గర్ల్‌ఫ్రెండ్‌ని కలిసేందుకు ఎలక్ట్రిషియన్ తుంటరి పని.. ఉక్కిరిబిక్కిరైన గ్రామం.. మ్యాటర్ తెలిస్తే ఫ్యూజులు ఔట్..!

Funny Love Story: ప్రేమించిన యువతిని కలవాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. అయితే, రహస్యంగా కొనసాగుతున్న తమ ప్రేమ వ్యవహారం బయటకు తెలియకుండా ఉండేందుకే..

గర్ల్‌ఫ్రెండ్‌ని కలిసేందుకు ఎలక్ట్రిషియన్ తుంటరి పని.. ఉక్కిరిబిక్కిరైన గ్రామం.. మ్యాటర్ తెలిస్తే ఫ్యూజులు ఔట్..!
Power Cuts
Follow us

|

Updated on: May 11, 2022 | 6:16 PM

Funny Love Story: ప్రేమించిన యువతిని కలవాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. అయితే, రహస్యంగా కొనసాగుతున్న తమ ప్రేమ వ్యవహారం బయటకు తెలియకుండా ఉండేందుకే ఓ పియుడు కంత్రీ పనులు చేస్తున్నాడు. ఒకసారి కాదు.. రెండుసార్లు కాదు.. ప్రియురాలిని కలిసి ప్రతిసారి అతను అదే పని చేస్తుండటంతో గ్రామస్తులంతా ఉక్కిరి బిక్కిరయ్యారు. చివరకు ఇక చాలురా అయ్యా అంటూ.. అతనికి, అతని ప్రియురాలికి వివాహం జరిపించారు. ఈ విచిత్ర ఘటన బీహార్‌లో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

బీహార్ రాష్ట్రంలోని పూర్నియా జిల్లా గణేష్‌పూర్ గ్రామంలో రోజూ విద్యుత్‌ సరఫరా నిలిచిపోతుంది. ఒక సారి పోయిన విద్యుత్.. కొన్ని గంటలు గడిస్తే గానీ వచ్చేది కాదు. రోజూ ఇదే పరిస్థితి ఉండటంతో గ్రామస్తులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. పవర్ కట్స్ కారణంగా ప్రజలు ఇబ్బంది పడటంతో పాటు.. పంట పొలాలూ ధ్వంసం అవుతున్నాయని గ్రామస్తులు వాపోయారు. అయితే, పొరుగు గ్రామాల్లో లేని పవర్ కట్స్.. తమ గ్రామంలోనే ఎందుకున్నాయా? అని ప్రశ్న గ్రామస్తుల మదిని తొలచింది. ఏదో జరుగుతోందని భావించిన గ్రామస్తులు.. దీనిని కనిపెట్టాలని ఫిక్స్ అయ్యారు. చివరికి జరుగుతున్న గుట్టును రట్టు చేశారు.

ఇవి కూడా చదవండి

గ్రామానికి చెందిన ఎలక్ట్రిషియన్.. అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. పగటిపూట ఆమెను కలవడం కుదరక.. రాత్రి కలిసేందుకు టైమ్ ఫిక్స్ చేసుకున్నారు. ఇంకేముంది.. అనుకున్న ప్రకారం ప్రియురాలిని కలవాలని అనుకున్నప్పుడల్లా అతను ఊర్లో కరెంట్ కట్ చేసేవాడు. ఒకసారి కరెంట్ పోతే.. గంటల గడిచినా రాకపోయేది. ఇలా గంటల గంటలు పవర్ కట్స్ చేస్తుండటంతో అనుమానించిన గ్రామస్తులు.. ఒక రోజు ఎలక్ట్రిషియన్ పవర్ కట్ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆగ్రహంలో అతనిపై పిడిగుద్దులు కురిపించారు. ఆ తరువాత శాంతించిన గ్రామస్తులు.. సమాలోచనలు చేశారు. ఎలక్ట్రిషియన్ గోల భరించడం కంటే.. వారిద్దరికీ పెళ్లి చేయడం బెటర్ అని భావించారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వారిద్దరికీ వివాహం చేసి శుభం కార్డు వేశారు. ఇకనుంచైనా గ్రామానికి కరెంట్ కోతలు తప్పుతాయంటూ ఫైనల్‌గా సరదా పంచ్‌లు వేసుకున్నారు ప్రజలు.