North Korea: కిమ్ ఇలాకాలో ‘కరోనా’.. దెబ్బకు దేశం ‘లాక్‌డౌన్’.!

అది నియంత పాలిస్తోన్న దేశం.. అక్కడ ఏది చేసినా తప్పే.. ఇచ్చిన ఆదేశాలు పాటించకపోతే ప్రాణాలే పోతాయి. అలాంటి దేశంలోకి కరోనా..

North Korea: కిమ్ ఇలాకాలో 'కరోనా'.. దెబ్బకు దేశం 'లాక్‌డౌన్'.!
Kim Jong Un
Follow us
Ravi Kiran

|

Updated on: May 12, 2022 | 11:49 AM

అది నియంత పాలిస్తోన్న దేశం.. అక్కడ ఏది చేసినా తప్పే.. ఇచ్చిన ఆదేశాలు పాటించకపోతే ప్రాణాలే పోతాయి. అలాంటి దేశంలోకి కరోనా ఎంటరైంది. ఇంకేముంది ఆ దేశ అధ్యక్షుడు వెంటనే అప్రమత్తమయ్యాడు. అధికారులకు హెచ్చరికలు జారీ చేశాడు. వైరస్ వ్యాప్తి వ్యాపించకుండా లాక్‌డౌన్‌లు విధించాలని ఆదేశించారు. ఇప్పటికే ఆ దేశమేంటన్నది మీకు అర్ధమై ఉంటుంది. అవునండీ.! మీరనుకుంటున్నది కరెక్టే.. అది నార్త్ కొరియా.. దాన్ని పాలిస్తోంది కిమ్ జోంగ్ ఉన్..

వివరాల్లోకి వెళ్తే.. దాదాపు రెండేళ్లుగా ఒక్క కరోనా కేసు కూడా రాలేదని గర్వంగా చెప్పుకుంటున్న నార్త్ కొరియాలో తాజాగా కరోనా కలకలం రేగింది. ఆ దేశ రాజధాని ప్యాంగ్యాంగ్‌లో పలువురికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. అందులో ఒకరికి ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ అయినట్లు కొరియన్ సెంటర్ల్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. దీనితో దెబ్బకు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అప్రమత్తమయ్యాడు. వైరస్ వ్యాప్తిని నియంత్రించడమే కాకుండా.. సంక్రమణ మూలాల్ని వీలైనంత త్వరగా కనిపెట్టి.. వాటిని రూపుమాపాలని అధికారులకు హెచ్చరికలు జారీ చేశాడు కిమ్. అలాగే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో పాటు సరిహద్దులను కూడా తక్షణమే మూసివేశాడు. వాణిజ్య, పర్యాటకులను సైతం దేశంలోకి రాకుండా అడ్డుకోవాలని ఆదేశించాడు.