Telugu News World Tibet Airlines' flight catches fire after veering off runway in China
China: టేకాఫ్ అవుతున్న విమానంలో చెలరేగిన మంటలు..వెన్నులో వణుకు పుట్టిస్తున్న వీడియో
చైనా(China)లో ఘోర ప్రమాదం జరిగింది. చాంగ్ కింగ్ జియాంగ్ బీ విమానాశ్రయంలో టేకాఫ్ అవుతున్న టిబెట్ ఎయిర్ లైన్స్(Tibet Airlines) కు చెందిన విమానంలో మంటలు చెలరేగాయి. ఘటన జరిగినప్పుడు....
చైనా(China)లో ఘోర ప్రమాదం జరిగింది. చాంగ్ కింగ్ జియాంగ్ బీ విమానాశ్రయంలో టేకాఫ్ అవుతున్న టిబెట్ ఎయిర్ లైన్స్(Tibet Airlines) కు చెందిన విమానంలో మంటలు చెలరేగాయి. ఘటన జరిగినప్పుడు విమానంలో మొత్తం 113 మంది ప్రయాణికులతో పాటు, 9 మంది సిబ్బంది ఉన్నారు. సిబ్బంది అప్రమత్తమై ప్రయాణికులను దించేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో 25 మందికి గాయాలయ్యాయి. టిబెట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం నింగ్చి ప్రాంతానికి బయల్దేరుతుండగా ఈ ఘటన జరిగింది. విమానంలో అసాధారణ పరిస్థితులను గుర్తించిన సిబ్బంది వెంటనే టేకాఫ్ చేయకుండా నిలిపివేశారు. అయినా.. అప్పటికే భారీగా మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనలకు గరుయ్యారు. ప్రాణభయంతో హాహాకారాలు చేశారు. సిబ్బంది వెంటనే అప్రమత్తమై వారిని వెనుకవైపు ఉన్న ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి ప్రయాణీకులను కిందికి పంపించేశారు. గాయపడ్డ వారికి చికిత్స అందించేందుకు ఆసుపత్రికి తరలించారు. మంటల్లో విమానం కాలిపోతున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
— ChinaAviationReview (@ChinaAvReview) May 12, 2022
మరోవైపు.. చైనాలో ఇటీవలే ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మార్చి 12న కున్మింగ్ నుంచి గాంగ్‌ఝౌ వెళ్తోన్న విమానం గుయాంగ్జీ ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ఘటనలో 132 మంది ప్రయాణికులు, సిబ్బంది మృత్యువాత పడ్డారు. అయితే రెండు నెలల వ్యవధిలోనే మరోసారి ప్రమాదం జరగడంపై అధికారులు, సిబ్బంది అలర్ట్ అయ్యారు. ప్రమాదానికి గల కారణాలను అన్వేషించే పనిలో నిమగ్నమయ్యారు.
మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి