తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో బుధవారం ఒక పాము ప్రత్యక్షమై తీవ్ర కలకలం సృష్టించింది. మీడియా పాయింట్ సమీపంలో పామును చూసి ప్రతినిధులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. అదే సమయంలో అక్కడే ఉన్న ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ చాకచక్యంగా వ్యవహరించి పామును పట్టుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భద్రతా దృష్ట్యా అసెంబ్లీ సిబ్బంది స్నేక్ క్యాచర్‌ను పిలిపించి ఆవరణను తనిఖీ చేయాలని కోరుతున్నారు.