Gyanvapi Mosque Case: వారణాసి జ్ఞానవాపి మసీదు వివాదంపై కోర్టు కీలక తీర్పు.. సర్వే కొనసాగింపునకు ఆదేశం

జ్ఞానవాపి మసీదులో సర్వే నిర్వహించడాన్ని మసీదు సంరక్షణ కమిటీ తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో అధికారులు సర్వేను నిలిపివేశారు. ఇదే అంశంపై కోర్టు మరోసారి స్పష్టమైన ఆదేశాలిచ్చింది. రేపు సర్వే చేసి ఈనెల 17నాటికి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

Gyanvapi Mosque Case: వారణాసి జ్ఞానవాపి మసీదు వివాదంపై కోర్టు కీలక తీర్పు.. సర్వే కొనసాగింపునకు ఆదేశం
Gyanvapi Mosque Case
Follow us
Surya Kala

|

Updated on: May 12, 2022 | 4:05 PM

Gyanvapi Mosque Case: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) వారణాసి (Varanasi) జ్ఞానవాపి మసీదు వివాదంపై కోర్టు కీలక తీర్పునిచ్చింది. మసీదులో వీడియోగ్రఫీతోపాటు సర్వే కమిషన్‌ను కొనసాగించాలని సూచించింది. మసీదులో రేపు కూడా సర్వే జరిపి ఈ నెల17లోపు నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించింది కోర్టు. సర్వే కమిషన్‌లో కొత్తగా మరో ఇద్దరు న్యాయవాదులకు అవకాశం కల్పించింది.

జ్ఞాన్‌వాపి మసీదు గోడ వెనుక ఉన్న హిందూ మందిరంలో ప్రార్థన చేయడానికి ఏడాది పాటు అనుమతి కోరుతూ .. ఢిల్లీకి చెందిన ఐదుగురు హిందూ మహిళలు రాఖీ సింగ్, లక్ష్మీ దేవి, సీతా సాహు తదితరులు ఏప్రిల్‌లో కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన జడ్జి దివాకర్ ఈ మసీదు సర్వే, వీడియోగ్రఫీ కోసం ఆదేశించింది. మే 10లోగా నివేదిక సమర్పించాలని కోర్టు గతంలోనే అధికారులను ఆదేశించింది.

కోర్టు ఆదేశాలతో మసీదులో సర్వే ప్రారంభించారు అధికారులు. మసీదులో సర్వే నిర్వహించడాన్ని మసీదు సంరక్షణ కమిటీ తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో అధికారులు సర్వేను నిలిపివేశారు. ఇదే అంశంపై కోర్టు మరోసారి స్పష్టమైన ఆదేశాలిచ్చింది. రేపు సర్వే చేసి ఈనెల 17నాటికి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

జ్ఞానవాపి మసీదు వెలుపలి గోడపై ఉన్న శృంగార గౌరి, గణేశుడు, హనుమంతుడు, నందీశ్వరులను ప్రతి రోజూ పూజించేందుకు అవకాశం కల్పించాలని పిటిషనర్లు కోర్టును కోరారు. వీరు గత ఏడాది ఏప్రిల్ 18న కోర్టును ఆశ్రయించారు. ఈ విగ్రహాలకు ఎటువంటి నష్టం చేయరాదని మసీదు కమిటీని ఆదేశించాలని కోరారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..