PM Narendra Modi: అర్హత లేని వారికి ప్రభుత్వ పథకాలు.. ఆవేదన వ్యక్తంచేసిన ప్రధాని మోడీ

ప్రజలంతా ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవాలని.. వాటిని వినియోగించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించారు.

PM Narendra Modi: అర్హత లేని వారికి ప్రభుత్వ పథకాలు.. ఆవేదన వ్యక్తంచేసిన ప్రధాని మోడీ
Pm Modi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 12, 2022 | 12:35 PM

PM Modi – Utkarsh Samaroh: ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు సమాచారం తెలియకపోవడం వల్ల, అవి కాగితానికే పరిమితమవుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. దీనివల్ల అర్హత లేని వ్యక్తులు ప్రయోజనం పొందుతారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. గుజరాత్‌లోని బరూచ్‌లో గురువారం జరిగిన ఉత్కర్ష్ సమరోహ్‌లో ప్రధాని మోడీ వర్చువల్ ద్వారా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని ప్రజలతో ప్రత్యేకంగా సంభాషించారు. ప్రజలంతా ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవాలని.. వాటిని వినియోగించుకోవాలని ప్రధాని సూచించారు. అధికారులు కూడా వీటి గురించి ప్రజలకు వివరించాలని కోరారు. ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు తెలియకపోవడం వల్ల, అవి కాగితానికే పరిమితమవడం లేదా.. అర్హత లేని వారికి ప్రయోజనం చేకూరడం జరుగుతుందని మోదీ అభిప్రాయపడ్డారు.

కాగా.. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు కీలక పథకాలను 100 శాతం లబ్ధిదారులకు చేరువైన సందర్భంగా ఉత్కర్ష్ కార్యక్రమం నిర్వహించారు. దీని ద్వారా అవసరమైన వారికి సకాలంలో ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది. వితంతువులు, వృద్ధులు, నిరుపేద కుటుంబాలకు సహాయం అందించేందుకు వీలుగా పథకాలు పూర్తి స్థాయిలో అందించాలనే లక్ష్యంతో భరూచ్ జిల్లా యంత్రాంగం ఈ ఏడాది జనవరి 1 నుంచి మార్చి 31 వరకు ‘ఉత్కర్ష్ ఇనిషియేటివ్’ డ్రైవ్‌ను నిర్వహించింది.

నాలుగు పథకాల్లో మొత్తం 12,854 మంది లబ్ధిదారులను గుర్తించారు. గంగా స్వరూప ఆర్థిక్ సహాయ యోజన, ఇందిరా గాంధీ వృద్ధ సహాయ యోజన, నిరాధార్ వృద్ధ్ ఆర్థిక సహాయ యోజన – రాష్ట్ర కుటుంబ సహాయ యోజన పథకాలు ఉన్నాయి. డ్రైవ్ సమయంలో పథకాల ప్రయోజనాలను పొందని వారి గురించి సమాచారాన్ని సేకరించడానికి వీలుగా.. నియోజకవర్గం/తాలూకా వారీగా Whatsapp హెల్ప్‌లైన్ నంబర్‌లను ప్రకటించారు.

జిల్లాలోని అన్ని గ్రామాలు మరియు మున్సిపాలిటీ ప్రాంతాల్లోని వార్డులలో ఉత్కర్ష్ శిబిరాలు నిర్వహించారు. ఇందులో అవసరమైన పత్రాలను అందించిన దరఖాస్తుదారులకు అక్కడికక్కడే ఆమోదం లభించింది. డ్రైవ్‌ను మరింత సులభతరం చేయడానికి ఉత్కర్ష్ సహాయకులకు ప్రోత్సాహకాలు కూడా అందించారు.

Also Read: Sarkaru Vaari Paata Movie Review : సర్కారు వారి పాట… ఫ్యాన్స్ కి స్పెషల్‌గా!

North Korea: కిమ్ ఇలాకాలో ‘కరోనా’.. దెబ్బకు దేశం ‘లాక్‌డౌన్’.!