Telangana: నిజామాబాద్ లో అమానుష ఘటన.. చెట్టుకింద అపస్మారక స్థితిలో ఆడశిశువు

పాపం, పుణ్యం, ఏదీ తెలియని పాలబుగ్గల పసిపాపాయి. ఆడబిడ్డగా పుట్టిన నేరానికి అనాథగా మారింది. చెట్టుకింద అపస్మారక స్థితిలో కనిపించిన ఓ పసిబిడ్డ సంచలనంగా మారింది. నిజామాబాద్‌ జిల్లాలో...

Telangana: నిజామాబాద్ లో అమానుష ఘటన.. చెట్టుకింద అపస్మారక స్థితిలో ఆడశిశువు
child
Follow us
Ganesh Mudavath

|

Updated on: May 12, 2022 | 1:26 PM

పాపం, పుణ్యం, ఏదీ తెలియని పాలబుగ్గల పసిపాపాయి. ఆడబిడ్డగా పుట్టిన నేరానికి అనాథగా మారింది. చెట్టుకింద అపస్మారక స్థితిలో కనిపించిన ఓ పసిబిడ్డ సంచలనంగా మారింది. నిజామాబాద్‌ జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికులను కలవరపెడుతోంది. చూడముచ్చటగా ముద్దులొలుకుతోన్న ఈ పసిపాపాయిని వదిలేసిందెవరో తెలియదు. అభం శుభం తెలియని ఆ పసిబిడ్డను ఏ తల్లి కన్నదో తెలియదు. మండుటెండలో చెట్టుకింద నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళారు. ఎంత సేపటి నుంచి ఈ పాపాయి ఆ చెట్టుకింద ఉందో తెలియదు. అసలే ఎండలు. అందులోనూ ఏడ్చి ఏడ్చి గొంతెండి ఉంటుంది. అమ్మరానేలేదు. నాన్న రాడు. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లింది. అపస్మారక స్థితిలోకి చేరుకుంది. రోడ్డునపోయే వారెవరో చూసి, ఆ పసిబిడ్డను ఆసుపత్రిలో చేర్పించడంతో ప్రాణాలు దక్కాయి. అపస్మారక స్థితిలో చిన్నారి, నీళ్లు ఆహారం లేక స్పృహ తప్పి ఉండొచ్చు అంటున్నారు ఆస్పత్రి సిబ్బంది. ఆడపిల్లల సామాజిక వెలివేతకు ప్రత్యక్ష సాక్ష్యంగా మారిన ఈ దృశ్యం చూపరులను కంటతడి పెట్టిస్తోంది. ముక్కుపచ్చలారని పాపాయిని వీధిన పడేసిన అమానుష ఘటన అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

ఇవి కూడా చదవండి

PM Narendra Modi: రంజాన్ ఎలా జరుపుకున్నారు యాకుబ్.. ఉద్వేగానికి లోనైన ప్రధాని మోడీ.. వీడియో

Andhra Pradesh: విద్యావ్యవస్థను నాశనం చేస్తున్న వారినే ప్రభుత్వం అరెస్టు చేసింది.. సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్య

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే