కార్డు తప్పనిసరి కావాల్సిందే. బ్యాంకు ఖాతా తెరవడం నుంచి లావాదేవీలు నిర్వహించే వరకు అన్నింటికి పాన్‌ కార్డు తప్పని సరి అయిపోయింది. అయితే పాన్‌కార్డుపై ఉండే 10 అంకెల సంఖ్య ఎంతో ముఖ్యమైనది. ఈ మధ్య కాలంలో పాన్‌కార్డు కూడా దుర్వినియోగం అయిపోతోంది. పాన్‌ కార్డు విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఒకరి పేరుపై ఫేక్‌ పాన్‌ కార్డు కూడా సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు కొందరు మోసగాళ్లు. అటువంటి మోసాలను అరికట్టేందుకు బ్యాంకు అధికారులు, అధికారులు పలు సూచనలు సలహాలు చేస్తున్నారు. ఈ పది అంకెల కోడ్‌లో కార్డుదారునికి సంబంధించి పూర్తి వివరాలు ఉంటాయి. ఇటీవలి కాలంలో పాన్ సంబంధిత మోసాల కేసుల సంఖ్య పెరిగింది.

పాన్‌ కార్డు మోసాన్ని ఎలా నివారించాలి..?

☛ మీ పాన్‌ కార్డు తప్పనిసరి అయిన చోట మాత్రమే ఉపయోగించండి.

ఇవి కూడా చదవండి

☛ మీ పుట్టిన తేదీ లేదా పూర్తి పేరును పబ్లిక్‌గా లేదా భధ్రత లేని, ఆన్‌లైన్‌ పోర్టల్‌ నమోదు చేయవద్దు

☛ ఈ వివరాలు ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌లో మీ పాన్‌ నంబర్‌ను ట్రాక్‌ చేయడానికి ఉపయోగించబడతాయి.

☛ మీరు మీ పాన్‌ కార్డు జిరాక్స్‌ సమర్పించిన స్థలాలను గుర్తించుకోండి

☛ మీరు మీ మొబైల్‌లో మీ పాన్‌ వివరాలు సేవ్‌ చేసి ఉంటే వాటిని తొలగించండి.

☛మీ పాన్‌ కార్డుతో ఎలాంటి అనుమానస్పద కార్యకలాపాలు జరుగకుండా మీ ఫారమ్‌ 26A క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ ఉండండి. ఎందుకంటే మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ ఫారమ్‌ 26A మీ పాన్‌ ద్వారా జరిగిన అన్ని ఆర్థిక లావాదేవీలను నమోదు చేస్తుంది.

పాన్‌తో ఏదైనా మోసం జరిగితే ఎలా తనిఖీ చేయాలి?

☛ క్రెడిట్‌ స్కోర్‌ను నేరుగా రూపొందించడం ద్వారా ఎవరైనా మీ పాన్‌ నంబర్‌ను దుర్వినియోగం చేశారో లేదో తెలుసుకోవచ్చు.

☛ CIBIL, Equifax, Experian లేదా CRIF హై మార్క్ ద్వారా తమ పేరు మీద ఏదైనా రుణం తీసుకున్నారా లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు.

☛ Paytm లేదా బ్యాంక్ బజార్ వంటి ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్‌లను సందర్శించడం ద్వారా మీరు మీ ఆర్థిక నివేదికలను తనిఖీ చేయవచ్చు.

☛ దీని కోసం, వినియోగదారు పేరు, పుట్టిన తేదీ వంటి వ్యక్తిగత వివరాలను పాన్ కార్డ్ వివరాలతో పాటు నమోదు చేయాలి. దీన్ని బట్టి మరొకరు పాన్ కార్డుపై రుణం తీసుకున్నారా లేదా అనేది తెలుస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఉగ్రదాడికి స్ట్రాంగ్ ఎన్కౌంటర్! ఇండియాలో PSL బ్యాన్
ఉగ్రదాడికి స్ట్రాంగ్ ఎన్కౌంటర్! ఇండియాలో PSL బ్యాన్
నియంత్రణ రేఖ వెంబడి పాక్ కవ్వింపు చర్యలు.. భారత్ ఆర్మీపై కాల్పులు
నియంత్రణ రేఖ వెంబడి పాక్ కవ్వింపు చర్యలు.. భారత్ ఆర్మీపై కాల్పులు
తొలి బంతికే సిక్స్.. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ఇలా
తొలి బంతికే సిక్స్.. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ఇలా
10th విద్యార్ధులకు 2025 అలర్ట్..పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే
10th విద్యార్ధులకు 2025 అలర్ట్..పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే
జూలై 3న అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే
జూలై 3న అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే
ఉగ్రవేటకు రంగం సిద్ధం.. నేడు పహల్గాంకు ఆర్మీ చీఫ్ రాక..!
ఉగ్రవేటకు రంగం సిద్ధం.. నేడు పహల్గాంకు ఆర్మీ చీఫ్ రాక..!
నా పని అయిపోయింది అనుకున్న! ఆక్సిడెంట్ పై ఫ్లింటాఫ్..
నా పని అయిపోయింది అనుకున్న! ఆక్సిడెంట్ పై ఫ్లింటాఫ్..
8 మ్యాచ్‌ల్లో 2 విజయాలు.. 3వ విజయం కోసం చెన్నై, హైదరాబాద్ పోరు
8 మ్యాచ్‌ల్లో 2 విజయాలు.. 3వ విజయం కోసం చెన్నై, హైదరాబాద్ పోరు
పాక్ కి గుణపాఠం చెప్పేందుకు వ్యూహాత్మకంగా భారత్ అడుగులు
పాక్ కి గుణపాఠం చెప్పేందుకు వ్యూహాత్మకంగా భారత్ అడుగులు
ఇంటర్‌లో ఫెయిల్.. UPSCసివిల్స్‌లో మాత్రం సత్తాచాటిన తెలుగు బిడ్డ!
ఇంటర్‌లో ఫెయిల్.. UPSCసివిల్స్‌లో మాత్రం సత్తాచాటిన తెలుగు బిడ్డ!