Goa: గోవాలో దారుణం.. పన్నెండేళ్ల రష్యన్ బాలికపై అటెండెంట్ అత్యాచారం

ప్రముఖ టూరిస్ట్ ప్లేస్ గోవాలో యాత్రికులపై దారుణాలు జరుగుతున్నాయి. వివిధ దేశాల నుంచి వచ్చే వారిని లక్ష్యంగా చేసుకుని కొందరు వ్యక్తులు దాడులకు తెగబడుతున్నారు. వారి బ్యాగులు కొట్టేయడం, డబ్బులు దొంగిలించడం...

Goa: గోవాలో దారుణం.. పన్నెండేళ్ల రష్యన్ బాలికపై అటెండెంట్ అత్యాచారం
Harassment
Follow us
Ganesh Mudavath

|

Updated on: May 12, 2022 | 1:54 PM

ప్రముఖ టూరిస్ట్ ప్లేస్ గోవాలో యాత్రికులపై దారుణాలు జరుగుతున్నాయి. వివిధ దేశాల నుంచి వచ్చే వారిని లక్ష్యంగా చేసుకుని కొందరు వ్యక్తులు దాడులకు తెగబడుతున్నారు. వారి బ్యాగులు కొట్టేయడం, డబ్బులు దొంగిలించడం వంటివే కాకుండా మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులకూ పాల్పడుతున్నారు. తాజాగా ఉత్తర గోవాలో ఇలాంటి ఘటనే జరిగింది. అరాంబోల్ లోని ఓ రిసార్ట్ లో 12 ఏళ్ల రష్యన్ బాలికపై అత్యాచారం జరిగింది. అరాంబోల్ లోని రిసార్ట్ లో రవి లమణి అనే వ్యక్తి అటెండెంట్ గా పని చేస్తున్నాడు. అదే రిసార్టు లోని ఓ రూమ్ లో రష్యాకు చెందిన తల్లీకుమార్తెలు ఉంటున్నారు. ఆరంబోల్ మార్కెట్ నుంచి సరకులు తెచ్చుకునేందుకు బాలిక తల్లి బయటకు వెళ్లింది. ఆ సమయంలో తన కుమార్తెను స్విమ్మింగ్ పూల్ వద్ద ఉండమని చెప్పి, ఆమె మార్కెట్ కు వెళ్లింది. బాలిక తల్లి లేని సమయంలో రవి.. చిన్నారిపై లైంగిక దాడి చేశాడు

. ఈ ఘటనపై బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి రవిని అరెస్టు చేశారు. బాలికపై లైంగిక దాడి అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడని.. అయితే ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే నిందితుడిని గదగ్‌లో గుర్తించి అరెస్ట్ చేశామని పోలీస్ అధికారి వెల్లడించారు. ఐపీసీ 376 సెక్షన్, గోవా చిల్డ్రన్స్ చట్టంలోని సెక్షన్ 8, పోక్సో చట్టంలోని సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

ఇవీ చదవండి

Watch Video: కొంచెం అయితే ప్రాణం పోయేది.. రెప్పపాటులో మహిళను కాపాడిన కానిస్టేబుల్.. వీడియో

PM Narendra Modi: అర్హత లేని వారికి ప్రభుత్వ పథకాలు.. ఆవేదన వ్యక్తంచేసిన ప్రధాని మోడీ

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?