Viral Video: స్నేహ గీతాలు ఆలపిస్తూ చక్కర్లు కొడుతున్న సింహం-కుక్క.. వీడియో చూస్తే మైండ్ బ్లాంక్ అవడం ఖాయం..!

Viral Video: సింహం తన కన్నా బలహీనమైన జంతువుకు కంట పడితే కరకరా నమిలేస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

Viral Video: స్నేహ గీతాలు ఆలపిస్తూ చక్కర్లు కొడుతున్న సింహం-కుక్క.. వీడియో చూస్తే మైండ్ బ్లాంక్ అవడం ఖాయం..!
Lion
Follow us

|

Updated on: May 11, 2022 | 8:00 AM

Viral Video: సింహం తన కన్నా బలహీనమైన జంతువుకు కంట పడితే కరకరా నమిలేస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ, ఇక్కడ జరిగిన సీన్ చూస్తే మాత్రం మైండ్ బ్లాంక్ అవడం ఖాయం. అవును.. మునుపెన్నడూ కనివిని ఎరుగని రీతిలో ఒక విచిత్ర ఘటన వెలుగు చూసింది. ఈ షాకింగ్ దృశ్యం గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇంతకీ ఆ షాకింగ్ సీన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగానే సింహాలను చూస్తే మిగతా జంతువులు హడలిపోతాయి. ఎందుకంటే.. సింహానికి ఆకలేస్తే ఇది వాటికి ఆహారం అవ్వాల్సిందే. అందుకే సింహం అలజడి వింటే చాలు.. చిన్న చిన్న జంతువులు సహా, పెద్ద జంతువులు సైతం పరుగులు తీస్తాయి. అలాంటిది.. ఇక్కడ ఓ కుక్క మాత్రం అడవిరాజు సింహంతో హాయిగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. నువ్వు నేను భాయి భాయి అంటూ దోస్తీ చేస్తోంది.

రాజ్‌కోట్‌లోని ఛెవాడ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో ఓ ఆసియా సింహం, శునకం చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కనిపించాయి. గత మూడు రోజులుగా సవాజ్ సోరత్‌లోని లోధికా తాలూకాలోని వివిధ గ్రామాల్లో ఇవి సంచరిస్తున్నాయి. దీనిని గమనించిన గ్రామస్తులు.. వీడియో తీశారు. విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలుపగా.. వారు సింహం అడుగుజాడలను పరిశీలించారు. ఒక నల్ల కుక్కతో కలిసి సింహం సంచరిస్తోందని అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. సింహం గిర్నార్ అభయారణ్యంలోకి తిరిగి వచ్చిందని అధికారులు ప్రకటించారు. అయితే, సింహం అటవి నుంచి బయటకు వచ్చాక.. ఓ కుక్కతో స్నేహం చేసిందన్నారు. దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి