- Telugu News Photo Gallery Health Care Tips Never drink mango shake like this otherwise you can face these health problems Know the Details
Health Care Tips: వేసవిలో మామిడికాయ షేక్‌ని అస్సలు తాగకండి.. ఇవి ఆరోగ్యానికి హానీ కలిగిస్తాయి..
Mango shake side effects: వేసవిలో మ్యాంగో షేక్‌ని ఎక్కువగా తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మ్యాంగ్ షేక్‌లో ఉండే రెండు విషయాల స్వభావం భిన్నంగా ఉంటుంది. మామిడిపండులో పులుపు, తీపి, పాలలోని తీపి ఉంటాయి. వీటి మిక్స్ చేసిన షేక్స్‌ని ఎక్కువగా తాగడం వలన నష్టపోవాల్సి రావచ్చు. మ్యాంగో షేక్స్ తాగడం వల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: May 12, 2022 | 6:00 AM

వేసవిలో మ్యాంగో షేక్‌ని ఎక్కువగా తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మ్యాంగ్ షేక్‌లో ఉండే రెండు విషయాల స్వభావం భిన్నంగా ఉంటుంది. మామిడిపండులో పులుపు, తీపి, పాలలోని తీపి ఉంటాయి. వీటి మిక్స్ చేసిన షేక్స్‌ని ఎక్కువగా తాగడం వలన నష్టపోవాల్సి రావచ్చు. మ్యాంగో షేక్స్ తాగడం వల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉదర సంబంధిత సమస్యలు: వైద్యుల అభిప్రాయం ప్రకారం, మామిడి షేక్‌ను ఎక్కువగా తాగితే అది కడుపు నొప్పిని కలిగిస్తుంది. విరేచనాల సమస్య తలెత్తవచ్చు. కడుపు నొప్పి కారణంగా వాంతి సమస్య కూడా తలెత్తుతుంది.

శరీరంలో వేడి: మామిడిలో సహజంగానే వేడిని కలిగించే లక్షణాలు ఉంటాయి. ఐస్ మిక్స్ చేసి తాగినా.. మామిడి దాని లక్షణాన్ని కోల్పోదు. కడుపులోకి వెళ్లాక దాని ప్రభావాన్ని చూపుతుంది. మ్యాంగో షేక్స్ ఎక్కువగా తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అందుకే మ్యాంగో షేక్స్‌ని వీలైనంత తక్కువగా తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.

స్కిన్ అలర్జీ: మామిడి, పాలు కలయిక చర్మంపై అలెర్జీని కలిగిస్తుంది. ఇప్పటికే అలర్జీ సమస్య ఉంటే మ్యాంగో షేక్ తాగే ముందు తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి.

బరువు పెరుగుట: మామిడి పండ్లలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. పాలు కొవ్వుతో కూడినవి. ఈ రెంటిని మిక్స్‌గా ఎక్కువగా తాగడం వల్ల క్రమంగా బరువు పెరగడం మొదలై ఏదో ఒకరోజు ఊబకాయానికి గురవుతారు.





























