Potato Side Effects: అతిగా బంగాళదుంపలను తింటున్నారా..? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..
బంగాళదుంప(Potato)ను కూరగాయల(Vegitable)లో రారాజుగా పరిగణిస్తారు. అయితే దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా? వారంలో ఎక్కువ రోజులు అలుగడ్డ తినడం వల్ల అనేక దుష్ర్పభావాలు ఎదుర్కొనే అవకాశం ఉందని...
బంగాళదుంప(Potato)ను కూరగాయల(Vegitable)లో రారాజుగా పరిగణిస్తారు. అయితే దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా? వారంలో ఎక్కువ రోజులు అలుగడ్డ తినడం వల్ల అనేక దుష్ర్పభావాలు ఎదుర్కొనే అవకాశం ఉందని.. దీని వల్ల బరువు(Weight) పెరగడం సహా మధుమేహం బారిన పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. మీరు బంగాళదుంపలను అధికంగా తింటుంటే.. దాని వల్ల మీరు అలెర్జీకి గురయ్యే అవకాశం ఉంటుందట. అలుగడ్డలో ఉండే కార్బోహైడ్రేట్ కీళ్లనొప్పులను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఆర్థరైటిస్ రోగులు ఎక్కువగా బంగాళదుంపలను తినకూడదట. బంగాళదుంపల అధిక వినియోగం వల్ల మధుమేహ వ్యాధి బారిన పడే అవకాశం మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
బ్లడ్‌లోని షుగర్‌ను నియంత్రించేందుకు బంగాళదుంపలు ఏమాత్రం సహకరించదట. దీంతో షుగర్ వ్యాధిగ్రస్తులు బంగాళదుంపలు తినకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. అలుగడ్డ అధిక వినియోగం రక్తపోటును కూడా పెంచుతుంది. అంటే బీపీ రోగులు బంగాళదుంపలు ఎక్కువగా తినకూడదు. అలా తినడం వల్ల రక్తపోటు పెరుగుతుందట. బంగాళదుంపలలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. దీని కారణంగా అధిక మొత్తంలో కేలరీలు పెరుగుతాయి. ఇది ఊబకాయానికి దారి తీస్తుంది. అలుగడ్డ చిప్స్ ఎక్కువగా తినడం వలన వంధ్యత్వానికి దారితీస్తుంది. కొవ్వులు, కొలెస్ట్రాల్ ఉనికి పునర్పుత్తి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాలను చూపిస్తుందట.
Note:- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.
Read Also.. Muskmelon Benefits: వేసవిలో కర్బూజను తింటున్నారా..? అయితే.. ఈ విషయాలపై లుక్కేయాల్సిందే..