AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: సైబర్ నేరగాళ్ల కొత్త దందా.. బాధితులను మళ్లీ ఇలా మోసగిస్తున్నారు.. జాగ్రత్త మరి..

Telangana: సైబర్ నేరగాళ్లు ఎల్లప్పూడూ ఒక్క అడుగు అడ్వాన్స్ గానే ఉంటున్నారు. అతి తెలివిని వాడంటంలో మాకు ఎవరూ పోటీలేరు, పోటీరారు అన్నట్లుగా ముదిరిపోతున్నారు.

Telangana: సైబర్ నేరగాళ్ల కొత్త దందా.. బాధితులను మళ్లీ ఇలా మోసగిస్తున్నారు.. జాగ్రత్త మరి..
Cyber Crimes
Ayyappa Mamidi
| Edited By: Narender Vaitla|

Updated on: Nov 08, 2022 | 8:41 PM

Share

Telangana: సైబర్ నేరగాళ్లు ఎల్లప్పూడూ ఒక్క అడుగు అడ్వాన్స్ గానే ఉంటున్నారు. అతి తెలివిని వాడంటంలో మాకు ఎవరూ పోటీలేరు, పోటీరారు అన్నట్లుగా ముదిరిపోతున్నారు. ఒకసారి తమ వలలో చిక్కినవారిపైనే కొత్త పద్ధతుల్లో అనేక మార్లు వల విసురుతున్నట్లు తెలుస్తోంది. సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోయిన కొంతమంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కాంటాక్ట్‌ నంబర్ల కోసం గూగుల్‌లో సెర్చ్‌(Google Search) చేస్తున్నారు. ఇలాంటివారిని టార్గెట్ చేసుకుంటున్న సైబర్ కేటుగాళ్లు నకిలీ వెబ్‌సైట్లు(Fake Websites), కాల్‌సెంటర్ల ద్వారా మరోసారి బురిడీ కొట్టిస్తున్నారు. సైబర్‌ బాధితుల ఫిర్యాదుల కోసం  సృష్టించిన నకిలీ వెబ్‌సైట్లలో తప్పుడు కాంటాక్ట్‌ నంబర్లును ఈ మోసగాళ్లు ఉంచుతున్నారు. ఇందుకోసం వినియోగిస్తున్న www.consumercomplaints.info, www.consumerchanakya.com, www.goindialegal.com, www.janasurakshakendra.in అనే నకిలీ వెబ్‌సైట్లను పోలీసులు గుర్తించారు. ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలని వారు సూచిస్తున్నారు.

బాధితులు నకిలీ వెబ్ సైట్లలో ఇచ్చిన ఫోన్ నంబర్లకు కాల్ చేస్తే.. మోసపోయిన సొమ్మును రికవరీ చేస్తామని ముందుగా మాయమాటలతో కేటుగాళ్లు నమ్మిస్తున్నారు. బాధితుల బ్యాంకు ఖాతా, ఫోన్‌ నంబర్‌, అడ్రస్‌, ఆధార్‌ నంబర్‌, సీవీవీ ఇలా పూర్తి వివరాలను నమ్మకంగా తీసుకుంటున్నారు. ఆ తరువాత వీటిని ఉపయోగించి బాధితుల నుంచి మళ్లీ డబ్బు కొట్టేస్తున్నారు. కొంత మంది బాధితులు ఇటువంటి వివరాలు ఇచ్చేందుకు అంగీకరించకపోతే.. వారి నుంచి ప్రాసెసింగ్ ఫీజు, ఖర్చుల పేరుతో ఇతర రుసుముల రూపంలో దోచుకుంటున్నారు. కేవలం గడచిన పది రోజుల్లో ఇలాంటి కేసులు ఐదు వరకు నమోదైనట్లు తెలంగాణ సైబర్ క్రైం పోలీసులు తెలిపారు. ఇలాంటి వారిని ఆన్ లైన్ లో ఆశ్రయించవద్దని, డబ్బులు పోగొట్టుకొన్న బాధితులు 1930 లేదా 155260 నంబర్లలో ఫిర్యాదు చేయాలని వారు సూచిస్తున్నారు. ఇటువంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

ఇవీ చదవండి..

Train Ticket: ప్రయాణ సమయంలో టికెట్ పోగొట్టుకున్నారా.. డోన్ట్ వర్రీ వెంటనే ఇలా చేయండి..

Kim Jong Un: కిమ్ మామ సంచలన నిర్ణయం.. టైట్ జీన్స్, హెయిర్ కలర్ వేస్తే జైలుకే..