Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Castrol Super Mechanic Contest: క్యాస్ట్రోల్ సూపర్ మెకానిక్ 2021-22.. విజేతలుగా కల్కా ప్రసాద్, కిషోర్ కల్లాప

క్యాస్ట్రోల్(Castrol) సూపర్ మెకానిక్ 2021-22 టైటిల్‌ను కల్కా ప్రసాద్, కిషోర్ కల్లాప గటాడే గెలుచుకున్నారు. క్యాస్ట్రోల్ సూపర్ మెకానిక్ కాంటెస్ట్ 2021-22లో కారు, బైక్ విభాగాల్లో వీరు ఛాంపియన్‌లుగా నిలిచారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ పోటీల్లో 1.40 లక్షల మంది...

Castrol Super Mechanic Contest: క్యాస్ట్రోల్ సూపర్ మెకానిక్ 2021-22.. విజేతలుగా కల్కా ప్రసాద్, కిషోర్ కల్లాప
Castrol
Follow us
Ganesh Mudavath

| Edited By: Shiva Prajapati

Updated on: May 12, 2022 | 5:14 PM

క్యాస్ట్రోల్(Castrol) సూపర్ మెకానిక్ 2021-22 టైటిల్‌ను కల్కా ప్రసాద్, కిషోర్ కల్లాప గటాడే గెలుచుకున్నారు. క్యాస్ట్రోల్ సూపర్ మెకానిక్ కాంటెస్ట్ 2021-22లో కారు, బైక్ విభాగాల్లో వీరు ఛాంపియన్‌లుగా నిలిచారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ పోటీల్లో 1.40 లక్షల మంది పాల్గొన్నారు. విజేతలకు ట్రోఫీలు, నగదు బహుమతిని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Pradan) అందించారు. విజేతలిద్దరికీ ద్విచక్రవాహనం, కుటుంబ బీమా, గ్యారేజ్ మేక్ ఓవర్ కోసం రూ. లక్ష చెక్కును అందించారు. కారు విభాగంలో మారు మయూర్‌ భాయ్‌, బైక్‌ విభాగంలో ప్రవేశ్‌ కుమార్‌ రావత్‌ మొదటి రన్నరప్‌గా నిలిచారు. వీరికి బైక్‌ తో పాటు నలుగురు సభ్యుల కటుంబానికి బీమా పాలసీని అందించారు. సెకండ్ రన్నరప్‌గా ధరమ్‌రాజ్, జీ.రామకృష్ణ నిలిచారు. వీరికి గ్యారేజ్ మేకోవర్ కోసం రూ.25,000 చెక్కును అందించారు. క్యాస్ట్రోల్ ఇండియా, TV9 నెట్‌వర్క్ చొరవను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభినందించారు. భారత ఆటోమోటివ్ రంగంలో మెకానిక్ కమ్యూనిటీ ఒక ముఖ్యమైన భాగమని, వారి ప్రతిభను సద్వినియోగం చేసుకోవడం, నైపుణ్యాలను వ్యవస్థీకృత పద్ధతిలో పెంపొందించడం వల్ల వారికి నూతన జీవనోపాధి అవకాశాలు కలుగుతాయని అన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా మెకానిక్‌లను ప్రోత్సహించడం, నైపుణ్యం పెంచడం, శిక్షణ ఇవ్వడం సాధ్యమవుతుందన్నారు.

క్యాస్ట్రోల్ సూపర్ మెకానికి కాంటెస్ట్ 2021-22 క్యాస్ట్రోల్ ఇండియా, TV9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కాంటెస్ట్ గ్రాండ్ ఫినాలే ఢిల్లీలో జరిగింది. టెలివిజన్ నటుడు రవి దూబే హోస్ట్‌గా వ్యవహరించారు. ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించిన 50 మంది పోటీదారుల నుంచి విజేతలను ఎంపిక చేశారు. కాంటెస్ట్ లో పాల్గొన్న వారిలో 35,000 మంది పోటీ దారులు రెండో రౌండ్‌కు అర్హత సాధించారు. కఠినమైన శిక్షణ ప్రక్రియ, వివిధ సెషన్ల తర్వాత 1,000 మంది పోటీదారులు చివరి దశలో ఎంటర్ అయ్యారు. మెకానిక్‌ల వృత్తిలో సరైన గౌరవాన్ని సృష్టించడం తమ లక్ష్యమని క్యాస్ట్రోల్ ఇండియా ఎండీ సందీప్ సాంగ్వాన్ అన్నారు. ఈ సీజన్ విజేతలకు క్యాస్ట్రోల్ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలిపారు. గ్లోబల్ లీడర్‌గా పేరు తెచ్చుకున్న క్యాస్ట్రోల్.. సాధికారత కల్పించే ఈ ఆలోచన అభినందనీయమని TV9 నెట్ వర్క్ సీఈఓ బరున్ దాస్ అన్నారు. ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ విజేతలేనని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

క్యాస్ట్రోల్ సూపర్ మెకానిక్ కాంటెస్ట్ 2021-22 విశేషమైనదని TV9 డిజిటల్, బ్రాడ్ కాస్టింగ్ చీఫ్ ఆఫీసర్ రక్తిమ్ దాస్ అన్నారు. TV9 నెట్‌వర్క్ భారతీయ భాషలలోని ఛానల్‌ల ద్వారా దేశ నలుమూలల ఉన్న మెకానిక్‌లతో కనెక్ట్ అయ్యామని వివరించారు. సవాలుతో కూడిన మహమ్మారి పరిస్థితి ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా గరిష్ఠ సంఖ్యలో మెకానిక్‌లను చేరుకోవడానికి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల సామర్థ్యాన్ని ఉపయోగించారు. కాస్ట్రోల్ సూపర్ మెకానిక్ కాంటెస్ట్ ఈ ఎడిషన్ వర్చువల్ ప్లాట్‌ఫారమ్‌లలో నిర్వహించారు. మెకానిక్‌ల సౌలభ్యం కోసం ఐవీఆర్ రౌండ్‌ను ఇంగ్లీష్, హిందీ భాషలతో పాటు తమిళం, తెలుగు, మలయాళం, బెంగాలీ, కన్నడ, గుజరాతీ, మరాఠీ వంటి ప్రాంతీయ భాషలలో అందుబాటులో ఉంచారు.