AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Work From Home: ప్రముఖ కంపెనీకి ఉద్యోగుల జలక్! ఏకంగా 800 మంది రాజీనామా..ఎందుకో తెలుసా?

కొవిడ్‌ ప్రభావంతో అనేక సాఫ్ట్ వేర్ కంపెనీలు వర్క్‌ఫ్రమ్‌ హోం బాట పట్టాయి. దాదాపు ఈ ప్రక్రియ రెండేళ్లుగా కొనసాగుతుంది. ఉద్యోగులు ఇంటి వద్దనే ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు..

Work From Home: ప్రముఖ కంపెనీకి ఉద్యోగుల జలక్! ఏకంగా 800 మంది రాజీనామా..ఎందుకో తెలుసా?
Work From Home
Srilakshmi C
|

Updated on: May 12, 2022 | 3:51 PM

Share

WhiteHat Jr employees: కొవిడ్‌ ప్రభావంతో అనేక సాఫ్ట్ వేర్ కంపెనీలు వర్క్‌ఫ్రమ్‌ హోం బాట పట్టాయి. దాదాపు ఈ ప్రక్రియ రెండేళ్లుగా కొనసాగుతుంది. ఉద్యోగులు ఇంటి వద్దనే ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు వైరస్‌ తీవ్రత తగ్గిందని, ఉద్యోగులు ఆఫీసులకు రావాలని కంపెనీలు కోరుతున్నాయి. ఇప్పటికే పలువురు ఉద్యోగులు పట్టణాలకు చేరుకొని తమ కార్యాలయాలకు వెళ్లి పనిచేస్తున్నారు కూడా. ఐతే ఇది నచ్చని చాలా మంది ఉద్యోగులు ఓ కంపెనీకి ఊహించని షాకిచ్చారు.

ముంబైకి చెందిన ప్రముఖ కోడింగ్‌ లెర్నింగ్‌ స్టార్టప్‌ కంపెనీ ‘వైట్‌హ్యాట్‌ జేఆర్‌’ కు చెందిన 800 మంది ఉద్యోగులు ఆఫీసులకు వచ్చి పనిచేయమన్నందుకు రాజీనామా చేశారు. ఐఎన్‌సీ42 ఎక్స్ క్లూజివ్ నివేదిక ప్రకారం.. వైట్‌హ్యాట్‌ జేఆర్‌ను ఎడ్ టెక్ దిగ్గజం బైజూస్ 2020లో 300 మిలియన్లకు కొనుగోలు చేసింది. దేశంలో కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో ఒక నెల వ్యవధిలో ఉద్యోగులందరూ ఆఫీస్ కు వచ్చి పనిచేయాలని సంస్థ ఈ మెయిల్ ద్వారా కోరింది. అయితే కార్యాలయాలకు వచ్చేందుకు ఉద్యోగులు ఇష్టపడటం లేదు. అధిక శాతం మంది తాము కార్యాలయాలకు ఇప్పట్లో రామని స్పష్టం చేశారు. సుమారు 800 మంది ఉద్యోగులు ఏకంగా రాజీనామానే చేశారు. ఇంటివద్ద నుండి ఉద్యోగాలు చేయడం వల్ల ఖర్చు తగ్గించుకునే అవకాశం ఉంటుందని కొంతమంది, కేవలం ఒక నెల వ్యవధిలో ఇల్లు, ఇతర సౌకర్యాలను సమకూర్చుకోవడం సాధ్యం కాదని, సిటీలకు తిరిగి రావడానికి శాలరీ పెంచాలని మరికొందరు ఉద్యోగులు కోరుతున్నారు.

ఆఫీసు నుంచి పని చేయమని అడిగిన తర్వాత 800 మంది వైట్‌హ్యాట్ జూనియర్ ఉద్యోగులు గత రెండు నెలల్లో తమ జాబ్‌కు రిజైన్ చేశారు. కిడ్స్ ఆన్‌లైన్ కోడింగ్ లెర్నింగ్ ఎడ్టెక్ స్టార్ట్-అప్ నుంచి వీరు రాజీనామా చేసినట్లు ఐఎన్‌సీ42 నివేదిక తెలిపింది. ఈ వార్తలతో ఐటీ కంపెనీలు కూడా వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌పై పునరాలోచనలో పడ్డాయి. మరికొన్ని రోజుల పాటు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం విధానం అవలంబించాలని ఆలోచిస్తున్నాయి.

Also Read:

Beauty Tips: ఈ ఫేస్‌ ప్యాక్‌లతో పిగ్మెంటేషన్‌కు గుడ్‌బై చెబుదాం..