Tomato Flu Virus: కేరళలో టమాటా ఫ్లూ విజృంభణ.. సరిహద్దు రాష్ట్రాలు హై అలెర్ట్
కేరళలో టమాటా ఫ్లూ కేసులు రోజు రోజుకీ పెరుగుతుండడంతో.. సరిహద్దు రాష్ట్రాలు అలెర్ట్ అయ్యాయి. కర్ణాటక హై అలర్ట్ ప్రకటించింది. మరోవైపు తమిళనాడు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవడం మొదలు పెట్టింది
Tomato Flu Virus: ప్రకృతి అందాలతో అలరించే కేరళ రాష్ట్రాన్ని రకరకాల వైరస్ లు వణికిస్తున్నాయి. దేశంలోనే కరోనా వైరస్ మొదటి కేసు.. కేరళలో నమోదు కాగా.. ఇక్కడ బర్ద్ ఫ్లూ, నిఫా వైరస్ వంటి కేసులు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూ ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు కేరళలో మరో వైరస్ వెలుగులోకి వచ్చింది. టమాటా ఫ్లూ అనే ఒక వైరస్ రాష్ట్రంలో వేగంగా వ్యాపిస్తూ.. ప్రజలు భయాందోళనకు గురి చేస్తోంది. 5 ఏళ్ల లోపు చిన్నారులు ఈ వైరస్ బారిన పడుతున్నారు.ఇప్పటికే పదుల సంఖ్యలో బాధిత చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
టమాటా ఫ్లూ వైరస్ లక్షణాలు..
ఈ టమాటా ఫ్లూ వైరస్ తో పలువురు చిన్నారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తీవ్రమైన జ్వరం, వాంతులు, ఒళ్ళు నొప్పులు, నీరసం, డీహైడ్రేషన్, విరేచనాలతో పాటు ఇతర లక్షణాలతో చికిత్స తీసుకుంటున్నారు. అంతేకాదు ఈ అరుదైన వ్యాధి సోకినవారిలో చర్మంపై ఎర్రటి బొబ్బలు ఏర్పడతాయి. అవి చూడడనికి టమాటా లుక్ లో ఉంటాయి. కనుకనే ఈ వైరస్ కు టమాటా వైరస్ గా పేరు పెట్టారు.
ఇతరలక్షణాలు
ప్రమాదకర ఈ వైరస్ కారణంగా కొల్లాంలో 80 మంది చిన్నారులు ఆసుపత్రుల పాలయ్యారు. కొందరు చిన్నారుల్లో అయితే జలుబు, దగ్గు, కడుపునొప్పి, చేతులు వంటి ఇబ్బందులతో పాటు.. మోకాళ్లు, పిరుదులు రంగు మారుతాయని నిపుణులు సూచించారు.
సరిహద్దు రాష్ట్రాలు అప్రమత్తం
ఇక కేరళలో టమాటా ఫ్లూ కేసులు రోజు రోజుకీ పెరుగుతుండడంతో.. సరిహద్దు రాష్ట్రాలు అలెర్ట్ అయ్యాయి. కర్ణాటక హై అలర్ట్ ప్రకటించింది. మరోవైపు తమిళనాడు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవడం మొదలు పెట్టింది. కేరళ- తమిళనాడు సరిహద్దుల్లోని వలయార్ గ్రామంలో ప్రత్యేక వైద్యబృందాలను ఏర్పాటు చేశారు. జ్వరంతో బాధపడుతూ చికిత్స నిమిత్తం కొయంబత్తూర్ కు వస్తున్న చిన్నారులకు తమిళనాడు వైద్యాధికారుల బృందం సరిహద్దు వద్ద పరీక్షలను నిర్వహిస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..