AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Narendra Modi: రంజాన్ ఎలా జరుపుకున్నారు యాకుబ్.. ఉద్వేగానికి లోనైన ప్రధాని మోడీ.. వీడియో

బాలిక ప్రతిస్పందన అనంతరం ఉద్వేగానికి లోనైన ప్రధాని మోడీ.. కొన్ని క్షణాలపాటు మౌనంగా చూస్తుండిపోయారు..

PM Narendra Modi: రంజాన్ ఎలా జరుపుకున్నారు యాకుబ్.. ఉద్వేగానికి లోనైన ప్రధాని మోడీ.. వీడియో
Pm Narendra Modi
Shaik Madar Saheb
|

Updated on: May 12, 2022 | 1:08 PM

Share

PM Modi gets emotional: గుజరాత్‌లోని బరూచ్‌లో గురువారం జరిగిన ఉత్కర్ష్ సమరోహ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ ద్వారా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రజలతో ప్రత్యేకంగా సంభాషిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో దృష్టిలోపం ఉన్న యాకూబ్ పటేల్ అనే లబ్ధిదారుడితో ప్రధాని మోడీ ప్రత్యేకంగా సంభాషించారు. దృష్టిలోపం ఎందుకు వచ్చింది.. డాక్టర్లు ఏమన్నారు అంటూ ప్రధాని మోడీ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీ కుమార్తెలను చదివిస్తున్నారా..? అని యాకూబ్‌ను ప్రధాని మోడీ అడిగారు. దానికి ఆయన సమాధానమిస్తూ.. తన ముగ్గురు కుమార్తెలు చదువుతున్నారని.. ఒకరు 12, మరొకరు 8, ఇంకొకరు 1వ తరగతి చదువుతున్నారన్నారు. వారిలో పెద్ద కుమార్తె డాక్టర్ కావాలని కోరుకుంటుందని యాకుబ్ తెలిపారు. అయితే.. పక్కన కూతురు ఉందా అంటూ అడిగారు.

వెంటనే అక్కడ కూర్చున్న ఆలియాను.. వైద్య వృత్తిని కెరీర్‌గా ఎంచుకోవడానికి గల కారణం ఎంటని.. మోడీ ప్రశ్నించారు. దీనికి ఆమె సమాధానమిస్తూ.. “మా నాన్న దృష్టిలోపంతో బాధపడుతున్న సమస్య కారణంగా నేను డాక్టర్‌ని కావాలనుకుంటున్నాను” అంటూ చెప్పింది. ఈ క్రమంలో.. బాలిక ప్రతిస్పందన అనంతరం ఉద్వేగానికి లోనైన ప్రధాని.. కొన్ని క్షణాలపాటు మౌనంగా చూస్తుండిపోయారు.. ఆమెతో మాట్లాడుతూ.. పట్టుదల ఆశయమే.. నీ బలం అంటూ ఆమెతో పేర్కొన్నారు.

వీడియో..

అనంతరం యాకూబ్ పటేల్‌ను.. రంజాన్ జరుపుకున్నారా..? ఎలా జరుపుకున్నారా..? కూతుళ్లకు ఏం ఇచ్చారు అంటూ మోడీ ఆరా తీశారు. బాగా జరుగుపుకున్నామని.. కొత్త డ్రెస్సులు కొనిచ్చానని యాకూబ్ తెలిపాడు. ఇంకా వ్యాక్సినేషన్ గురించి అడగగా.. తాము వ్యాక్సిన్ తీసుకున్నట్లు చెప్పాడు. పిల్లలను మంచిగా చదివించాలని.. వారి కలలను సాకారం చేయాలని మోడీ యాకూబ్ కు సూచించారు. అలాగే పిల్లల మనస్సులో కూడా అభిరుచి పెరగాలని మోడీ అభిప్రాయపడ్డారు.

Also Read:

PM Narendra Modi: అర్హత లేని వారికి ప్రభుత్వ పథకాలు.. ఆవేదన వ్యక్తంచేసిన ప్రధాని మోడీ

India Covid-19: దేశంలో పెరిగిన కరోనా రికవరీలు.. నిన్న ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?