Optical Illusion: ఇంత చిన్న లాజిక్ మిస్ అయితే ఎలా.. ఫోటోలో మిస్టేక్‌ను పట్టుకోలేకపోతున్న జనాలు..!
Optical Illusion: ఒక్కోసారి మన కళ్లే మనల్ని మోసం చేస్తుంటాయి. ఎదురుగా ఏం లేకపోయినా.. ఉన్నట్లుగా భ్రమ పడుతుంటాం. ఉదాహరణకు ఎండమావుల గురించి చెప్పుకోవచ్చు...
Optical Illusion: ఒక్కోసారి మన కళ్లే మనల్ని మోసం చేస్తుంటాయి. ఎదురుగా ఏం లేకపోయినా.. ఉన్నట్లుగా భ్రమ పడుతుంటాం. ఉదాహరణకు ఎండమావుల గురించి చెప్పుకోవచ్చు. అయిది ఇదీ సహజ సిద్ధమైనది. కానీ, కొన్ని చిత్రాలు కూడా మనుషులను కన్‌ఫ్యూజ్ చేస్తాయి. వాస్తవం ఒకటైతే.. కనిపించేది మరొకటిగా ఉంటుంది. తాజాగా అలాంటి మైండ్ బ్లాంక్ అయ్యే ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అవును.. చూడటానికి మాయలా ఉంది. కానీ, నిశితంగా గమనిస్తే గానీ వాస్తవం ఏంటనేది తెలియరాలేదు. చాలా మంది ఈ ఫోటోను చూసి షాక్ అయ్యారు. ఆ తరువాత నిజం తెలుసుకుని హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.
సాధారణంగా ఏటీఎంల వద్ద, ఇళ్ల వద్ద, రక్షణ అవసరమైన ప్రతిచోటూ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంటారు. సెక్యూరిటీ సిబ్బంది కూడా రాత్రివేళ గస్తీ కాస్తారు. అయితే, తాజాగా తల లేకుండానే గస్తీ కాస్తున్న సెక్యూరిటీ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అవును మీరు ఉన్నది నిజమే.. ఆ ఫోటోలో ఉన్న సెక్యూరిటీ గార్డుకు తల తేలు. కేవలం మొండెం వరకు మాత్రమే కనిపిస్తోంది. కూర్చీలో కూర్చున్న సెక్యూరిటీ గార్డు తల కనిపించకుండా.. కేవలం మొండెం వరకు మాత్రమే కనిపిస్తుంది. ఎడిటింగ్ ఏమైనా చేశారా? అదీ కాదు. అయితే, ఈ షోటోను రెడిట్‌లో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది.
అయితే, దీని వెనుక వాస్తవం తెలియక నెటిజన్లు షాక్ అవుతున్నారు. వాస్తవానికి ఈ ఫోటోలో ఉన్న సెక్యూరిటీ గార్డు హాయిగా నిద్రపోతున్నాడు. కూర్చిలో కూర్చున్న అతను.. చేతిలో టోపీ పెట్టుకుని.. తలను కుర్చీ వెనక్కి వాల్చాడు. దాంతో అతని తల వెనక్కి వెళ్లింది. అయితే, ఈ యాంగిల్ డిఫరెంట్‌గా ఉండటంతో ఓ వ్యక్తి సదరు సెక్యూరిటీ గార్డును ఫోటో తీసి.. రెడిట్‌లో పోస్ట్ చేశాడు. ఒకరకమైన బ్రమకు గురిచేసిన ఈ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.