SSC Phase-X Recruitment 2022: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ 2065 పోస్టులకు నోటిఫికేషన్.. ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ..

భారత ప్రభుత్వ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగానికి చెందిన న్యూఢిల్లీలోని స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు/విభాగాలు/సంస్థల్లోని వివిధ కేటగిరీల్లో ఫేజ్‌-10కు సంబంధించిన వివరణాత్మక నోటిఫికేషన్‌ విడుదల చేసింది..

SSC Phase-X Recruitment 2022: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ 2065 పోస్టులకు నోటిఫికేషన్.. ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ..
Staff Selection Commission
Follow us
Srilakshmi C

|

Updated on: May 13, 2022 | 9:08 AM

SSC Phase – X Notification 2022: భారత ప్రభుత్వ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగానికి చెందిన న్యూఢిల్లీలోని స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు/విభాగాలు/సంస్థల్లోని వివిధ కేటగిరీల్లో ఫేజ్‌-10కు సంబంధించిన వివరణాత్మక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టులు: 2065

పోస్టులు: నర్సింగ్‌ ఆఫీసర్‌, సీనియర్‌ రీసెర్చ్‌ అసిస్టెంట్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌, ఫార్మసిస్ట్, రీసెర్చ్‌ అసోసియేట్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌, ల్యాబొరేటరీ అటెండెంట్‌, పర్సనల్ అసిస్టెంట్‌, సర్వేయర్‌, ఎంటీఎస్‌ తదితర పోస్టులు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: పోస్టును బట్టి టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష (CBT) ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం: రాత పరీక్ష 200 మార్కులకు ఆబ్జెక్టివ్‌ టైప్‌ మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో ఉంటుంది. 60 నిముషాల వ్యవధిలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కుల చొప్పున నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

విభాగాల వారీగా ప్రశ్నలు:

  • జనరల్‌ ఇంటెలిజెన్స్‌లో 25 ప్రశ్నలకు 50 మార్కులు
  • జనరల్ అవేర్‌నెస్‌లో 25 ప్రశ్నలకు 50 మార్కులు
  • క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లో 25 ప్రశ్నలకు 50 మార్కులు
  • ఇంగ్లిష్‌ లంగ్వేజ్‌లో 25 ప్రశ్నలకు 50 మార్కులు

దరఖాస్తు విధానం: ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 13, 2022.

రాత పరీక్ష తేదీ: ఆగస్టు 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Also Read:

Work From Home: ప్రముఖ కంపెనీకి ఉద్యోగుల జలక్! ఏకంగా 800 మంది రాజీనామా..ఎందుకో తెలుసా?