AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSSPDCL AE Recruitment 2022: తెలంగాణ విద్యుత్ శాఖలో 70 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. రాత పరీక్ష ఎప్పుడంటే..

దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (TSSPDCL) విడుదల చేసిన 70 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (Assistant Engineer posts) పోస్టులకు రాతపరీక్ష జులై 17న నిర్వహించనున్నట్లు..

TSSPDCL AE Recruitment 2022: తెలంగాణ విద్యుత్ శాఖలో 70 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. రాత పరీక్ష ఎప్పుడంటే..
Tsspdcl
Srilakshmi C
|

Updated on: May 13, 2022 | 9:28 AM

Share

Telangana TSSPDCL Recruitment 2022 Registration Process Begin: దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (TSSPDCL) విడుదల చేసిన 70 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (Assistant Engineer posts) పోస్టులకు రాతపరీక్ష జులై 17న నిర్వహించనున్నట్లు బుధవారం (మే 12)న ప్రకటించింది. ఈ సంస్థ పరిధిలోని మొత్తం 15 జిల్లాల్లో 70 ఏఈ పోస్టుల భర్తీకి మే 11న నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు మే 11 నుంచి జూన్‌ 3 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టిక్కెట్లను జులై 11 నుంచి డౌన్‌లోడు చేసుకోవాలని తెల్పింది. ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ సబ్జెక్టుతో బీటెక్‌ లేదా తత్సమాన డిగ్రీ చదివిన అభ్యర్ధులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 70 పోస్టుల్లో 16 ఓపెన్‌ కేటగిరీలో ఉన్నాయి. ఇవికాక ఓపెన్‌ కేటగిరీలో మరో 9 పోస్టులు మహిళలకు రిజర్వు చేశారు. మిగతావన్నీ వివిధ వర్గాలకు రిజర్వు చేశారు. సబ్‌ ఇంజినీరు పోస్టుల భర్తీకి సైతం విడిగా ప్రకటన జారీచేస్తున్నట్లు ఈ సంస్థ తెలిపింది. ఆ వివరాల కోసం సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Also Read:

SSC Phase-X Recruitment 2022: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ 2065 పోస్టులకు నోటిఫికేషన్.. ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ..