Telugu News » Photo gallery » Skin Care Tips Fallow These Tips for Rid of Dark Spots on Body Skin
Skin Care Tips: స్నానం చేసే ముందు ఇలా చేస్తే చేతులు, పాదాలపై మచ్చలు మాయం..!
చేతులు, కాళ్లపై నల్ల మచ్చలు చాలా మందికి ఉంటాయి. ఇవి సులభంగా పైకి కనిపిస్తాయి. అయితే, అందాన్ని పాడుచేసే మరకలను తొలగించుకోవాలంటే స్నానం చేసే ముందు కొన్ని చర్యలు తీసుకుంటే చాలని బ్యూటీషియన్స్ సలహా ఇస్తున్నారు. ఆ సలహాలను పాటించడం ద్వారా ఒక వారం రోజుల్లో మచ్చల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చునని చెబుతున్నారు. మరి ఆ సలహాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
ఓట్స్, తేనె: ముఖంపైనే కాకుండా చేతులు, కాళ్లపై ఉన్న మచ్చలను తొలగించడానికి మీరు ఓట్ మీల్, తేనె సహాయం తీసుకోవచ్చు. ఒక పాత్రను తీసుకుని అందులో 3 నుంచి 4 చెంచాల గ్రైండ్ చేసిన ఓట్స్ వేసి దానికి రెండు చెంచాల తేనె కలపండి. ఇప్పుడు మచ్చలు ఉన్న ప్రతిచోటా ఈ పేస్ట్‌తో స్క్రబ్ చేయండి. తక్కువ సమయంలోనే ఈ రెసిపీ ప్రభావం చూపడం ప్రారంభమవుతుంది.
2 / 5
కొంజాక్ స్పాంజ్: ఇది ఒక రకమైన ఎక్స్‌ఫోలియేషన్ స్పాంజ్, ఇది ప్రస్తుతం ట్రెండ్‌లో ఉంది. మార్కెట్లో సులభంగా లభించే ఈ ఉత్పత్తితో చేతులు లేదా కాళ్లను నిరంతరం స్క్రబ్ చేయండి. ఇది ఉత్తమ ఫలితాలనిస్తుంది.
3 / 5
తేనె, ఆలివ్ ఆయిల్: ఈ రెండు పదార్థాలు చర్మాన్ని మెరుగ్గా మాయిశ్చరైజ్ చేస్తాయి. డ్యామేజ్ లేదా డ్రై స్కిన్ ఉన్న వారికి మచ్చలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సమస్యతో బాధపడేవారు.. ఈ పేస్ట్‌ను మసాజ్ చేయాలి. ఇలా దాదాపు 10 నిమిషాల పాటు చేసి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
4 / 5
నిమ్మకాయ, చక్కెర: నిమ్మకాయలో విటమిన్ సి ఉండటం వల్ల చర్మ సంరక్షణలో ఇది చాలా మంచిదని భావిస్తారు. విటమిన్ సి చర్మ సమస్యలను దూరం చేసి మెరిసేలా చేస్తుంది. సగం నిమ్మకాయ రసంలో సరిపడా చెక్కర మిక్స్ చేసిన మచ్చలు ఉన్న ప్రదేశంలో స్క్రబ్ చేయాలి.