Hyderabad: విశ్వనగరి సిగలో ప్రతిష్టాత్మక కంపెనీ.. మరో ఏరోస్పేస్ కంపెనీ భారీ పెట్టుబడులు

Hyderabad: అంతర్జాతీయ కంపెనీలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తూ, రూ. కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తూ పెట్టుబడులతో దూసుకుపోతున్న హైదరాబాద్‌ మహా నగరంలో మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టనుంది. హెలికాప్టర్‌ గేర్లు...

Hyderabad: విశ్వనగరి సిగలో ప్రతిష్టాత్మక కంపెనీ.. మరో ఏరోస్పేస్ కంపెనీ భారీ పెట్టుబడులు
Follow us
Narender Vaitla

|

Updated on: May 12, 2022 | 3:10 PM

Hyderabad: అంతర్జాతీయ కంపెనీలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తూ, రూ. కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తూ పెట్టుబడులతో దూసుకుపోతున్న హైదరాబాద్‌ మహా నగరంలో మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టనుంది. హెలికాప్టర్‌ గేర్లు, గేర్‌ బాక్సుల ఉత్పతిలో పేరు గాంచిన స్కంద ఏరోస్పేస్ హైదరాబాద్‌లో పెట్టుబడులకు గురువారం శ్రీకారం చుట్టింది. రఘువంశీ మెషీన్‌ టూల్స్‌, రేవ్‌ గేర్స్‌ ఎల్‌ఎల్‌సీ సంయుక్తంగా ఏర్పాటు చేయనున్న ఈ సంస్థ రూ. 250 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. రఘువంశీ మెషీన్‌ టూల్స్‌, అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన రేవ్‌ గేర్స్‌ ఎల్‌ఎల్‌సీ సంస్థలతో భారీ ప్రాజెక్ట్‌ను చేపట్టునన్నారు.

భారత్‌లో హెలికాప్టర్‌ గేర్లు, గేర్‌ బాక్సులు తయారు చేసే సామర్థ్యం ఉన్న తొలి ప్రైవేట్‌ కంపెనీగా స్కంద ఏరో స్పేస్‌ నిలవనుంది. ఈ సంస్థ ఏర్పాటు ద్వారా 1000 మందికి ఉపాధి కల్పించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. స్కంద ఏరోస్పేస్‌కు 9 మిలియన్‌ డాలర్ల ఆర్డర్లు అందిస్తామని రేవ్‌ గేర్స్‌ తెలిపింది. ఈ జాయింట్‌ వెంచర్‌లో రేవ్‌ గేర్స్‌కు 55 శాతం, రఘువంశీ మెషీన్‌ టూల్స్‌, ఇన్వెస్టర్లకు 45 శాతం వాటాలుంటాయి. రాబోయే మూడు నుంచి ఐదేళ్లలో రూ. 250 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

Skanda Aerospace

ఇవి కూడా చదవండి

ఇక టెక్సాస్‌ ప్రధాన కేంద్రంగా పనిచేసే రేవ్‌ గేర్స్‌ సంస్థ బోయింగ్‌, బెల్‌, కాలిన్స్‌, బీఏఈ సిస్టమ్స్‌, రోల్స్‌ రాయిస్‌, ప్రాట్‌ అండ్‌ విట్నీ, మెక్లారెన్‌, నాస్కర్‌లాంటి కంపెనీలకు విడి భాగాలు సరఫరా చేస్తుండగా, రఘవంశీ మెషీన్‌ టూల్స్‌ సంస్థ బోయింగ్‌, జీఈ ఏవియేషన్‌, ఈటన్‌, హ నీవెల్‌ వంటి సంస్థలకు సబ్‌ అసెంబ్లీలను సరఫరా చేస్తుంది.

మరిన్ని హైదరాబాద్ వార్తలకు క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?