Electric Scooters: ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలకు అదే కారణమవ్వొచ్చు.. నీతి ఆయోగ్ సంచలన వ్యాఖ్యలు..

Electric Scooters: ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు చెలరేగిన అనేక ఘటనల తరువాత.. దీనిపై నీతి ఆయోగ్(Niti Aayog) స్పందించింది. ఎలక్ట్రిక్ వాహనాల కోసం దిగుమతి చేసుకున్న బ్యాటరీలపై కీలక వ్యాఖ్యలు చేసింది.

Electric Scooters: ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలకు అదే కారణమవ్వొచ్చు.. నీతి ఆయోగ్ సంచలన వ్యాఖ్యలు..
Ev Fire
Follow us

|

Updated on: May 11, 2022 | 8:22 AM

Electric Scooters: ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు చెలరేగిన అనేక ఘటనల తరువాత.. దీనిపై నీతి ఆయోగ్(Niti Aayog) స్పందించింది. ఎలక్ట్రిక్ వాహనాల కోసం దిగుమతి చేసుకున్న బ్యాటరీ సెల్‌లు దేశ పరిస్థితులకు “అనుకూలంగా ఉండకపోవచ్చని” అందువల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని అభిప్రాయపడింది. దేశంలో అధిక ఉష్ణోగ్రతలు(High Temperature), ఉష్ణమండల వాతావరణకు ఉద్ధేశించని నాణ్యత లేని బ్యాటరీల వల్ల ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు సంభవించవచ్చని తెలుసుకోండి. EVల్లో మంటలపై అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమికంగా బయటపడ్డ వివరాల ప్రకారం బ్యాటరీల్లో లోపాలే కారణంగా తెలుస్తోంది.

ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు మంటల్లో చిక్కుకోవడం, కొంత మంది మరణించటం, తీవ్ర గాయాలకు గురైన అనేక ఘటనలు దేశంలో చోటుచేసుకున్నాయి. పుణెలో రైడ్-హెయిలింగ్ ఆపరేటర్ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఆర్మ్‌లో మంటలు చెలరేగడంతో ప్రభుత్వం గత నెలలో విచారణ ప్రారంభించింది. అంతకు ముందు ఎలక్ట్రిక్ వెహికల్ (EV) అగ్నిప్రమాదాలపై ప్రభుత్వం ప్రోబ్ కమిటీని నియమించింది. ఈ కమిటీ ప్రాథమిక పరిశోధనలో దాదాపు అన్ని ఎలక్ట్రిక్ టూ-వీలర్లలో అగ్ని ప్రమాదాలకు బ్యాటరీ సెల్స్, డిజైన్లలో లోపాలు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించింది.

ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దారులైన Okinawa Autotech, Boom Motor, Pure EV, Jitendra EV, Ola ఎలక్ట్రిక్‌కు చెందిన ఈ-స్కూటర్‌లలో EV మంటలు, బ్యాటరీ పేలుళ్ల ఘటనలపై ఈ కమిటీ దర్యాప్తు చేస్తోంది. ఓలా, ఒకినావా, ప్యూర్‌తో సహా అనేక EV తయారీదారులు, అటువంటి లోపానికి గురయ్యే అవకాశం ఉందని అనుమానం ఉన్న వాహనాల బ్యాచ్‌ను రీకాల్ చేయాలని ఆదేశించారని టెక్రాడార్ నివేదిక వెల్లడించింది. ఇప్పటివరకు.. ఇందులో పాల్గొన్న కంపెనీలు మొత్తం 6,000 ఎలక్ట్రిక్ వాహనాలను రీకాల్ చేశాయని నివేదిక పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Kim Jong Un: కిమ్ మామ సంచలన నిర్ణయం.. టైట్ జీన్స్, హెయిర్ కలర్ వేస్తే జైలుకే..

Telangana: సైబర్ నేరగాళ్ల కొత్త దందా.. బాధితులను మళ్లీ ఇలా మోసగిస్తున్నారు.. జాగ్రత్త మరి..

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే